సుమతో రాజీవ్ కనకాల విడాకులు? అమ్మ బాధ చూడలేకపోయా... రోషన్ కనకాల షాకింగ్‌ కామెంట్స్

టాలీవుడ్ స్టార్ కపుల్స్‌లో యాంకర్ సుమ కనకాల, రాజీవ్ కనకాల జోడీ కూడా ఒకరు. స్టార్ హీరోలు, హీరోయిన్లు కాకపోయినా వీరిద్దరిది తెలుగు చిత్ర పరిశ్రమతో అవినాభావ సంబంధం. స్టార్ యాంకర్‌గా బుల్లితెరను ఏలడంతో పాటు సినిమా ఈవెంట్స్, ప్రమోషనల్ కార్యక్రమాలు, ఇంటర్వ్యూలు ఇలా టాలీవుడ్‌లో ఏది జరిగినా దానిని ఖచ్చితంగా సుమ హోస్ట్ చేయాల్సిందే. సుమ హోస్టింగ్‌తోనే స్టార్ వాల్యూ వస్తుందని భావించే వాళ్లు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ఆమె అపాయింట్‌మెంట్ కోసం దర్శక నిర్మాతలు క్యూకడతారంటే సుమ రేంజ్ అర్ధం చేసుకోవచ్చు.

ఇక రాజీవ్ కనకాల.. స్వయంగా నటుడు, దర్శకుడు దేవదాస్ కనకాల కుమారుడు. భారతీయ చిత్ర పరిశ్రమలో స్టార్లుగా వెలుగొందుతున్న ఎంతోమంది సూపర్‌స్టార్స్‌కు ఆయన నటనలో ఓనమాలు దిద్దించారు. అలా వీరి కుటుంబం చిత్ర పరిశ్రమకు ఎంతో సేవ చేస్తోంది. రాజీవ్ కూడా తొలుత బుల్లితెరపై అడుగుపెట్టి ఆ తర్వాత సినిమాలలో విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఫుల్ స్వింగ్‌లో ఉన్నారు. ప్రస్తుతం ఓటీటీ యుగంలో రాజీవ్ కనకాల వంటి నటులకు ఫుల్ డిమాండ్ ఉన్న సంగతి తెలిసిందే.

Suma Kanakala and Rajeev Kanakala divorce Mowgli Actor Roshan Kanakala Breaks Silence on Rumors

హీరోగా సుమ కుమారుడు
దేవదాస్ కనకాల దర్శకత్వంలో వచ్చిన మేఘమాల సీరియల్‌‌లో సుమ హీరోయిన్‌గా నటించారు. ఇందులో రాజీవ్ కనకాల కీలకపాత్ర పోషించారు. అయితే దీనికంటే ముందే సుమ- రాజీవ్‌లకు పరిచయం ఉంది. ఇదే సమయంలో మాధురి, జీవనరాగం తదితర సీరియల్స్‌లో కలిసి నటించడంతో ఇద్దరి మధ్య స్నేహం మరింత పెరిగి ప్రేమగా మారింది. ఆమెకు రాజీవ్ ప్రపోజ్ చేయగా కేవలం 3 రోజుల్లోనే అతని ప్రేమకు సుమ అంగీకారం తెలిపారు. మధ్యలో కొన్ని మనస్పర్ధలు వచ్చి వీరిద్దరూ దూరంగా ఉన్నప్పటికీ తర్వాత అర్ధం చేసుకుని దగ్గరయ్యారు. అలా 1999, ఫిబ్రవరి 10 రాజీవ్ కనకాల, సుమ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వీరికి రోషన్ కార్తీక్ కనకాల, మనస్విని కనకాల సంతానం. ప్రస్తుతం తమ కుమారుడు రోషన్‌ను హీరోగా నిలబెట్టేందుకు వీరిద్దరూ శ్రమిస్తున్నారు.

డిసెంబర్ 13న మోగ్లీ
అందరు సెలబ్రిటీల మాదిరిగానే సుమ, రాజీవ్ కనకాలపై ఎన్నో రూమర్స్ వచ్చాయి. వీరిద్దరూ విడిపోతున్నారని, త్వరలోనే విడాకులు తీసుకోబోతున్నారని గాసిప్స్ వైరల్ అయ్యాయి. వీటికి సుమ, రాజీవ్ కనకాల ఎన్నోసార్లు చెక్ పెట్టారు. అయినప్పటికీ గాసిప్స్‌కి మాత్రం తెర పడటం లేదు. తాజాగా సుమ, రాజీవ్‌ల తనయుడు రోషన్ కార్తీకేయకు ఓ ఇంటర్వ్యూలో ఇదే ప్రశ్న ఎదురవ్వగా ఆయన తనదైన శైలిలో ఆన్సర్ ఇచ్చారు. రోషన్ హీరోగా నటించిన మోగ్లీ డిసెంబర్ 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా జరిగిన ప్రమోషనల్ కార్యక్రమాలో రోషన్ పలు ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఓ ఇంటర్వూలో ఆయన తల్లిదండ్రుల గురించి మాట్లాడుతూ..

ప్రతివాడికి ఇదే క్వశ్చన్
ఇంట్లో ఏం జరుగుతుందో మాకు క్లారిటీ ఉంది. అందరం హాయిగా ఉన్నాం. ఎక్కడ మొదలైందో ఇది ఎవరికీ తెలియదు. రూమర్స్ స్ప్రెడ్ అయిపోతున్నాయి. ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు. ప్రతివాడు అదే అడుగుతున్నాడు. ఏ క్వశ్చన్ లేనట్లు అదే అడుగుతారు. ఒక పాయింట్ నాకు అర్ధమైంది ఏంటంటే.. ఇలాంటివి పట్టించుకోకూడదు. ఎందుకంటే నువ్వంటే నీకు తెలిసినప్పుడు నువ్వు ఇన్‌సెక్యూర్ గానీ, బాధగానీ పడక్కర్లేదు. తెలియనప్పుడే బాధపడతారు. నాకు తెలుసు కదా. అలాంటప్పుడు నేనెందుకు అంత ఇంపార్టెన్స్ ఇస్తాను అనే క్లారిటీ వచ్చిందని రోషన్ తెలిపారు.

అమ్మానాన్న హాయిగా ఉన్నారు
నాకు ఆ సమయంలో పెద్ద వయసు లేకపోయినప్పటికీ, అది చూసి నవ్వుకునే వాడిని. ఎందుకంటే క్లారిటీగా తెలుస్తోంది కదా. అమ్మానాన్న ఇద్దరూ హాయిగా ఉన్నారు. వీళ్లెందుకు ఇష్టమొచ్చినట్లు రాస్తున్నారు అనుకునేవాడిని. అమ్మ ఎన్నోసార్లు ఎమోషనల్ అయ్యింది. బయట ఇష్టమొచ్చినట్లు జనాలు మాట్లాడుతున్నప్పుడు ఎవరైనా బాధపడతారు. స్టార్టింగ్‌లో నాకు కూడా కొంచెం ఇబ్బందిగా ఉండేది. ఇలా లేదు కదా ఎందుకిలా రూమర్స్ క్రియేట్ చేస్తున్నారని బాధ ఉండేది. దానిని పట్టించుకోవడం ఆపేశాం. అమ్మ కూడా స్టార్టింగ్‌లో బాధపడిందేమో కానీ ఆ తర్వాత ఏ రోజు దాని గురించి పట్టించుకోలేదని రోషన్ వెల్లడించారు.

నాన్న అలా బరువు పెరిగిపోయారు
నాన్న విపరీతంగా లావు అయిపోవడంపైనా ఇష్టమొచ్చినట్లు రూమర్స్ వచ్చాయి. కానీ నాన్న స్వతహాగా భోజనప్రియుడు. ఫుడ్ అంటే చాలా ఇష్టం. నాకు కూడా అంతే. ఒక మనిషి లావు అయిపోయాడంటే మందే కాకుండా చాలా కారణాలు ఉంటాయి. నాన్న వయసుకి వర్కవుట్స్ చాలా కష్టం. ఆయనకి కూడా పెద్దగా ఇష్టం ఉండదు. ఈ కారణాలతో కొంచెం లావు అయ్యారు. ఈ మధ్య వర్కవుట్స్ చేసి కొంచెం తగ్గుతున్నారు. డ్రాగన్‌లో నాన్న నటిస్తున్నారు.. దానికి ప్రశాంత్ నీల్ గారు కొంచెం తగ్గమని చెప్పారట. తనకి కొంచెం సన్నగా కనిపించాలని ఏ రోజూ ఏ డైరెక్టర్ కూడా నాన్నని అడగలేదు. దాంతో తను హ్యాపీగా ఫుడ్‌ని ఎంజాయ్ చేస్తున్నాడు. మిగతా రూమర్స్ గురించి ఇంకెం చెబుతాం అని రోషన్ క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

More from Filmibeat

Read more about: roshan kanakala rajeev kanakala
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X