చలికాలంలో ప్రేమ.. వర్షాకాలంలో మేటర్: ఏకంగా అంత మాట అనేసిన సుధీర్.. రష్మీ పువ్వులతో అంటూ రచ్చ

తెలుగు బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చి.. చాలా తక్కువ సమయంలోనే స్టార్‌గా ఎదిగిపోయిన వారిలో ఆల్‌రౌండర్ సుడిగాలి సుధీర్ ఒకడు. జబర్ధస్త్ అనే షో ద్వారా పరిచయం అయిన అతడు.. అసాధారణ టాలెంట్‌తో ఆకట్టుకున్నాడు. అదే సమయంలో తనలోని వైవిధ్యమైన ప్రతిభలను చూపిస్తూ ఎన్నో అవకాశాలను అందుకున్నాడు. ఇలా దాదాపు ఏడేళ్లుగా టెలివిజన్ రంగంలో హవాను చూపిస్తున్నాడు. తద్వారా ఎంతో మంది అభిమానాన్ని అందుకున్నాడు. ఇలాంటి సమయంలో సుధీర్ తాజాగా వల్గర్ కామెంట్స్ చేశాడు. ఇందులో రష్మీని కూడా వాడేశాడు. ఆ వివరాలు మీకోసం!

మ్యాజిక్‌ల నుంచి జబర్ధస్త్.. టాప్ కమెడియన్‌గా

మ్యాజిక్‌ల నుంచి జబర్ధస్త్.. టాప్ కమెడియన్‌గా

మ్యాజిక్‌లు చేస్తూ కెరీర్‌ను ఆరంభించాడు సుడిగాలి సుధీర్. ఈ సమయంలోనే వేణు వండర్స్ అనే టీమ్ ద్వారా జబర్ధస్త్‌లోకి కమెడియన్‌గా పరిచయం అయ్యాడు. అందులోకి అడుగు పెట్టినప్పటి నుంచి తన మార్క్ కామెడీతో అలరించాడు. తద్వారా చాలా స్కిట్లను వన్ మ్యాన్ షోగా మార్చేశాడు. దీంతో షో నిర్వహకులు అతడికి టీమ్ లీడర్‌గా ప్రమోషన్ ఇచ్చారు. దీంతో టాప్‌కు ఎదిగేశాడు.

బికినీ అందాలతో మైండ్ బ్లాక్ చేస్తున్న శామా సికందెర్

ఆ షోతో పాపులారిటీ.. ఈ షోతో మరో యాంగిల్

ఆ షోతో పాపులారిటీ.. ఈ షోతో మరో యాంగిల్

జబర్ధస్త్ షోలో అద్భుతమైన టాలెంట్‌తో అలరించిన సుడిగాలి సుధీర్‌కు వరుస ఆఫర్లు వచ్చాయి. ఇందులో భాగంగానే విష్ణు ప్రియతో కలిసి 'పోవే పోరా' అనే షో చేశాడు. దీని ద్వారా ఫాలోయింగ్‌ను భారీగా పెంచుకున్నాడు. మరీ ముఖ్యంగా కాలేజ్ స్టూడెంట్స్‌తో ఆడించే ఆటలు.. ఒకరిపై ఒకరు పంచులు వేసుకోవడం వంటి వాటితో సుధీర్ యూత్‌లో పాపులారిటీని విపరీతంగా పెంచుకున్నాడు.

నైనా గంగూలీ.. ప్రతి ఫ్రేమ్ లో హాట్ నెస్ డోస్ పెంచేస్తోంది

యాక్టర్‌గా సక్సెస్‌.. హీరోగా ఫెయిల్.. కెరీర్ ఇలా

యాక్టర్‌గా సక్సెస్‌.. హీరోగా ఫెయిల్.. కెరీర్ ఇలా

చాలా కాలంగా బుల్లితెరపై తన హవాను చూపిస్తోన్న సుధీర్.. సినిమా రంగంలోకి సైతం అడుగు పెట్టాడు. సుదీర్ఘమైన కెరీర్‌లో ఎన్నో చిత్రాల్లో నటించాడు. అందులో 'రేసు గుర్రం', 'బ్రదర్ ఆఫ్ బొమ్మాలి', 'సర్దార్ గబ్బర్ సింగ్', 'బంతిపూల జానకీ' సహా కొన్ని చిత్రాలు పేరు తెచ్చాయి. అయితే, హీరోగా మారి చేసిన 'సాఫ్ట్‌వేర్ సుధీర్', 'త్రీమంకీస్' మాత్రం అతడిని ఘోరంగా నిరాశ పరిచాయి.

సంజీదా షేక్ కూల్ గ్లామరస్ లుక్స్

ముందు రష్మీతో.. తర్వాత విష్ణు ప్రియతో ట్రాక్‌లు

ముందు రష్మీతో.. తర్వాత విష్ణు ప్రియతో ట్రాక్‌లు

సుడిగాలి సుధీర్ ఫేమస్ అవడానికి అతడి ప్రతిభ మాత్రమే కాదు.. లవ్ ట్రాకులు కూడా ప్రధాన పాత్రను పోషించాయి. ఆరంభం నుంచే అతడు యాంకర్ రష్మీ గౌతమ్‌తో ప్రేమాయణం సాగిస్తున్నాడన్న వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి. వీళ్లు పెళ్లి కూడా చేసుకుంటారని ప్రచారం జరుగుతూనే ఉంది. ఇక, విష్ణుప్రియతోనూ అతడు లవ్ ట్రాక్ నడుపుతున్నట్లు వార్తలు వచ్చాయి.

సుడిగాలి సుధీర్ మళ్లీ అలాగే.. వల్గర్ కామెంట్లతో

సుడిగాలి సుధీర్ మళ్లీ అలాగే.. వల్గర్ కామెంట్లతో

జబర్ధస్త్ స్కిట్లలో సుడిగాలి సుధీర్‌కు అమ్మాయిల పిచ్చోడిలా క్యారెక్టర్లను రాస్తున్నారు స్క్రిప్ట్ రైటర్లు. వీటిలో అతడు అద్భుతంగా నటిస్తున్నాడు. అయితే, చాలా మంది అతడి నిజమైన రూపం ఇదేనని అనుకుంటున్నారు. దీంతో ఫ్యాన్స్ కూడా ఇలాంటివి వద్దని చెబుతున్నారు. ఇలాంటి సమయంలోనే వచ్చే వారం ప్రసారం కానున్న ఎక్స్‌స్ట్రా జబర్ధస్త్‌లో అతడు వల్గర్ కామెంట్స్ చేశాడు.

 చలికాలంలో ప్రేమించుకుంటే.. వర్షాకాలంలో మేటర్

చలికాలంలో ప్రేమించుకుంటే.. వర్షాకాలంలో మేటర్

తాజాగా విడుదలైన ప్రోమోలో సుడిగాలి సుధీర్‌ను మామిడికాయలు అమ్మే వ్యక్తిగా కనిపించాడు. ఈ సందర్భంగా పక్కనే ఉన్న బాబు 'మామిడికాయలు ఎండాకాలంలోనే ఎందుకు కాస్తాయి' అని అతడిని ప్రశ్నించాడు. దీనికి సుధీర్.. 'చలికాలంలో చెట్లు ప్రేమించుకుని ఎండాకాలంలో కాయలిస్తాయి. వర్షాకాలంలోనే వాటి మధ్య అసలు మేటర్ జరుగుతుంది' అని చెప్పి షాకిచ్చేశాడు.

రష్మీ పువ్వులతో అంటూ అంత మాట అనేశాడుగా

రష్మీ పువ్వులతో అంటూ అంత మాట అనేశాడుగా

ఇదే స్కిట్‌లో బాబు మాట్లాడుతూ.. 'ఇలా మాట్లాడుతున్నావంటే నువ్వు సుడిగాలి సుధీర్‌వే కదా. ఇక్కడున్నావేంటి' అని ప్రశ్నించాడు. దీనికి పక్కనే ఉన్న రాంప్రసాద్ 'జబర్ధస్త్‌లో నుంచి తీసేశాక ఇలా మారాడు' అని కౌంటర్ వేశాడు. అప్పుడు బాబు 'నీ పక్కన రష్మీ ఉండాలి కదా ఏది' అని అడగగా.. 'రష్మీ రైల్వే స్టేషన్‌లో పువ్వులు అమ్ముకుంటోంది' అంటూ పంచ్ పేల్చాడు సుధీర్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X