హైదరాబాద్‌లో కోట్లు విలువైన లగ్జరీ విల్లా? వదినమ్మ సీరియల్ నటి స్ట్రాంగ్ రిప్లయ్

సెలబ్రిటీల వ్యక్తిగత విషయాలు ఎప్పుడూ హాట్ టాపిక్కే. వారి గురించి తెలుసుకోవాలని అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా ఆసక్తి చూపిస్తుంటారు. సోషల్ మీడియా యుగంలో సెలబ్రిటీల గురించి నిత్యం ఎన్నో వార్తలు వైరల్ అవుతుంటాయి. అయితే వీటితో కొన్ని మాత్రమే నిజం కాగా.. చాలా వరకు గాసిప్స్ ట్రెండ్ అవుతాయి. కొందరు సెలబ్రిటీలు వీటిని చూసీచూడనట్లుగా వదిలేస్తే.. మరికొందరు క్లారిటీ ఇస్తారు. తాజాగా తనకు సంబంధించిన ఓ రూమర్‌పై స్ట్రాంగ్ రిప్లయ్ ఇచ్చారు తెలుగు బుల్లితెర నటి. ఈ వివరాల్లోకి వెళితే...

బాలనటిగా ఎంట్రీ
బాలనటిగా వెండితెరపై అడుగుపెట్టి సినిమాలు, సీరియల్స్‌తో దక్షిణాదిలో పాపులర్ అయ్యారు సుజిత ధనుష్. బాలనటిగా కెరీర్ ప్రారంభించిన సుజిత.. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఎన్నో చిత్రాల్లోనూ , సీరియల్స్‌లోనూ నటించి మెప్పించారు. ప్రస్తతుం సీరియల్స్‌లో అగ్రనటిగా వెలుగొందుతున్నారు. నాలుగు దశాబ్ధాల కెరీర్‌లో దక్షిణాదిలోని అందరు అగ్రనటులతో కలిసి పనిచేశారు. మెగాస్టార్ చిరంజీవి బ్లాక్ బస్టర్ మూవీ పసివాడి ప్రాణంలో బాబుగా నటించింది సుజితయే.

Sujitha Dhanush Gives Strong Reply to Viral Rumors About 5 Crore Villa in Hyderabad

వదినమ్మతో ఫేమ్
1998లో దూరదర్శన్‌లో ప్రసారమైన వొరు పెన్నిన్ కథై ధారావాహిక ద్వారా బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చారు సుజిత. ఈ క్రమంలో జెమినీ టీవీలో ప్రసారమైన సౌందర్య అనే సీరియల్‌తో తెలుగువారిని పలకరించారు. ఆదివారం ఆడవాళ్లకు సెలవు కావాలి, సుడిగుండాలు, కర్తవ్యం, సుందరకాండ, కల్పన, కలవారి కోడలు, శ్రీకృష్ణలీలలు, గంగోత్రి, ఏడాడుగులు, ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే, తులసి దళం, కలిసుందాం రా, గీతాంజలి, వదినమ్మ, మేఘ సందేశం వంటి సీరియల్స్‌లో నటించారు.

50కి పైగా సీరియల్స్‌లో నటన
దాదాపు 50కి పైగా సీరియల్స్ నటించి అరుదైన గుర్తింపు సంపాదించారు. సినిమాలు, టెలివిజన్‌తో పాటు డబ్బింగ్ ఆర్టిస్ట్‌గానూ సుజిత తన ప్రతిభను చాటుకున్నారు. ప్రముఖ దర్శకుడు సూర్యకిరణ్ స్వయానా సుజితకు అన్నయ్య. ధనుష్ అనే నిర్మాతను సుజిత పెళ్లాడారు.. ఈ దంపతులకు తన్విన్ అనే బాబు ఉన్నాడు. ప్రస్తుతం సుజిత కుటుంబం చెన్నైలో స్థిరపడింది. ప్రతిరోజూ షూటింగ్స్ నిమిత్తం చెన్నై, హైదరాబాద్, కొచ్చి మధ్య చక్కర్లు కొడుతుంటారు సుజిత.

హైదరాబాద్‌లో 5 కోట్ల రూపాయల విల్లా?
సీరియల్స్‌లో నటిస్తూనే తెలుగులో పలు షోలలో పాల్గొన్నారు సుజిత. తాజాగా స్టార్ మాలో శ్రీముఖి హోస్ట్‌గా ప్రసారమవుతున్న ఆదివారం విత్ స్టార్ మా పరివారం షోలో సందడి చేశారు. ఈ వారం ఎపిసోడ్‌‌కు సంబంధించిన ప్రోమోను స్టార్ మా విడుదల చేసింది. ఈ వారం లేడీ ఆర్టిస్టులతో కిట్టి పార్టీ అనే థీమ్‌తో ఆటలు ఆడించారు శ్రీముఖి. దీనిలో భాగంగా సోషల్ మీడియాలో బుల్లితెర సెలబ్రిటీలపై వచ్చిన రూమర్స్‌ను ప్రదర్శించారు. ఈ క్రమంలోనే సుజిత వంతు రాగా.. హైదరాబాద్‌లో 5 కోట్ల రూపాయల విల్లా కొన్న సుజిత అనే రూమర్‌ను చదివింది శ్రీముఖి. అది చూసిన సుజిత షాకయ్యారు.

రూమర్స్‌కు సుజిత క్లారిటీ
గృహ ప్రవేశానికి నన్నెందుకు పిలవలేదు.. ఇది అస్సలు బాలేదని శ్రీముఖి ప్రశ్నించగా.. నేనే వెళ్లేలేదమ్మా అంటూ సుజిత ఒక్క ముక్కలో తేల్చేశారు. ప్రస్తుతానికి దీనికి సంబంధించిన ప్రోమో వైరల్ అవుతుండగా.. 5 కోట్ల రూపాయల విల్లా కొన్నట్లుగా వస్తున్న వార్తలపై సుజిత మైండ్ బ్లాక్ అయ్యేలా కౌంటర్ ఇచ్చారని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.

Read more about: sreemukhi sujitha r dhanush
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X