Don't Miss!
- Finance HUL: రూ.24 డివిడెండ్ ప్రకటించిన హిందుస్థాన్ యూనిలీవర్..
- News వివేకా కేసులో మరో అనూహ్య ట్విస్ట్- విచారణ నుంచి తప్పుకున్న జడ్జి..!
- Automobiles కొత్త ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ కూల్ స్పోర్ట్స్ కారు లాంచ్.. గంటకు 325 కి.మీ వేగం.. ధర, ఫీచర్లు ఇవే..
- Technology Nokia మాతృ సంస్థ HMD నుంచి మూడు కొత్త ఫోన్లు లాంచ్! ధర, స్పెసిఫికేషన్ల వివరాలు
- Sports సూపర్‌మ్యాన్ స్టబ్స్: మెరుపు ఫీల్డింగ్‌తో ఢిల్లీని గెలిపించాడు! Video
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
Sudigali Sudheer సినిమాకు ఊహించని నష్టం.. ఇబ్బందుల్లో పడిన జబర్దస్త్ కమెడియన్!
జబర్దస్త్ కమెడియన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న సుదీర్ అతి తక్కువ కాలంలోనే బుల్లితెరపై టాప్ సెలబ్రిటీగా మారిపోయాడు. ముఖ్యంగా టెలివిజన్ షో లతోనే అతనికి ఒక స్టార్ హీరో రేంజ్ లో అయితే గుర్తింపు దక్కింది. ఇక వెండి తెరపై కూడా సక్సెస్ కావాలి అని సుధీర్ బాగానే ప్రయత్నాలు చేశాడు కానీ అక్కడ వర్కౌట్ కావడం లేదు. రీసెంట్ గా వచ్చిన ఒక సినిమా డిజాస్టర్ కావడంతో తీవ్ర నష్టాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. అయితే ఆ ప్రభావం సుదీర్ భవిష్యత్తు సినిమాలపై కూడా కొత్త ప్రభావం చూపించినట్లుగా తెలుస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
జబర్దస్త్ లో అలా..
మొదట మెజీషియన్ గా సరికొత్త ప్రయోగాలతో పలు ఈవెంట్స్ లో కూడా హైలెట్ గా నిలిచిన సుధీర్ ఆ తర్వాత జబర్దస్త్ లో ఒక రైటర్ గా చేరాడు. ఇక అతని టైమింగ్ కూడా బాగుండడంతో వేణు వందర్స్ టీమ్ ద్వారా రెగ్యులర్. కమెడియన్ గా కూడా క్లిక్ అయ్యాడు. అనంతరం అతి తక్కువ కాలంలోనే టీం లీడర్ గా కూడా మారిపోయిన సుధీర్ టాప్ రెమ్యునరేషన్ అందుకునే రేంజ్ కు వెళ్ళాడు.
మెల్లగా ఆ రేంజ్ కు..
సుదీర్ తో పాటు గెటప్ శ్రీను ఆటో రాంప్రసాద్ ముగ్గురు కూడా ఒకే తరహా క్రేజ్ అందుకుంటూ వచ్చారు. ఇక జబర్దస్త్ ద్వారా క్రేజ్ అందుకున్న తర్వాత సుధీర్ వెండితెరపై కూడా కొన్ని సినిమాల్లో ప్రత్యేకమైన పాత్రలో కనిపిస్తూ వచ్చాడు. మొదట్లో అయితే చాలా తక్కువ టైమింగ్ ఉన్న క్యారెక్టర్స్ లో కనిపించిన సుధీర్ ఆ తర్వాత మెల్లగా హీరోల స్నేహితుడి పాత్రల చేసే వరకు వచ్చాడు.
అందుకే జబర్దస్త్ కు దూరం
సుడిగాలి సుదీర్ కు జబర్దస్త్ తర్వాత మిగతా షోలలో కూడా హైలెట్ గా నిలవడంతో సినిమా ఇండస్ట్రీల నుంచి ఆఫర్లు అయితే చాలానే వచ్చాయి. కొన్నిసార్లు డేట్స్ ఖాళీ లేకపోవడంతో కూడా కొన్ని సినిమాలను వదులుకోవాల్సి వచ్చింది. అందుకే ఇటీవల అతను జబర్దస్త్ కు దూరమైనట్లు తెలుస్తోంది.
డిజాస్టర్ సినిమా
అలాగే జబర్దస్త్ లో కొన్ని మనస్పర్థలు రావడంతో సుధీర్ బయటకు వెళ్లిపోయినట్లు కూడా కొందరు కామెంట్స్ అయితే చేస్తున్నారు. ఇక ఇంతవరకు ఆ విషయంపై సుదీర్ అయితే క్లారిటీ ఇవ్వలేదు. ఇక రీసెంట్ గా సుదీర్ ప్రధాన పాత్రలో నటించిన వాంటెడ్ పండుగాడ్ సినిమా కొంచెం హైలెట్ చేస్తూ విడుదల చేసే ప్రయత్నం చేశారు.
ఊహించని షాక్
కే.రాఘవేంద్రరావు దర్శకత్వం పర్యవేక్షణలో వచ్చిన ఈ సినిమా తప్పకుండా సక్సెస్ అవుతుంది అని ఎంతో నమ్మకంగా కనిపించారు. గ్యాప్ లేకుండా ప్రమోషన్స్ కూడా చేశారు. కానీ సినిమా మాత్రం ఊహించిన విధంగా షాక్ ఇచ్చింది. కనీసం పెట్టిన పెట్టుబడినీ కూడా సినిమా వెనక్కి తీసుకురాలేకపోయింది. చాలావరకు మొదటి రోజే థియేటర్లో ఖాళీగా ఉండడంతో షోలను క్యాన్సల్ చేయాల్సి వచ్చింది.
మరో రేంజ్ లో..
అయితే ఇప్పుడు సుదీర్ లైనప్ లో ఉన్న మరో రెండు సినిమాలపై ప్రభావం కొత్త ప్రభావం అయితే చూపిస్తోంది. ప్రస్తుతం సుధీర్ రెండు సినిమాల చేస్తున్న సుధీర్ పండుగాడ్ హిట్ అయితే వాటిని మరింత హై రేంజ్ లో విడుదల చేయాలని అనుకున్నాడు. ముఖ్యంగా అందులో గాల్లోడు అనే సినిమా కాస్త మాస్ కమర్షియల్ అంశాలతో తెరపైకి రాబోతోంది.
డిజాస్టర్ ఎఫెక్ట్
గాలోడు సినిమాలో సుదీర్ స్పెషల్ డాన్స్ లో కూడా హైలెట్ కాబోతున్నాయట. కానీ పండుగాడ్ డిజాస్టర్ కావడం వలన ఇప్పుడు సినిమా షూటింగ్ మధ్యలోనే ఆగిపోయిందట. అలాగే మరో రెండు ప్రాజెక్టులు చర్చలో దశలో ఉన్నట్లుగా తెలుస్తోంది. మరి ఆ సినిమాలు అనుకున్న సమయానికి రిలీజ్ అవుతాయో లేదో చూడాలి.