For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  బిగ్ బాస్ హౌస్‌లోకి సుడిగాలి సుధీర్.. లేడీ కంటెస్టెంట్ కోసం తప్పు చేసి జైలు పాలు.!

  By Manoj
  |

  బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చిన తక్కువ కాలంలోనే స్టార్‌గా ఎదిగిపోయాడు యంగ్ కమెడియన్ సుడిగాలి సుధీర్. జబర్ధస్త్ అనే షో ద్వారా ఇండస్ట్రీకి పరిచయం అయిన అతడు... అద్భుతమైన టాలెంట్‌తో టీమ్ లీడర్ అయిపోయాడు. అప్పటి నుంచి వెనుదిరిగి చూడని ఈ కుర్రాడు... వరుస ఆఫర్లు దక్కించుకుంటూ దూసుకుపోతున్నాడు. ఈ క్రమంలోనే తెలుగు రాష్ట్రాల్లో యూత్ ఐకాన్‌గా వెలుగొందుతున్నాడు. ఇంతటి పేరున్న బిజీ ఆర్టిస్టు సుధీర్... రియాలిటీ షో బిగ్ బాస్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. హౌస్‌లోకి వెళ్లడం వెళ్లడమే జైలు పాలయ్యాడు. ఆ వివరాలు మీకోసం.!

  సుధీర్.. అవన్నీ తెలిసిన ఆల్‌రౌండర్

  సుధీర్.. అవన్నీ తెలిసిన ఆల్‌రౌండర్

  వేణు వండర్స్ టీమ్ ద్వారా జబర్ధస్త్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు సుడిగాలి సుధీర్. ఆ తర్వాత అతడిలోని ప్రత్యేకమైన టాలెంట్‌ను గుర్తించిన షో నిర్వహకులు... టీమ్ లీడర్‌గా ప్రమోషన్ ఇచ్చారు. దీంతో చాలా కాలంగా కమెడియన్‌గా మెప్పిస్తున్నాడు. అంతేకాదు, మ్యాజిక్ చేయడంలో దిట్ట అయిన సుధీర్... అప్పుడప్పుడూ డ్యాన్స్‌లు ఇరగదీయడంతో పాటు పాటలు కూడా పాడుతున్నాడు.

  చేతి నిండా షోలు.. సుధీర్ కెరీర్ జోరు

  చేతి నిండా షోలు.. సుధీర్ కెరీర్ జోరు


  ప్రస్తుతం బుల్లితెరపై భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఆర్టిస్టుల్లో సుడిగాలి సుధీర్ ఒకడు. అతడి క్రేజ్‌ను క్యాష్ చేసుకునేందుకు చాలా మంది మేకర్లు.... డేట్స్ కోసం వేచి చూస్తున్నారు. ఈ క్రమంలోనే సుధీర్ కూడా పలు షోలు చేస్తున్నాడు. వాటిలో జబర్ధస్త్‌, ఢీ, పోవే పోరా బాగా పాపులర్ అయ్యాయి. వీటితో పాటు స్పెషల్ ఈవెంట్లు కూడా చేస్తున్నాడీ బుల్లితెర ఆల్‌రౌండర్.

  యాంకర్ రష్మీతో ప్రేమాయణం... పెళ్లి

  యాంకర్ రష్మీతో ప్రేమాయణం... పెళ్లి

  సుడిగాలి సుధీర్‌ తన టాలెంట్‌తో ఎంత ఫేమస్ అయ్యాడో... యాంకర్ రష్మీ గౌతమ్‌తో ప్రేమాయణం సాగిస్తున్నాడన్న వార్తలతో మరింత క్రేజ్ సంపాదించుకున్నాడు. వీళ్లిద్దరి మధ్య లవ్ ట్రాక్ నడుస్తుందని దాదాపు ఐదారేళ్లుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. అలాగే, పెళ్లి కూడా చేసుకోబోతున్నారని ప్రచారం జరుగుతోంది. దీన్ని వీళ్లు ఎన్నిసార్లు ఖండిచినా పుకార్లు మాత్రం ఆగలేదు.

  అందులో మాత్రం కలిసి రాని అదృష్టం

  అందులో మాత్రం కలిసి రాని అదృష్టం


  వరుస షోలతో బుల్లితెరపై స్టార్‌గా వెలుగొందుతోన్న సుడిగాలి సుధీర్‌కు... వెండితెరపై మాత్రం అంతగా అదృష్టం కలిసి రాలేదు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించిన అతడు... హీరోగా మాత్రం హిట్‌ను అందుకోలేకపోయాడు. ‘సాఫ్ట్‌వేర్ సుధీర్' అనే మూవీతో హీరోగా పరిచయమైన ఈ కుర్రాడు... ‘త్రీ మంకీస్' అనే మూవీ కూడా చేశాడు. ఈ రెండూ నిరాశ పరిచాయి.

  కథ అడ్డం తిరిగింది అంటున్న సుధీర్

  కథ అడ్డం తిరిగింది అంటున్న సుధీర్

  కెరీర్ పరంగా ఫుల్ బిజీగా గడుపుతోన్న సుధీర్... ఈవెంట్లలోనూ పాల్గొంటున్నాడు. ఇక, పండుగల సమయంలో వచ్చే ప్రత్యేకమైన కార్యక్రమాల్లో స్పెషల్ అట్రాక్షన్ అవుతున్నాడు. ఇందులో భాగంగానే ఈ ఏడాది జరిగే వినాయక చవితి కోసం అతడు ప్రధాన పాత్ర పోషిస్తూ ‘2020 అనుకున్నది ఒకటి అయింది ఒకటి' అనే ఈవెంట్ చేస్తున్నాడు. ఇది ఈటీవీలో ప్రసారం కానుంది.

  బిగ్ బాస్ హౌస్‌లోకి సుడిగాలి సుధీర్

  ఈ ఈవెంట్‌లో బిగ్ బాస్ సీజన్ -3 కంటెస్టెంట్లు శ్రీముఖి, రోహిణి, హిమజ, పునర్నవి, రాహుల్ సిప్లీగంజ్‌లతో కలిసి సుడిగాలి సుధీర్... ఓ స్కిట్ చేశాడు. అందులో భాగంగా అతడు వాళ్లతో కలిసి బిగ్ బాస్ హౌస్‌లోకి ప్రవేశించాడు. ఆడవాళ్ల పిచ్చోడిలా తన మేనరిజమ్ చూపిస్తూ కనిపించిన సుధీర్... జైల్లో ఉన్న హిమజ కోసం తప్పు చేసి మరీ బిగ్ బాస్ ఆగ్రహానికి గురయ్యాడు.

  Kaushal Manda Breaks His Mobile Gifted By Bigg Boss
  వాళ్లిద్దరి ప్రేమ ముచ్చటతోనే మొదలు

  వాళ్లిద్దరి ప్రేమ ముచ్చటతోనే మొదలు

  వినాయక చవితి స్పెషల్ ఈవెంట్‌ను పునర్నవి, రాహుల్ ప్రేమ పెళ్లిని ప్రధానంగా చేసుకుని రూపొందించారు. వీళ్లిద్దరి కుటుంబాలను రెండుగా విడదీసి... పోటాపోటీగా స్కిట్లు చేశారు. వీరిలో ఒక ఫ్యామిలీకి యాక్టర్ సునీల్... మరో దానికి రోజా పెద్దలుగా వ్యవహరించారు. అలాగే, ఆది, గెటప్ శ్రీను, ఇమ్మాన్యూయేల్, రాంప్రసాద్‌తో పాటు జబర్ధస్త్ సభ్యులు హాజరయ్యారు.

  English summary
  Sudigali Sudheer is a Telugu language actor and a stand-up comedian, who is known for his performance in the Telugu-language television channel comedy shows Jabardasth and Extra Jabardasth. He is also a team leader on Dhee Ultimate Dance Show for season 9, season 10, season 11 and season 12.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X