twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    దుమ్మురేపుతున్న సుడిగాలి సురాధీర్, విష్ణు ప్రియ వీడియో.. గబ్బర్ సింగ్ గెటప్‌లో, పంచులే పంచులు!

    |

    Recommended Video

    Sudheer,Vishnu Priya Show Going Viral

    బుల్లితెర నటుడిగా సుడిగాలి సుధీర్ మంచి గుర్తింపు పొందాడు. జబర్దస్త్ ద్వారా గుర్తింపు పోందింన సుధీర్ ప్రస్తుతం బుల్లి తెరపై పలు టీవీ షోలలో నటిస్తున్నాడు. సుధీర్ కామెడీ టైమింగ్ అందరిని మెప్పించే విధంగా ఉంటుంది. సుధీర్, యాంకర్ విష్ణు ప్రియ చేస్తున్న పోవే పోరా షో కూడా బాగా పాపులర్ అయింది. పోవే పోరా ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సుధీర్ గబ్బర్ సింగ్ గెటప్ లో, విష్ణు ప్రియా శృతి హాసన్ లా కనిపిస్తూ అలరిస్తున్నారు. వీర మధ్య సాగుతున్న సంభాషణ ఆకట్టుకునే విధంగా ఉంది.

    జబర్దస్త్‌తో పాపులారిటీ

    జబర్దస్త్‌తో పాపులారిటీ

    తన కామెడీ టైమింగ్ తో సుడిగాలి సుధీర్ జబర్దస్త్ ద్వారా పాపులర్ అయ్యాడు. పలు చిత్రాల్లో కూడా అవకాశాలు అందుకుంటున్నాడు. బుల్లి తెరపై ప్రస్తుతం సుడిగాలి సుధీర్ బిజీగా మారిపోయాడు.

    సుధీర్, విష్ణు ప్రియ కలసి

    సుధీర్, విష్ణు ప్రియ కలసి

    సుధీర్, విష్ణుప్రియ కలసి చేస్తున్న పోవే పోరా షో బాగా పాపులర్ అయింది. వీరి మధ్య సాగె సరదా సంభాషణ యువతని ఆకట్టుకుంటోంది. తాజగా పోవే పోరా షో ప్రోమో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

    గబ్బర్ సింగ్ గెటప్

    గబ్బర్ సింగ్ గెటప్

    గబ్బర్ సింగ్ గెటప్ లో సుధీర్ అలరిస్తున్నాడు. గబ్బర్ సింగ్ డైలాగులకు పేరడీలు చేస్తూ తనదైన శైలిలో హాస్యాన్ని పంచుతున్నాడు. అంతలో విష్ణు ప్రియా శృతి హాసన్ లాగా ఎంట్రీ ఇవ్వడం.. పవన్ కళ్యాణ్, శృతి హాసన్ తొలి సారి అనుకోకుండా కలుసుకున్నట్లు ఉండే సన్నివేశం అలరిస్తూ ఉంది.

    పంచులే పంచులు

    పంచులే పంచులు

    విష్ణు ప్రియ.. సుధీర్ ఒళ్ళో పడగానే అమ్మాయిని ఎప్పుడూ చూడలేదా అని అంటుంది. మంచి విలేజ్ సెట్ వేశారు.. ఎద్దు లేదని అనుకుంటున్నా.. ఇప్పుడు కవర్ అయిపోయింది అని బదులిస్తాడు. ఈ ఊర్లో ఒక్క గూర్ఖా కూడా లేడని అనుకుంటున్నా.. భలే దొరకవు నువ్వు అని విష్ణు ప్రియా సెటైర్ వేస్తుంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

    English summary
    Sudigali Sudheer, vishnu priya video goes viral. Sudigali Sudheer as Gabbarsingh
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X