For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  వివాదంలో చిక్కుకున్న యాంకర్ రవి: ఎలా బుక్కయ్యాడో చెప్పి షాకిచ్చిన సుమ.. ఎవ్వడూ వినడు అంటూ!

  |

  బుల్లితెరపై యాంకరింగ్ రంగంలో అమ్మాయిలదే హవా అన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అంతలా పదుల సంఖ్యలో లేడీ యాంకర్లు సత్తా చాటుతున్నారు. వాళ్ల ప్రభావం ఉన్నప్పటికీ దాదాపు పదేళ్లుగా ఈ రంగంలో తన హవాను చూపిస్తూ దూసుకెళ్తున్నాడు ప్రముఖ యాంకర్ రవి. వరుస ఆఫర్లను దక్కించుకుంటూ ముందుకెళ్తున్నాడు. అదే సమయంలో తన వ్యవహార శైలితో తరచూ ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటున్నాడు. ఇలాంటి సమయంలో టాప్ హోస్ట్ సుమ కనకాల తాజాగా రవిపై షాకింగ్ కామెంట్స్ చేసింది. అసలేం జరిగింది? పూర్తి వివరాలు మీకోసం!

   అలా మొదలైన కెరీర్.. సుదీర్ఘ ప్రస్థానం

  అలా మొదలైన కెరీర్.. సుదీర్ఘ ప్రస్థానం

  చాలా కాలం క్రితమే బుల్లితెరపైకి యాంకర్‌గా ఎంట్రీ ఇచ్చాడు రవి. ఆరంభంలోనే అద్భుతమైన హోస్టింగ్‌తో అలరించిన అతడు.. ప్రశంసలు అందుకున్నాడు. అదే సమయంలో వరుసగా ఆఫర్లను దక్కించుకుంటూ వచ్చాడు. ఇలా దాదాపు పదేళ్లుగా ఈ రంగంలో హవాను చూపిస్తున్నాడు. తద్వారా టీవీ షోలు, సినిమా ఫంక్షన్లు, ఇంటర్వ్యూలు చేస్తూ దూసుకుపోతున్నాడీ యాంకర్.

   శ్రీముఖితో కలిసి రచ్చ రచ్చ చేసిన రవి

  శ్రీముఖితో కలిసి రచ్చ రచ్చ చేసిన రవి

  సుదీర్ఘమైన ప్రయాణంలో యాంకర్ రవి ఎన్నో షోలకు యాంకరింగ్ చేశాడు. అందుకే చాలా వరకూ విజయవంతంగా ప్రదర్శితం అయ్యాయి. మరీ ముఖ్యంగా ప్రముఖ ఛానెల్‌లో ప్రసారం అయిన ‘పటాస్' మాత్రం అతడికి మంచి పేరును తెచ్చింది. ఇందులో హాట్ యాంకర్ శ్రీముఖితో కలిసి అతడు చేసిన రచ్చకు ఎంతో మంది ఫిదా అయిపోయారు. కానీ, కొన్ని ట్రోల్స్ కూడా వచ్చాయి.

   హీరోగా పరిచయం.. పోలీస్‌ కేసుతో షాక్

  హీరోగా పరిచయం.. పోలీస్‌ కేసుతో షాక్

  యాంకర్‌గా సూపర్ డూపర్ హిట్ అయిన రవి.. కొన్నేళ్ల క్రితం ‘ఇది మా ప్రేమకథ' అనే సినిమాతో హీరోగా మారాడు. ఈ చిత్రం డిజాస్టర్ అయింది. దీంతో డిస్ట్రిబ్యూటర్ సందీప్ తనను రూ. 41 లక్షలు ఇవ్వకుండా మోసం చేశాడని రవి అతడిపై కూకట్‌పల్లి పీఎస్‌లో కేసు పెట్టాడు. ఆ తర్వాత అతడు కూడా యాంకర్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఇది అప్పట్లో పెద్ద సంచలనం అయింది.

  వివాదాలతో సతమతం... అది భారీగానే

  వివాదాలతో సతమతం... అది భారీగానే

  కెరీర్ పరంగా ఎంత సక్సెస్ అయ్యాడో.. అదే సమయంలో తన వ్యవహార శైలితో పలు వివాదాల్లోనూ భాగం అయ్యాడు యాంకర్ రవి. వాటిలో ఓ సినిమా ఫంక్షన్‌లో ఆడవాళ్లపై చేసిన కామెంట్స్ పెద్ద రాద్దాంతం అయ్యాయి. ఆ తర్వాత అతడు పలుమార్లు క్షమాపణలు చెప్పినా.. చాలా రోజులు రవిపై మహిళా సంఘాలు గొడవలు చేసిన విషయం తెలిసిందే. అలా పలుమార్లు విమర్శలపాలయ్యాడు.

  సుమక్కతో కలిసి చాలెంజ్‌ విసురుతూ

  సుమక్కతో కలిసి చాలెంజ్‌ విసురుతూ

  ప్రస్తుతం యాంకర్ రవి చేస్తున్న షోలలో ‘బిగ్ సెలెబ్రిటీ ఛాలెంజ్' ఒకటి. జీ తెలుగులో ప్రసారం అవుతోన్న ఈ కార్యక్రమంలో సెలెబ్రిటీలు గెస్టులుగా వస్తుంటారు. వాళ్లంతో కొన్ని గేమ్స్ ఆడించడమే దీని కాన్సెప్ట్. ఈ ప్రోగ్రాంకు రవితో పాటు టాప్ యాంకర్ సుమ కూడా హోస్టుగా చేస్తున్నారు. వీళ్లిద్దరూ రచ్చ రచ్చ చేస్తున్నారు. ఇక, వచ్చే వారానికి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది.

  వివాదంలో చిక్కుకున్న యాంకర్ రవి

  వచ్చే వారం ప్రసారం కానున్న ‘బిగ్ సెలెబ్రిటీ ఛాలెంజ్' ఎపిసోడ్‌కు ‘షాదీ ముబారక్' చిత్ర యూనిట్ సభ్యులు గెస్టులుగా వచ్చారు. అందులో సింగర్ మంగ్లీ కూడా ఉంది. ఆమెను ఉద్దేశించి యాంకర్ సుమ ‘షాదీ మీద నీ అభిప్రాయం ఏంటి' అని అడగగా.. మంగ్లీ వెంటనే ‘రవి నోరు మంచిది కాదు' అని పంచ్ వేసింది. ఇది అర్థం కాక ముందు చప్పట్లు కొట్టి.. వెంటనే నాలుక కరుచుకున్నాడు రవి.

  Anchor Suma జీవితం లోని ఆసక్తికర విషయాలు | HBD Anchor Suma
  ఎలా బుక్కయ్యాడో చెప్పి షాకిచ్చిన సుమ

  ఎలా బుక్కయ్యాడో చెప్పి షాకిచ్చిన సుమ

  తనపై పంచ్ వేసినా పట్టించుకోకుండా రవి చప్పట్లు కొట్టడంపై సుమ మాట్లాడుతూ.. ‘ఇలాగో ఒకసారి హా.. సూపర్ అన్నావు. అయిపోయింది. మళ్లీ స్పీకర్లు ఇటువైపు లేవు.. నేను వినలేదండి. అని చెప్పావు. అలా చెబితే ఎవ్వడూ వినడు' అంటూ పంచ్ పేల్చింది. అప్పట్లో జరిగిన పెద్ద వివాదం గురించి ఇలా వివరణ ఇచ్చింది సుమ. దీంతో చాలా సేపు రవి నోటి నుంచి మాటే రాలేదు.

  English summary
  Suma Kanakala earlier known as is an Indian TV anchor, host, singer, actress, and producer. She is best known for starring in Star Mahila, a game show, which is the longest running game show in India.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X