సుధీర్‌లో అలాంటి వైబ్రేషన్స్.. రష్మీ.. అందుకే పడిపోయింది..సుమ సెటైర్!

By Manoj Kumar P

బుల్లితెరపైకి ఎంతో మంది తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఎంట్రీ ఇస్తుంటారు. వారిలో కొందరు మాత్రమే సక్సెస్ అవుతారు. అలాంటి వారిలో జబర్ధస్త్ ఫేం సుడిగాలి సుధీర్ ఒకడు. యాక్టింగ్, డ్యాన్స్, మ్యాజిక్, సింగింగ్ ఇలా ఎన్నో విద్యలను ప్రదర్శిస్తూ బుల్లితెర ఆల్‌రౌండర్‌గా గుర్తింపు పొందాడతడు. అదే సమయంలో సినిమా హీరోలతో సమానమైన ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు. సుధీర్ సక్సెస్ వెనుక యాంకర్ రష్మీ గౌతమ్ పాత్ర కూడా ఉందన్న విషయం తెలిసిందే. తాజాగా అతడిపై ఆమె హాట్ కామెంట్స్ చేసింది. దీనికి సుమ సెటైర్ వేసింది. ఇంతకీ ఏం జరిగింది.?

Recommended Video

Anchor Suma Serious On Telugu Peope Behavior | చెప్పేది మీకే.. అర్దం కావట్లేదా..?
ఇద్దరి మధ్య ప్రేమ... పెళ్లి కూడా చేశారు

ఇద్దరి మధ్య ప్రేమ... పెళ్లి కూడా చేశారు

బుల్లితెరపై తమ తమ విభాగాల్లో సత్తా చాటుతూ ఎంతో పాపులారిటీని సొంతం చేసుకున్నారు యాంకర్ రష్మీ గౌతమ్... సుడిగాలి సుధీర్. వీళ్లిద్దరూ ప్రేమలో ఉన్నారని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోన్న విషయం తెలిసిందే. అంతేకాదు, ఈ జంట పెళ్లి పీటలు కూడా ఎక్కుబోతుందని వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే వీళ్లు యూట్యూబ్ జోడీగా పేరు తెచ్చుకున్నారు.

సుధీర్‌కు భారీ క్రేజ్... ఆమె వల్లే ఇదంతా

సుధీర్‌కు భారీ క్రేజ్... ఆమె వల్లే ఇదంతా

సుడిగాలి సుధీర్.. తక్కువ కాలంలోనే ఊహించని స్థాయిలో పాపులారిటీని సొంతం చేసుకున్న నటుడు. జబర్ధస్త్ అనే కామెడీ షో ద్వారా ఇండస్ట్రీకి పరిచయం అయిన అతడు... యూత్ ఐకాన్‌గా వెలుగొందుతున్నాడు. అతడు ఇంతలా క్రేజ్ సంపాదించడానికి టాలెంట్ ఒక కారణం అయితే... మరో కారణం మాత్రం యాంకర్ రష్మీ గౌతమ్ అన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

వాస్తసం ఒప్పుకున్న సుడిగాలి సుధీర్

వాస్తసం ఒప్పుకున్న సుడిగాలి సుధీర్

సుధీర్ ఎదుగుదలకు రష్మీ కారణం అన్న విషయాన్ని అతడే స్వయంగా వెల్లడించాడు. ఇప్పటికే చాలా సందర్భాల్లో దీని గురించి మాట్లాడాడు. ‘నిజానికి నేను ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి రష్మీ కూడా ఒక కారణమే. మా ఇద్దరిపై వచ్చిన పుకార్ల కారణంగా నేను మరింత ఫేమస్ అయ్యాను' అంటూ సుధీర్ చెప్పుకొచ్చాడు. దీనిపై జబర్ధస్త్‌లో స్కిట్లు కూడా వచ్చేస్తున్నాయి.

వీళ్ల పేరు వాడడంతో వాళ్లకు లాభాలు

వీళ్ల పేరు వాడడంతో వాళ్లకు లాభాలు

రష్మీ... సుధీర్‌కు రెండు రాష్ట్రాల్లో విపరీతమైన క్రేజ్ ఉండడంతో... చాలా మంది షో మేకర్లు వీళ్లపై అనేక ప్రయోగాలు చేస్తున్నారు. ఈ జంట పాపులారిటీని ఉపయోగించుకుని లాభాలు అర్జిస్తున్నారు. వీళ్లపై ప్రత్యేకమైన స్క్రిప్టులు రాయడంతో పాటు రొమాంటిక్ డ్యాన్స్‌లు కూడా చేయిస్తున్నారు. మరికొందరు వీళ్లిద్దరిని పెట్టి సినిమాలు తీయాలని చూస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఒంటరిగా వెళ్లినా మరొకరి ప్రస్తావనలే

ఒంటరిగా వెళ్లినా మరొకరి ప్రస్తావనలే

చాలా షోలకు రష్మీ... సుడిగాలి సుధీర్‌ను జంటగా రావాలని కోరుతున్నారు ఆయా ఛానెళ్ల నిర్వహకులు. ఈవెంట్లకు సైతం వీళ్లిద్దరిని ఆహ్వానిస్తున్నారు. మరోవైపు వీరిలో ఏ ఒక్కరైనా ఒంటరిగా ఇంటర్వ్యూలకు వెళితే... మరొకరి గురించి తప్పకుండా ప్రస్తావిస్తున్నారు. ‘మీ మధ్య రిలేషన్ గురించి చెప్పండి' అంటూ అడుగుతున్నారు. దీంతో వీళ్లు అలా కూడా వార్తల్లోకి ఎక్కుతున్నారు.

 సుధీర్‌లో వైబ్రేషన్స్ ఉన్నాయన్న రష్మీ

సుధీర్‌లో వైబ్రేషన్స్ ఉన్నాయన్న రష్మీ

తాజాగా రష్మీ గౌతమ్.. ప్రముఖ ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న ‘క్యాష్' ప్రోగ్రామ్‌కు అనసూయ, శేఖర్ మాస్టర్, హైపర్ ఆదిలతో కలిసి వెళ్లింది. ఈ కార్యక్రమంలో భాగంగా సుమ... సుధీర్‌కు సంబంధించిన ప్రశ్న అడిగి ఆమెతో బాస్కెట్ బాల్ ఆడించింది. ఆమె వేసిన బాల్ బాస్కెట్‌లో పడిపోయింది. దీంతో రష్మీ ‘సుధీర్ పేరులోనే వైబ్రేషన్స్ ఉన్నాయి' అంటూ కామెంట్ చేశారు.

అందుకే పడిపోయిందని సుమ సెటైర్.!

అందుకే పడిపోయిందని సుమ సెటైర్.!

బాల్.. బాస్కెట్‌లో పడడంతో ‘సుధీర్ యాక్టింగ్ మానేసినప్పుడు సంతోష పడ్డారా.? సుధీర్ మీకు ప్రపోజ్ చేసినప్పుడు సంతోషపడ్డారా.? అని సుమ అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పాలిన అవసరం రష్మీకి రాలేదు. దీంతో క్లిష్టమైన ప్రశ్నను స్కిప్ చేసుకుంది ఈ హాట్ యాంకర్. ఆ సమయంలో సుమ ‘సుధీర్‌లో వైబ్రేషన్స్ ఉండబట్లే బాల్ బాస్కెట్‌లో పడిపోయింది' అని సెటైర్ వేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X