సుమ సంపాదన కంటే నాదే ఎక్కువ..ఎవరికి తెలియని విషయాన్ని బయటపెట్టిన రాజీవ్ కనకాల

బుల్లితెర బెస్ట్ యాంకర్ అంటే అందరికి గుర్తొచ్చే ఒకే ఒక్క పేరు సుమ. హాట్ యాంకర్స్ , క్యూట్ యాంకర్స్ ఎంత మంది ఉన్నా కూడా సుమ తన మాటలతోనే అగ్ర స్థానంలో కొనసాగుతోంది. సరైన టైమింగ్ లో పంచ్ లు వేయడమే కాకుండా ఈవెంట్ కి తగ్గట్లుగా బాధ్యతతో కొనసాగుతూ ఉంటారు. ఇక భర్త రాజీవ్ కనకాల కంటే కూడా ఆమె సంపాదన చాలా ఎక్కువని అందరికి తెలిసిన విషయమే. ఇక మొదటిసారి రాజీవ్.. తన సంపాదన ఒక రకంగా చాలా ఎక్కువని చెప్పడం విశేషం.

ఒక్క ఈవెంట్ కు లక్షల్లో సంపాదన

ఒక్క ఈవెంట్ కు లక్షల్లో సంపాదన

సుమ ఎలాంటి షో స్టార్ట్ చేసినా కూడా టీవీలలో భారీ స్థాయిలో రేటింగ్ అందుకోవడం చాలా కామన్. సినిమాకు సంబంధించిన ఈవెంట్స్ కి సుమ లక్ష నుంచి రెండు లక్షల వరకు పేమెంట్ అందుకుంటుందని ఒక టాక్ అయితే ఉంది. ఇక రెగ్యులర్ షోలకు కూడా ఆమె లక్షల్లో ఆదాయాన్ని అందుకుంటారు. సుమ కోసం ఆడియో ఈవెంట్స్ డేట్స్ మారిన సందర్భాలు కూడా ఉన్నాయి.

ఆమె ఆదాయం ఎక్కువైతే ఏంటి..

ఆమె ఆదాయం ఎక్కువైతే ఏంటి..

ఇక ప్రతిసారి భర్త రాజీవ్ కనకాల ఇచ్చిన ఇంటర్వ్యూలలో సుమ సంపాదనపై ప్రశ్నలు అడుగుతూనే ఉంటారు. సుమ సంపాదన మీ కంటే ఎక్కువ కదా..మీ ఫీలింగ్ ఏమిటనే ప్రశ్నలకు రాజీవ్ ప్రతిసారి ఒక్క మాటలో ఎండ్ కార్డ్ పెట్టేస్తుంటారు. అవును నా కంటే కూడా తన సంపాదన చాలా ఎక్కువ. అయితే ఏంటి అని డైరెక్ట్ గా అనేస్తుంటారు. ఇక ఈ సారి కాస్త విభిన్నంగా సమాధానం ఇచ్చారు.

అలా చూస్తే.. నా సంపాదన ఎక్కువే..

అలా చూస్తే.. నా సంపాదన ఎక్కువే..

ప్రతిసారి రొటీన్ అనుకున్నారో ఏమో తెలియదు గాని ఈ సారి మాత్రం సుమ సంపాదన కంటే నాది ఒక రకంగా ఎక్కువే అంటూ డిఫరెంట్ ఆన్సర్ ఇచ్చారు. నేను మొదట్లో సంపాదించిన దానితో ఆస్తులు కూడబెట్టుకున్నాను. ఆ విధంగా వాటి విలువలతో పోలిస్తే సుమ సంపదన కంటే తనది చాలా ఎక్కువని రాజీవ్ కనకాల కొత్తగా వివరణ ఇచ్చారు.

బాగా ఇబ్బంది పెట్టింది..

బాగా ఇబ్బంది పెట్టింది..

ప్రతిసారి భర్త కంటే భార్య సంపాదన ఎక్కువ అనే ప్రశ్నకు ఆయన మొదటిసారి ఇచ్చిన ఈ కౌంటర్ తో ఒక ఎండ్ కార్డ్ పడినట్లు చెప్పవచ్చు. ఇక ఒక విషయంలో సుమ ఈ మధ్య చిరాకు తెప్పించినట్లు చెప్పారు రాజీవ్ కనకాల. లాక్ డౌన్ లో ఇంట్లో ఎక్కువగా ఉండడం వలన ఇలా ఉండాలి..అలా ఉండాలి.. అంటూ ఇబ్బంది పెట్టినట్లు సరదాగా వివరణ ఇచ్చాడు ఈ సీనియర్ నటుడు.

Recommended Video

Anchor Suma Tips To Stay Away From Corona Virus
RRRలో కీలక పాత్రలో..

RRRలో కీలక పాత్రలో..

రాజీవ్ కనకాల జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ మొదటి నుంచి చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అని అందరికి తెలిసిన విషయమే. ఎన్టీఆర్ నటించిన సినిమాల్లో రాజీవ్ ఉన్నాడు అంటే ఎదో కీలక పాత్రలో కనిపించబోతున్నాడని అర్థం చేసుకోవచ్చు. రాజమౌళి కూడా రాజీవ్ కి మొదటి నుంచి సన్నిహితుడే. ఇక వారి కాంబినేషన్ లో వస్తున్న RRR సినిమాలో కూడా రాజీవ్ కనకాల ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడట. ఆ క్యారెక్టర్ చాలా డిఫరెంట్ గా ఉంటుందని అంత కంటే ఎక్కువగా పాత్ర గురించి చెబితే బావుండదని, అది రాజమౌళి రూల్ అని తెలిపారు రాజీవ్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X