Suma Kanakala: యాంకర్ సుమకు చేతబడి.. దెయ్యం పట్టిందన్న విరూపాక్ష నటుడు!
ఇప్పటివరకు తెలుగు బుల్లితెరపై ఎంతో మంది ముద్దుగుమ్మలు యాంకర్లుగా సందడి చేశారు. కానీ, అందులో అతి తక్కువ మంది మాత్రమే విశేషమైన గుర్తింపును సొంతం చేసుకుని స్టార్ యాంకర్ గా నిలిచారు. ఇంకొందరు యాంకర్ అంటే ఇలా ఉండాలి, యాంకరింగ్ కు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తారు. ఎవరు పొందలేని విశేషమైన గుర్తింపు పొందుతారు. అలాంటి వారిలో ముందుగా గుర్తుకు వచ్చేది సుమ కనకాల. యాంకరింగ్ లో ఒక బెంచ్ మార్క్ సెట్ చేసిన సుమకు దెయ్యం పట్టిందని విరూపాక్ష నటుడు తెలిపాడు.
అంతవరకే హాస్యం: ఎంతో కాలంగా తెలుగు బుల్లితెరపై స్టార్ యాంకర్ గా వెలుగొందుతోంది సుమ కనకాల. తనదైన కామెడీ పంచ్ లతో హీరో హీరోయిన్లు ఎవరనేది చూడకుండా ఎంటర్టైన్ చేస్తుంది ఈ యాంకరమ్మ. ఎదురుగా ఎంత పెద్ద హీరో, హీరోయిన్ ఉన్నా తనదైన స్టైల్ తో పంచ్ లు వేస్తుంది. అలా అని మరి డీగ్రేడ్ సెటైర్స్ వేయదు. ఎంతవరకు హాస్యం పండించాలో అంతవరకు అందరు మెచ్చేలా ఉంటాయి.

సెలబ్రిటీలను రోస్ట్: తన సుదీర్ఘమైన కెరీర్‌లో ఇలా ఎన్నో వినోదాత్మక కార్యక్రమాలు చేసింది సుమ కనకాల. ఆమె చేసిన అనేక కార్యక్రమాలు, టీవీ షోలు చాలా వరకు సూపర్ హిట్ అవడంతో పాటు మంచి పేరును తెచ్చి పెట్టాయి. అందులో 'క్యాష్' కూడా ఒకటని తెలిసిందే. బుల్లితెర, వెండితెరకు చెందిన సెలెబ్రిటీలు హాజరయ్యే ఈ షో విజయవంతంగా ప్రసారం అయింది. ఇందులో సెలబ్రిటీలను రోస్ట్ చేస్తూ ఫన్ అందించేది.
రెండు జంటలు: ఇప్పుడు తాజాగా 'సుమ అడ్డా' ద్వారా ఇంకాస్తా డోస్ పెంచుతూ సెలబ్రిటీలను రోస్ట్ చేస్తుంది సుమ కనకాల. ఈ షోకి తాజాగా బిగ్ బాస్ ఫేమ్ మానస్-కావ్య ఓ జంటగా.. కార్తీక దీపం మోనిత అయినా శోభా శెట్టి-సీరియల్ నటుడు, విరూపాక్ష ఫేమ్ రవి కృష్ణ మరో జోడీగా ఎంట్రీ ఇచ్చి సందడి చేశారు. దీనికి సంబంధించిన ప్రోమోను లేటెస్ట్ గా రిలీజ్ చేశారు.

ఎడిటింగ్ లో తీసేయండి: నీకిష్టమైన 10 మంది యాంకర్స్ పేర్లు 10 సెకన్లలో చెప్పమని మానస్ ను సుమ అడిగింది. అందుకు ఎవరు లేరని సుమకు షాక్ ఇచ్చాడు. తర్వాత ఓ షో గెలవాలి కదా అని సుమ.. సుమ.. సుమ అని పది సార్లు పేరు చెప్పాడు మానస్. దీంతో ఫస్ట్ ది ఎడిటింగ్ లో తీసేసి ఇది మాత్రం ఉంచండి. ఓకేనా.. అని సుమ కామెడీ చేసింది.

ఫన్నీ ఎక్స్ ప్రెషన్స్: అనంతరం విరూపాక్షలో మీరు చేసిన పని ఇప్పుడు చేయండి. నాకు దెయ్యం పట్టింది అని సుమ అంటుంది. దీనికి మాన్యుఫాక్చర్ లోనే (మొదటి నుంచే దెయ్యం పట్టిందన్న సెన్సుతో) దెయ్యం పట్టింది అని విరూపాక్ష నటుడు రవి కృష్ణ అన్నాడు. తర్వాత విరూపాక్ష సినిమాలో చేతబడి చేసినట్లుగా రవికృష్ణ చేస్తే.. దెయ్యం పట్టి విచిత్రంగా ప్రవర్తించింది యాంకర్ సుమ. ఇందులో సుమ ఇచ్చే ఫన్నీ ఎక్స్ ప్రెషన్స్ నవ్వు తెప్పించేలా ఉన్నాయి.


Click it and Unblock the Notifications











