For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  బుల్లితెర కింగ్ సుడిగాలి సుధీరే.. సుమ, నాగబాబులని వెనక్కి నెట్టి మరీ టాప్ ప్లేస్!

  |

  తెలుగు బుల్లితెర స్టార్స్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయక్కర లేదు. తెలుగులో సినిమా హీరోలకు ఎంత క్రేజ్ ఉందో స్టార్లకు కూడా అంతే క్రేజ్ ఉంది అని అందరికీ తెలిసిందే. మరీ ముఖ్యంగా తెలుగు టెలివిజన్ క్యారెక్టర్లు అంటే సీరియల్స్ లో పాత్రధారులు కాకుండా వివిధ షోలకు యాంకర్లుగా, జడ్జీలుగా వ్యవహరిస్తున్న వారి లిస్టులో సుడిగాలి సుధీర్ టాప్ ప్లేస్లో నిలిచాడు.

  జబర్దస్త్ ద్వారా పరిచయమైన సుడిగాలి సుధీర్ ద్వారా చాలా పాపులారిటీ సంపాదించారు. ఒక ప్రముఖ మీడియా సంస్థ సోషల్ మీడియాలో ఫాలోయింగ్ ని బట్టి కొన్ని సర్వేలు నిర్వహిస్తూ ఉంటుంది. ఆ సర్వేలో జూలై నెలలో ఐదుగురుని సెలెక్ట్ చేసింది. ఇక ఈ లిస్ట్ లో టాప్ ఫైవ్ లో ఎవరున్నారు అనే వివరాలు పరిశీలిద్దాం.

  సుడిగాలి సుధీర్

  సుడిగాలి సుధీర్

  ముందుగా టాప్ ప్లేస్ లో సుడిగాలి సుధీర్ నిలిచాడు ఈటీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ కార్యక్రమం ద్వారా సుడిగాలి సుధీర్ వెలుగులోకి వచ్చాడు. నటుడిగా రాణించాలనే కోరికతో హైదరాబాద్ చేరిన సుడిగాలి సుధీర్ మొదట్లో మెజీషియన్ గా అనేక చోట్ల షోలు చేస్తూ ఉండేవాడు.

  అనుకోకుండా జబర్దస్త్ లో అవకాశం రావడంతో తన టాలెంట్ నిరూపించుకున్న సుధీర్ ఎవరికీ అందనంత ఎత్తులో నిలుస్తూ ఒక పక్క జబర్దస్త్ లో టీం లీడర్ గా వ్యవహరిస్తూ మరో పక్క లాంటి ప్రతిష్టాత్మక షోకి ఒక టీం మెంబర్ గా వ్యవహరిస్తూ ముందుకు వెళుతున్నాడు. ఈ మీడియా సంస్థ నిర్వహించిన సర్వేలో ఆయనకు మోస్ట్ పాపులర్ లిస్ట్ లో మొదటి స్థానం దక్కింది.

  హైపర్ ఆది

  హైపర్ ఆది

  ఇక ఈ లిస్ట్ లో రెండో స్థానం దక్కించుకున్నాడు హైపర్ ఆది. ఇంజనీరింగ్ పూర్తి చేసి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పని చేస్తున్న ఆది నటన మీద మక్కువతో ఒక షార్ట్ ఫిలిం చేసి ఫేస్బుక్ లో పెట్టడంతో అదిరే అభి జబర్దస్త్ కమెడియన్ కంట్లో పడింది. ఆయన ఆహ్వానం మేరకు జబర్దస్త్ హైపర్ ఆది అనతి కాలంలోనే ఒక టీం లీడర్ గా ఎదిగాడు. అలాగే సుడిగాలి సుధీర్ డీ షోలో ఆయనతో పాటు ఒక మెంటల్ గా వ్యవహరిస్తూ రచ్చ చేస్తున్నారు. ఈ లిస్టులో ఆయనకు రెండో స్థానం లభించింది.

  ఓంకార్

  ఓంకార్


  ఇక యాంకర్ ఓంకార్ కి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. అనేక డాన్స్ షో లు అలాగే పిల్లలకు సంబంధించిన మాయాద్వీపం షో ద్వారా ఆయన చాలా పాపులర్ అయ్యాడు. ఈ మధ్యకాలంలో దర్శకుడిగా మరికొన్ని సినిమాలు చేసిన ఆయన ప్రస్తుతం సిక్స్త్ సెన్స్ షో చేస్తున్నాడు. అలాగే సూపర్ డాన్స్ అనే ఒక రియాలిటీ షో కూడా ఒక సీజన్ పూర్తయింది. ఇక ఈ లిస్ట్ లో ఆయనకు మూడవ స్థానం లభించింది

  సుమ

  సుమ

  యాంకర్ సుమ టెలివిజన్ చరిత్రలో యాంకర్ గా కొనసాగుతున్న వ్యక్తులలో ఒకరు గా నిలిచిపోతారు ఏమో. తనదైన టైమింగ్ లో తనదైన పంచులతో సుమ అందరినీ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఒక పక్క టెలివిజన్ షోలతో బిజీగా ఉంటూనే మరొక మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్, ఆడియో ఈవెంట్ లు కూడా చేస్తూ ఆమె రెండు చేతులా సంపాదిస్తూ ఉంటుంది. అలా ఆమె ఈ లిస్టు లో నాలుగో స్థానానికి పరిమితం కావాల్సి వచ్చింది.

  నాగబాబు

  నాగబాబు

  ఇక మెగా బ్రదర్ నాగబాబు జబర్దస్త్ షో ద్వారా బుల్లితెర ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. జబర్దస్త్ ప్రారంభమైన నాటి నుంచి ఆయన జబర్దస్త్ ప్రోగ్రామ్ కు జడ్జ్ గా వ్యవహరిస్తూ ఉండేవారు. అయితే కొన్నాళ్ల క్రితం ఆయన జబర్దస్త్ ప్రోగ్రాం నుంచి తప్పుకుని జీ తెలుగులో ప్రసారం అయిన అదిరింది షోలో జడ్జిగా వ్యవహరించారు. ఇక ప్రస్తుతానికి నాగబాబు టీవీ పరంగా ఎలాంటి షోలు చేయకపోయినా ఆయన ఐదో స్థానంలో నిలవడం ఆసక్తికరమనే చెప్పాలి. ఇక ఈ వివరాలన్నీ కూడా జూలై నెల సదరు సంస్థ చేసిన సర్వేలో వెల్లడి అయ్యాయి.

  English summary
  sudigali sudheer tops the list of Ormax Most popular non-fiction personalities on Telugu television.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X