షాకింగ్ డెసీషన్: సుడిగాలి సుధీర్‌పై ఆ రెండింటి ప్రభావం.. ఇకపై అవి తగ్గిస్తాడట.!

By Manoj Kumar P

బుల్లితెర నుంచి వచ్చి రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ స్థాయిలో పాపులారిటీని సొంతం చేసుకున్న వారిలో సుడిగాలి సుధీర్ ఒకడు. జబర్ధస్త్ అనే కార్యక్రమం ద్వారా ఇండస్ట్రీకి పరిచయం అయిన అతడు.. తక్కువ వ్యవధిలోనే ఎక్కువ గుర్తింపును సంపాదించుకున్నాడు. దీంతో ఆ షోలో టీమ్ లీడర్ అయిపోయాడు. ఆ తర్వాత సుధీర్ క్రేజ్ మరింత పెరిగిపోయింది. ఈ క్రమంలోనే చాలా షోలకు యాంకర్‌గానూ వ్యవహరిస్తున్నాడు. అదే సమయంలో సినిమాల్లోనూ నటిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఇకపై అవి తగ్గించుకోవాలని సుధీర్ షాకింగ్ డెసీషన్ తీసుకున్నాడట. ఆ వివరాలు మీకోసం.!

సుడిగాలి సుధీర్.. బుల్లితెర ఆల్‌రౌండర్

సుడిగాలి సుధీర్.. బుల్లితెర ఆల్‌రౌండర్

కెరీర్ ఆరంభంలో సుడిగాలి సుధీర్ మ్యాజిక్ షోలు చేస్తూ ఉండేవాడు. జబర్ధస్త్ షో ద్వారా వెలుగులోకి వచ్చిన తర్వాత అతడి లైఫ్ అమాంతం మారిపోయింది. అయినప్పటికీ తనలోని నైపుణ్యాలను ఒక్కొక్కటిగా బయటకు తీసుకు వస్తున్నాడు. ఈ క్రమంలోనే యాక్టర్‌గా, డ్యాన్సర్‌గా, సింగర్‌గా, కమెడియన్‌గా, మెజీషియన్‌గా రాణిస్తూ ఆల్‌రౌండర్ అనిపించుకుంటున్నారు.

యాంకర్ రష్మీతో సుధీర్ ప్రేమాయణం

యాంకర్ రష్మీతో సుధీర్ ప్రేమాయణం

సుధీర్ కెరీర్‌లో హాట్ యాంకర్ రష్మీ గౌతమ్ పాత్ర ఎంతో ముఖ్యమైనది అని చెప్పవచ్చు. ఆమెతో ప్రేమాయణం సాగిస్తున్నాడని ప్రచారం మొదలైన తర్వాతనే మనోడు మరింత పాపులర్ అయ్యాడు. ఆ తర్వాత వీళ్లిద్దరిని టార్గెట్ చేసి స్క్రిప్టులు రాయడం వల్ల జబర్ధస్త్‌కు బాగా ప్లస్ అయింది. దీంతో వీళ్లిద్దరిపై యూట్యూబ్‌లో గతంలో ఎవరిపై రానన్ని పుకార్లు వచ్చాయి.

రష్మీ లేకపోతే నేను లేనన్న సుధీర్

రష్మీ లేకపోతే నేను లేనన్న సుధీర్

జబర్ధస్త్‌లోనే కాకుండా ‘ఢీ' అనే డ్యాన్స్ షోలోనూ సుధీర్, రష్మీ కలిసి పని చేస్తున్నారు. దీంతో వీళ్లపై రూమర్లు మరింతగా పెరిగిపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో తన సక్సెస్ గురించి మాట్లాడిన సుధీర్.. ‘నా ఎదుగుదలకు జబర్ధస్త్ ఎంత కారణమో.. రష్మీ కూడా అంతే కారణం. ఆమె లేకపోతే నేను ఈ స్థాయిలో ఉండేవాడిని కాదు' అని భావోద్వేగంగా వెల్లడించాడు.

అక్కడ కూడా సత్తా చాటిన కమెడియన్

అక్కడ కూడా సత్తా చాటిన కమెడియన్

కమెడియన్‌గా, యాంకర్‌గా, టీమ్ లీడర్‌గా బుల్లితెరపై ఓ వెలుగు వెలుగుతున్నాడు సుడిగాలి సుధీర్. అదే సమయంలో ‘అడ్డా' అనే మూవీతో టాలీవుడ్‌లోకీ ఎంటర్ అయ్యాడు. ఇప్పటి వరకు దాదాపు 20కి పైగా సినిమాల్లో నటించాడు. వాటిలో ‘రేసుగుర్రం', ‘సర్ధార్ గబ్బర్ సింగ్', ‘సినిమా చూపిస్త మావ', ‘నేను శైలజ', ‘మిడిల్ క్లాస్ అబ్బాయి' మంచి గుర్తింపును తెచ్చాయి.

సుడిగాలి సుధీర్‌పై ఆ రెండింటి ప్రభావం

సుడిగాలి సుధీర్‌పై ఆ రెండింటి ప్రభావం

ఇప్పటి వరకు క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తూ వచ్చిన సుడిగాలి సుధీర్.. కొద్ది రోజుల క్రితం హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. రాజశేఖర్‌ రెడ్డి పులిచర్ల తెరకెక్కించిన ‘సాఫ్ట్‌వేర్ సుధీర్'లో సోలో హీరోగా నటించాడు. ఆ తర్వాత తన ఇద్దరు స్నేహితులు రాం ప్రసాద్, గెటప్ శ్రీనుతో కలిసి ‘త్రీ మంకీస్' అనే మూవీలో చేశాడు. ఈ రెండూ బాక్సాఫీస్ ముందు బోల్తా పడ్డాయి.

Recommended Video

Getup Srinu Comments On Naga Babu Re Entry Into Jabardasth
సుధీర్ షాకింగ్ డెసీషన్.. అవి తగ్గిస్తాడట

సుధీర్ షాకింగ్ డెసీషన్.. అవి తగ్గిస్తాడట

హీరోగా నటించిన రెండు సినిమాలు అంతగా ఆడకపోవడంతో సుధీర్ షాకింగ్ డెసీషన్ తీసుకున్నాడని తాజాగా ఓ వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. దీని ప్రకారం.. అతడు కొద్ది సమయం పాటు హీరోగా నటించడట. సినిమాల్లో ప్రాధాన్యం ఉన్న ఫ్రెండ్ పాత్రలు మాత్రం చేస్తాడని తెలిసింది. అయితే, అతడు అనుకుంటున్న సమయం నెలల, సంవత్సరాల అన్నది తెలియాల్సి ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X