For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  సుధీర్‌కు కరోనా.. కంటతడి పెట్టించేశాడు.. ఆ విషయంలో అతడిని మించినవాడు లేడు!!

  |

  సుడిగాలి సుధీర్ బుల్లితెరపై ఎంతటి క్రేజ్‌ను సంపాదించుకున్నాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చిన్న స్థాయి నుంచి అంచలంచెలుగా ఎదుగుతూ స్టార్ స్టేటస్‌ను సొంతం చేసుకున్నాడు. బుల్లితెరపై వచ్చిన క్రేజ్ ద్వారా వెండితెరపై హీరోగా నిలబడేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఈ క్రమంలోనే వరుసగా ప్రాజెక్ట్‌లు చేస్తూ వస్తున్నాడు. తనకు జీవితాన్ని ఇచ్చిన బుల్లితెరను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలి పెట్టనని చెప్పే సుధీర్.. తాజాగా తన నటనతో అందర్నీ కంటతడి పెట్టించాడు.

  మ్యాజిక్ షోలతో..

  మ్యాజిక్ షోలతో..

  సినీ ఇండస్ట్రీలోకి రాకముందు సుధీర్ మ్యాజిక్ షోలు చేసుకుంటూ జీవితాన్ని గడిపేవాడు. అలా ముందుకు సాగుతూ ఉండగా జబర్దస్త్ అవకాశాలు రావడం, అక్కడ మొదట కంటెస్టెంట్‌గా కెరీర్ ప్రారంభించి.. మెల్లిమెల్లిగా టీమ్ లీడర్‌గా మారడం జరిగింది. ఇక టీం లీడర్ అయ్యాక సుడగాలి సుధీర్ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరమే రాలేదు.

  స్పెషల్ టాలెంట్స్..

  స్పెషల్ టాలెంట్స్..

  సుడిగాలి సుధీర్ కేవలం నవ్వించడమే కాదు గుండెలు పిండేసేలా ఏడిపించనూ గలడు. డ్యాన్సులు, మ్యాజిక్ షోలు, అడ్వంచర్ యాక్షన్ సీక్వెన్స్ ఇలా ఎన్నెన్నో టాలెంట్స్ సుధీర్ సొంతం. మల్లెమాల వారు ప్రతీ పండగకి చేసే స్పెషల్ ఈవెంట్స్‌లో సుధీర్ పాత్ర ముఖ్యమైంది. సుధీర్ లేని స్పెషల్ ఈవెంట్స్ అసలే ఉండవు.

  వినాయక చవితి స్పెషల్..

  వినాయక చవితి స్పెషల్..

  ఈ వినాయకు చవితికి 2020 అనుకున్నది ఒకటి అయినది ఒకటి అనే ఈవెంట్ చేయబోతోన్న సంగతి తెలిసిందే. ఈ స్పెషల్ ప్రోగ్రాంకు సంబంధించిన ప్రోమోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇంతకు ముందు రిలీజ్ చేసిన ప్రోమోలు సుధీర్ ఫ్యాన్స్ ఆగ్రహానికి గురయ్యాయి.

  హౌలే, గూట్లే..

  హౌలే, గూట్లే..

  ఇంతకు ముందు రిలీజ్ చేసిన ప్రోమోల్లో రాహుల్ సిప్లిగంజ్ సుధీర్‌ను కించపరిచినట్టు కామెంట్స్ చేశాడు. హౌలేగాడు, గూట్లే అంటూ నానా మాటలు అనేశాడు. దీంతో సుధీర్ ఫ్యాన్స్ హర్ట్ అయ్యారు. ఎంత స్కిట్స్ అయితే మాత్రం అలా అనాలా? అంటూ రాహుల్‌పై ఫైర్ అయ్యారు. అయితే తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో సుధీర్ పర్ఫామెన్స్ చూసి కన్నీరు పెట్టుకుంటున్నారు.

  Rahul Sipligunj New Look Shocks His Fans

  కంటతడి పెట్టించాడు..


  డాక్టర్ అవతారం ఎత్తిన సుడిగాలి సుధీర్ తన పెర్ఫామెన్స్‌తో గుండెల్ని బరువెక్కించాడు. కేరాఫ్ కంచెరపాలెంలోనిఆశా పాశం బంధీ చేసేలే అనే ఎమోషనల్ పాటతో ఎంట్రీ ఇచ్చిన సుధీర్.. తన పెర్ఫామెన్స్‌తో అదరగొట్టేశాడు. ఈ స్కిట్‌లో డాక్టర్ సుధీర్.. నిండు గర్భిణిగా ఉన్న తన భార్యతో హ్యాపీగా ఉండగా.. కరోనా పేషెంట్స్‌కి వైద్యం అందిస్తూ సుధీర్ కూడా కరోనా బారిన పడతాడు. ఆ విషయం తెలుసుకుని గర్భణిగా ఉన్న తన భార్య, పుట్టబోయే బిడ్డను ను తలుచుకుని వేదన చెందుతూ కుప్పకూలిపోయి ప్రేక్షకులను కంటతడి పెట్టించాడు. ఇక ప్రోమోలోనే ఇలా ఉంటే ఆ ప్రోగ్రాంలో ఇంకెంత ఉంటుందోనని, అయినా ఎమోషన్స్ పండించడంలో సుధీర్‌ను మించినవారు లేరని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

  English summary
  Sudigali Sudheer Ultimate Performance In 2020 Anukunnadi Okati Ayinadi Okati. Vinayaka Chavithi Special Event 2020 Anukunnadi Okati Ayinadi Okati. Rahul Sipligunj Comments On Sudigali Sudheer In 2020 Anukunnadi Okati Ayinadi Okati
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X