ఆ పెయిన్ తట్టుకోలేం.. అర్ధం చేసుకునే మగాళ్లు కొందరే.. యాంకర్ సుమ ఎమోషనల్

సుమ కనకాల... పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. దాదాపు పాతికేళ్లుగా టాలీవుడ్‌లో స్టార్ యాంకర్‌గా దూసుకెళ్తున్నారు. కేరళ అమ్మాయి అయినప్పటికీ తెలుగులో చెడుగుడు ఆడుకుంటూ తను ఎక్కడుంటే అక్కడ అందరినీ నవ్వుతూ నవ్విస్తూ ఉంటారు. టీవీ షోలు, సినిమా ఈవెంట్స్, ఇంటర్వ్యూలు, ప్రైవేట్ కార్యక్రమాలు ఇలా ఏదైనా సరే అలవోకగా చేసుకుంటూ వెళ్తారు. ఇండస్ట్రీకి ఎందరో యాంకర్లు వచ్చారు.. వెళ్లారు. కానీ సుమ స్థానం మాత్రం ప్రత్యేకం.

నటుడు రాజీవ్ కనకాలను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు సుమ. ఈ దంపతులకు ఒక కుమారుడు, కుమార్తె సంతానం. కొడుకు రోషన్‌ను హీరోగా నిలబెట్టేందుకు సుమ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే సుమ కనకాల తన షూటింగ్స్, షోలు, ఇతర వివరాలతో పాటు వ్యక్తిగత విషయాలను కూడా పంచుకుంటూ ఉంటారు. ఇక సామాజిక అంశాలపైనా సుమ స్పందిస్తూ తన అభిప్రాయాలను తెలియజేస్తూ ఉంటారు. తాజాగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్బంగా సుమ కనకాల చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అవుతున్నాయి. అభిమానులు అడిగిన ప్రశ్నలకు తన యూట్యూబ్ ఛానెల్‌లో సమాధానాలు తెలియజేశారు. ఈ వివరాలు పరిశీలిస్తే...

Suma Kanakala Inspires Women Shares Thoughts on Health Work and Period Pain on International Women s Day

నా జీవితంలో నన్ను ఎక్కువగా ఇన్స్‌పైర్ చేసింది మా అమ్మే. ప్రతిరోజ వర్కవుట్‌కి ఎలా వెళ్లాలి? ఆరోగ్యం బాగోకపోతే తనను తాను ఎలా రికవరీ చేసుకోవాలి? హెల్త్ గురించి జాగ్రత్తలు ఎలా తీసుకోవాలి.. తన గురించి తాను కేర్ తీసుకోవడానికి మా అమ్మే నాకు స్పూర్తి. ఇంట్లో ఆడవాళ్లు ఎన్నో పనులు చేస్తుంటారు. బయటికెళ్లి వాళ్లు పనులు చేయకపోవచ్చు.. కానీ నేనేం చేయడం లేదండి అంటూ ఉంటారు. కానీ మిమ్మల్ని చూసి వేరే వాళ్లు కూడా పశ్చాత్తాపడతారు. వీళ్లు ఇంటి దగ్గర ఇన్ని పనులు చేస్తున్నారా అని. లేదంటే ఇంట్లో ఊరికే పడుంటుంది అనుకుంటారు. పొద్దున్న లేచిన దగ్గరి నుంచి రాత్రి వరకు గొడ్డు చాకిరి చేస్తుంటారు. కొంతమంది ఆడవాళ్లు.. అన్ని పనులు నేనే చేసేయాలని అనుకుంటారు. ఇంటి పని, వంటి పని, ఆఫీసులో పని చేస్తుంటారు.. దీని వల్ల లేనిపోని హెల్త్ ఇష్యూస్ వస్తాయని సుమ తెలిపారు

పీరియడ్స్ వచ్చినప్పుడు పెయిన్స్ వచ్చినప్పుడు, ఆ బాధపడే అమ్మాయికి అర్ధమవుతుంది కానీ ఒక్కొక్కసారి అవతలివాళ్లు దానిని అర్ధం చేసుకోలేరు. ఏం ఉందిలే.. పర్లేదు కదా. చిన్నదానికే ఇంత చేస్తున్నారేంటీ అనుకుంటూ ఉంటారు. కానీ ఒక్కొక్క అమ్మాయికి పీరియడ్ టైంలో ఒక్కొక్క రకమైన అనుభవం ఉంటుంది. నాకున్న అనుభవం మరొకరికి ఉండకపోవచ్చు. కానీ పెయిన్ అనేది మాత్రం నిజం. కొంతమందికి కళ్లు తిరుగుతాయి, కొంతమందికి వాంతులు అవుతాయి, కొంతమందికి తలనొప్పి వస్తుంది, కొంతమందికి చెమటలు పడతాయి, కొంతమందికి ఎలాంటి ఇబ్బందులు కనిపించవు. కానీ ఆడవాళ్ల బాధని అర్ధం చేసుకోవాలని సుమ అన్నారు.

నా షెడ్యూల్స్ అన్ని అస్సలు ఊహించని విధంగా ఉంటాయి. ఒక ఆఫీస్‌కి వెళితే.. పొద్దున్నే 9 గంటలకు వెళ్లామా? సాయంత్రం 6 గంటలకు వచ్చామా? అన షెడ్యూల్స్ ఉంటే ప్రతిరోజూ ఒకటే టైంకి మనం జీమ్‌కి వెళ్లొచ్చు. కానీ నాకు కొన్నిరోజులు ఉదయం 6గంటలకే షూటింగ్స్ స్టార్ట్ అవుతాయి. కొన్ని రోజులు సాయంత్రం 6 గంటలకు షూటింగ్స్ స్టార్ట్ అవుతుంది. ఇది ఇలా మారుతూ ఉంటుంది కాబట్టి.. దీనిని డీల్ చేసేటప్పుడు టైమింగ్స్ మార్చుకుంటూ ఉంటా. ప్రతిరోజూ వ్యాయామం కుదరకపోతే.. మీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు బాడీని హెల్దీగా పెట్టుకోవడానికి కష్టపడాలి. నేను గంటల తరబడి నిలబడే ఉండాల్సి ఉంటుంది.. నా కాళ్లను ఎక్కువ కష్టపెడతాను కాబట్టి దాని మీద ఎక్కువ శ్రద్ధ పెడతాను అని సుమ తెలిపారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X