సర్‌ప్రైజ్ చేసిన సుడిగాలి సుధీర్ కవల సోదరుడు: అచ్చం ఇద్దరూ ఒకేలా ఉండడంతో అంతా షాక్!

తెలుగు బుల్లితెరపైకి ఈ మధ్య కాలంలో ఎంతో మంది టాలెంట్ ఉన్న నటీనటులు ఎంట్రీ ఇచ్చారు. అందులో చాలా మంది జబర్ధస్త్ షో ద్వారానే ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. అలాంటి వారిలో టాప్ కమెడియన్ సుడిగాలి సుధీర్ ఒకడు. అసలే మాత్రం అంచనాలు లేకుండానే ఆ షోలో అడుగు పెట్టిన అతడు.. చాలా తక్కువ సమయంలోనే తన టాలెంట్లను చూపించి స్టార్‌గా ఎదిగిపోయాడు. అదే సమయంలో సినిమాల్లోనూ నటిస్తూ సత్తా చాటాడు. ఇక, ఇటీవలే 'శ్రీదేవి డ్రామా కంపెనీ' షోతో యాంకర్‌గా రీఎంట్రీ ఇచ్చాడు. ఈ నేపథ్యంలో ఆ షోకు తాజాగా సుడిగాలి సుధీర్ కవల సోదరుడు ఎంట్రీ ఇచ్చాడు. దీంతో అందరూ షాక్ అయ్యారు. ఆ సంగతులేంటో చూద్దాం పదండి!

మ్యాజిక్‌ల నుంచి జబర్ధస్త్‌గా మారిపోయాడు

మ్యాజిక్‌ల నుంచి జబర్ధస్త్‌గా మారిపోయాడు

సుధీర్.. మ్యాజిక్‌లు చేసుకుంటూ తన ప్రయాణాన్ని మొదలు పెట్టాడు. ఈ క్రమంలోనే ఎన్నో ఛానెళ్లలో మెజీషియన్‌గా కనిపించాడు. అలాంటి సమయంలోనే జబర్ధస్త్ కమెడియన్ల దృష్టిలో పడడంతో అందులోకి ఆర్టిస్టుగా ఎంట్రీ ఇచ్చాడు. అలా పరిచయం అయిన చాలా తక్కువ సమయంలోనే సత్తా చాటాడు. దీంతో అతడికి టీమ్ లీడర్‌గా ప్రమోషన్ ఇచ్చారు షో నిర్వహకులు.

రష్మీ వల్ల మరింత పాపులర్.. ఇప్పటికీ అదే

రష్మీ వల్ల మరింత పాపులర్.. ఇప్పటికీ అదే

సుడిగాలి సుధీర్ తన టాలెంట్లు అన్నింటినీ చూపిస్తూ భారీ స్థాయిలో క్రేజ్‌ను సంపాదించుకున్నాడు. అదే సమయంలో యాంకర్ రష్మీ గౌతమ్‌తో లవ్ ట్రాక్ నడుపుతున్నాడన్న వార్తలతో ఓ రేంజ్‌లో పాపులర్ అయ్యాడు. చాలా కాలంగా ఆమెతో వ్యవహారం నడుపుతున్నట్లు కనిపిస్తున్నాడు. దీంతో అప్పటి నుంచి ఇప్పటి వరకూ వీళ్లిద్దరూ లవర్సే అని అంతా అనుకుంటున్నారు.

బుల్లితెరపైనే కాదు.. సినిమాల్లోనూ సందడి

బుల్లితెరపైనే కాదు.. సినిమాల్లోనూ సందడి

సుదీర్ఘమైన కెరీర్‌లో తనదైన శైలి కామెడీతో బుల్లితెరపై తిరుగులేని ఆర్టిస్టుగా వెలుగొందుతున్నాడు సుధీర్. ఈ క్రమంలోనే సినిమాల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చాడు. ఇలా ఇప్పటికే ఎన్నో సినిమాల్లో మంచి మంచి పాత్రలను పోషించాడు. అలాగే హీరోగానూ మారి చేసిన 'సాఫ్ట్‌వేర్ సుధీర్', 'త్రీమంకీస్' మాత్రం నిరాశ పరిచాయి. ఇప్పుడు సుధీర్ హీరోగా 'కాలింగ్ సహస్రా', 'గాలోడు' చేస్తున్నాడు.

మరోసారి యాంకర్‌గా... శ్రీదేవి కోసం సత్తా

మరోసారి యాంకర్‌గా... శ్రీదేవి కోసం సత్తా


సుడిగాలి సుధీర్ కొన్నేళ్ల క్రితం 'పోవే పోరా' అనే షోతో యాంకర్‌గానూ మారిన విషయం తెలిసిందే. హోస్టుగానూ తన మార్క్‌ను చూపించి ఆకట్టుకున్నాడు. కానీ, ఆ షోతో యాంకరింగ్‌ను ఆపేశాడు. ఇలాంటి సమయంలో ప్రముఖ ఛానెల్‌లో వస్తున్న 'శ్రీదేవి డ్రామా కంపెనీ' అనే షోతో మరోసారి యాంకర్‌గా ఎంట్రీ మారాడు. అందులో ప్రత్యేకమైన మేనరిజంతో హోస్టింగ్ చేస్తూ సందడి చేస్తున్నాడు.

చిరంజీవి బర్త్‌డే.. రాఖీ స్పెషల్‌గా ప్రోగ్రామ్

చిరంజీవి బర్త్‌డే.. రాఖీ స్పెషల్‌గా ప్రోగ్రామ్

వచ్చే ఆదివారం ప్రసారం కాబోతున్న 'శ్రీదేవి డ్రామా కంపెనీ' షోకు సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది. ఈ ఎపిసోడ్ కవల పిల్లల స్పెషల్‌గా వచ్చింది. ఇందులో చాలా మంది ట్విన్స్ కనిపించి సందడి చేశారు. వాళ్లంతా ఆటపాటలతో ప్రేక్షకులను ఎంతగానో అలరించారు. దీంతో ఈ 'శ్రీదేవి డ్రామా కంపెనీ' ప్రోమో వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయిపోతోంది.

సర్‌ప్రైజ్ చేసిన సుధీర్ కవల సోదరుడు


ఆద్యంతం ఎంతో సందడిగా సాగిన 'శ్రీదేవి డ్రామా కంపెనీ' వచ్చే వారం ఎపిసోడ్‌లో పలు ప్రాంతాల నుంచి కవల పిల్లలు ఎంట్రీ ఇచ్చారు. అలాగే, కొన్ని ఫ్యామిలీలు కూడా వచ్చాయి. ఇందులో భాగంగా తమ ఆనందాన్ని, బాధలను వాళ్లంతా పంచుకున్నారు. అలాగే, ఆది ఓ స్కిట్ కూడా చేశాడు. ఇక, చివర్లో సుడిగాలి సుధీర్ కవల సోదరుడు అంటూ ఒకరు సర్‌ప్రైజ్ ఎంట్రీ ఇచ్చారు.

Recommended Video

Prabhas Special Interview With Sridevi Soda Center Team
ఇద్దరూ ఒకేలా ఉండడంతో అంతా షాక్

ఇద్దరూ ఒకేలా ఉండడంతో అంతా షాక్

గతంలో సుడిగాలి సుధీర్‌కు సంబంధించిన ఓ పాత ఫొటోను షోలో చూపించారు. అందులో రింగుల జుట్టుతో నూనూగు మీసాలతో అతడు కనిపించాడు. దాన్ని దృష్టిలో ఉంచుకుని ఇప్పుడు సోషల్ మీడియాలో ఆవేశం స్టార్ అనే పేరును తెచ్చుకున్న కుర్రాడు సుడిగాలి సుధీర్ కవల సోదరుడిని అంటూ షోలోకి వచ్చాడు. అప్పుడు పాత ఫొటోలో ఉన్న సుధీర్‌ను ఆవేశం స్టార్‌తో పోల్చి చూపించగా.. ఇద్దరూ అచ్చం ఒకేలా ఉన్నారు. దీంతో అక్కడున్న వాళ్లంతా షాక్ అయ్యారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X