For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  రాజీవ్ కనకాలతో గొడవలు నిజమే.. విడాకుల కామెంట్స్ పై సుమ ఫస్ట్ రియాక్షన్!

  |

  తెలుగు టెలివిజన్ రంగంలో నెంబర్ వన్ యాంకర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న సుమ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆమె ఎలాంటి ఈవెంట్ హోస్ట్ గా కనిపించినా కూడా భారీ స్థాయిలో ప్రమోషన్ చేకూరుతుంది. అంతేకాకుండా రియాలిటీ షో లో యాంకర్ గా కూడా సుమ మంచి ఎంటర్టైన్మెంట్ ను అందించే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఇక మొదటి సారి ఆమె లీడింగ్ పాత్రలో నటించిన జయమ్మ పంచాయతీ అనే సినిమా విడుదల కాబోతోంది. ఈ క్రమంలో ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇస్తున్న యాంకర్ సుమ రీసెంట్గా రాజీవ్ కనకాల తో విడాకులు తీసుకున్నట్లు వచ్చిన కామెంట్స్ పై కూడా స్పందించింది.. ఆ వివరాల్లోకి వెళితే..

  నెంబర్ వన్ యాంకర్

  నెంబర్ వన్ యాంకర్

  యాంకర్ సుమ ఎలాంటి షో నిర్వహించిన కూడా ఆ షోకు మొదట్లోనే మంచి గుర్తింపు లభిస్తుంది. మంచి టైమింగ్ తో అన్ని వర్గాల వారిని ఆకట్టుకునే సుమ ఇండస్ట్రీలో అసలు నెగిటివ్ కామెంట్స్ కూడా అందుకోలేదు. కాంట్రవర్సీ లేకుండా ఆమె ఇండస్ట్రీలో మంచి యాంకర్ గా గుర్తింపు అందుకుంది. ఇక మిగతా యాంకర్స్ సుమ రేంజ్ కు తగ్గట్టుగా పోటీని అయితే ఇవ్వలేకపోతున్నారు. గ్లామరస్ యాంకర్స్ ఎంతమంది వచ్చినా కూడా సుమ తరహాలో అయితే ఎంటర్టైన్మెంట్ అందించలేరనే చెప్పాలి.

  ప్రేమ పెళ్లి..

  ప్రేమ పెళ్లి..


  మొదట్లో టెలివిజన్ రంగంలో నటిగా తన కెరీర్ ని మొదలు పెట్టిన సుమ ఆ తరువాత రాజీవ్ కనకాలను ప్రేమించి పెళ్లి చేసుకుంది. అనంతరం ఆమె ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చిన తర్వాత మళ్లీ టెలివిజన్ రంగంలోకి ప్రవేశించింది. కేవలం యాంకర్ గానే కాకుండా ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా సుమ స్పెషల్ హోస్ట్ గా నిర్వహిస్తూ వస్తోంది.

   భర్త కంటే ఎక్కువ సంపాదన

  భర్త కంటే ఎక్కువ సంపాదన


  సినిమా కు సంబంధించిన ఎలాంటి ఈవెంట్స్ లో ఆయన సుమ ఉంటే మాత్రం వెంటనే నిర్వాహకులకు సగం ధైర్యం వచ్చేస్తుంది అని చెప్పవచ్చు. ఆ తరహాలో ఈవెంట్స్ ను కొనసాగించే సుమ ఒక ఈవెంట్ కు దాదాపు రెండు లక్షల వరకు పారితోషికం కూడా అందుకుంటుంది అని అనేక రకాల కథనాలు వెలువడ్డాయి. ఒక విధంగా ఆమె రాజీవ్ కనకాల కంటే ఎక్కువ ఆదాయాన్ని అందుకుంటూ ముందుకు సాగుతోంది.

  విడాకులు అంటూ..?

  విడాకులు అంటూ..?

  ఇక ఎంతో అన్యోన్యంగా ఉండే రాజీవ్ కనకాల సుమ ఇద్దరూ కూడా విడాకులు తీసుకునే ఆలోచనలో ఉన్నట్లు గతంలో చాలా రకాల రూమర్స్ అయితే వచ్చాయి. అయితే అందులో ఎలాంటి నిజం లేదు అని ఆ మధ్య రాజీవ్ కనకాల కూడా స్పందించాడు. ఇక సుమ మాత్రం ఎప్పుడూ కూడా అలాంటి విషయాలపై పెద్దగా స్పందించింది లేదు.

   స్పందించిన సుమ

  స్పందించిన సుమ


  ఇక సుమా మొదటిసారి ఆ విషయాలపై స్పందించక తప్పలేదు. ఆలీతో సరదాగా ప్రోగ్రామ్ లో పాల్గొన్న యాంకర్ సుమ జయమ్మ పంచాయతీ సినిమా గురించి చెబుతూనే రాజీవ్ కనకాల తో దూరంగా ఉంటున్నారు అనే కామెంట్స్ పై కూడా స్పందించింది. మీరు ఒక ఇంట్లో రాజీవ్ మరొక ఇంట్లో ఉంటున్నారు అని.. అడిగిన ప్రశ్నకు సుమ చాలా సున్నితంగా సమాధానం చెప్పింది.

  గొడవలు నిజమే అంటూ..

  గొడవలు నిజమే అంటూ..


  కొన్ని గొడవలు జరిగిన మాట వాస్తవమే అంటూ 23 ఏళ్ల జీవితంలో ఎన్నో గొడవలు వచ్చాయి అని.. కానీ ఒక్కటి మాత్రం నిజం అని భార్యాభర్తలు విడాకులు తీసుకోవడం చాలా ఈజీ కానీ పేరెంట్స్ గా మాత్రం అది చాలా కష్టతరమైనది అంటూ సుమ చాలా సెన్సిటివ్ గా ఆ విషయాన్ని తెలియజేసింది. మరి సుమ నిజంగానే ఈ వ్యాఖ్యలు చేసిందా లేకపోతే ప్రోమో కోసం కామెంట్ చేసిందా అనే విషయం తెలియాలంటే ఫుల్ ఎపిసోడ్ టెలికాస్ట్ అయ్యే వరకు ఆగాల్సిందే.

  English summary
  Suma kanakala about divorce rumours clarification in alitho saradaga
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X