మీసాలు, గడ్డాలు వచ్చినోడు కూడా అలా పిలుస్తుంటే కాలుతోంది.. సమతో అనసూయ
సినిమా స్టార్స్ కంటే కూడా ఈ మధ్య కాలంలో బుల్లితెర స్టార్స్ కి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువవుతోంది. ముఖ్యంగా యాంకర్స్ కి మునుపటి కంటే కూడా క్రేజ్ భారీగానే పెరుగుతోంది. ఇక టాప్ యాంకర్స్ లో ఒకరైన సుమ, అనసూయ భరద్వాజ్ ఆడియెన్స్ ని ఏ విధంగా ఆకట్టుకుంటారో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. బుల్లితెరపై వీరు వారికంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక ఇలాంటి వారి మధ్య ఏదైనా షో జరిగితే రేటింగ్స్ లలో రికార్డ్స్ తారుమరవ్వడం కాయం.

సుమ ఓటీటీ ఎంట్రీ
రీసెంట్ గా అనసూయ భరద్వాజ్, సుమ మధ్యలో ఒక లైవ్ కన్వర్సేషన్ నడిచింది. సుమ డిజిటల్ ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు ఎనౌన్స్ చేసింది. ఈ సందర్భంగా అనసూయ ద్వారా తన షోకి సంబంధించిన స్పెషల్ పోస్టర్ ని కూడా సుమ రిలీజ్ చేసింది. అందుకు సంబంధించిన విషయాల గురించి చర్చించిన ఈ టాప్ యాంకర్స్ సడన్ గా ఆంటీ అనే మ్యాటర్ గురించి మాట్లాడారు.

ఆంటీ అంటే కాలుతుంది
కొందరు తనను ఆంటీ అనడం ఏ మాత్రం నచ్చడం లేదని చెప్పిన అనసూయ మీసాలు గడ్డాలు వచ్చినవాడు కూడా ఆంటీ అంటుంటే కాలుతుంది కదా అక్క అని సుమకు తెలిపింది. అందుకు సుమ కూడా తనదైన శైలిలో సమాధానం ఇచ్చింది. నిజంగా ఎవరో అంటే మనం ఆంటీలు అయిపోలేము. మనం అనుకుంటేనే అవుతాము అని వివరణ ఇచ్చింది.

ఆహా యాప్ లో సుమ
ఇక ఈ విషయంపై కూడా మనం భవిష్యత్తులో చర్చలు జరపాల్సిన అవసరం ఉందని ఈ స్టార్ యాక్టర్స్ వారి సంభాషణలతో నెటిజన్స్ ని ఎంటర్టైన్ చేశారు. అందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక సుమ స్టార్ట్ చేయబోయే షో ఆహా యాప్ లో ప్రసారం కానుంది. ఈ షో ద్వారా ఓటీటీలో కూడా బిజీ కానున్నట్లు సుమ తెలిపింది.
Recommended Video

విజయ్ దేవరకొండ స్పెషల్ గెస్ట్
ఆల్ ఈజ్ వెల్ అనే ఆ షోలో కేవలం పాజిటివ్ అంశాలను మాత్రమే తీసుకొని సమాజంలో మంచి పనులు చేసేవారి గురించి వివరిస్తారట. వారానికోసారి మొదలయ్యే ఈ షోలో అప్పుడప్పుడు సెలబ్రెటి వీక్ కూడా ఉంటుందని తెలిపిన సుమ ఉదాహరణకు విజయ్ దేవరకొండ లాంటి హీరోలు కూడా ఈ షోలో కనిపించనున్నట్లు తెలిపారు


Click it and Unblock the Notifications











