రోడ్డు ప్రమాదంలో జబర్దస్త్ కమెడియన్ దుర్మరణం, కంటతడితో యాంకర్ సుమ ఎమోషనల్
గత 12 ఏళ్లుగా తెలుగువారిని నవ్వుల్లో ముంచెత్తుతోంది జబర్దస్త్ కార్యక్రమం. ఇప్పటికీ తెలుగునాట నెంబర్ వన్ కామెడీ షోగా కొనసాగుతోంది. ఎంతోమంది ప్రతిభావంతులు ఈ కార్యక్రమం ద్వారా తెలుగు ప్రజలకు పరిచయమై ఉన్నత స్థాయికి చేరుకుంటున్నారు. అలా జబర్దస్త్ ద్వారా పరిచయమై బుల్లితెరపై సత్తా చాటుతున్న నటుడు దురదృష్టవశాత్తూ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. ఈ విషయం తెలుసుకున్న స్టార్ యాంకర్ సుమ కనకాల, ఇతర జబర్డస్త్ నటులు హుటాహుటిన నటుడి ఇంటికి చేరుకున్నారు. ఈ వివరాల్లోకి వెళితే..
రోడ్డు ప్రమాదంలో జబర్దస్త్ నటుడి మృతి
జబర్దస్త్‌తో గుర్తింపు తెచ్చుకున్న నటుడు బాబీ అలియాస్ లక్ష్మీనారాయణ రాజమండ్రిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. రెండు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. సోమవారం రాత్రి కొవ్వూరులోని రోడ్డు కం రైల్వే బ్రిడ్జిపై ఈ ప్రమాదం జరిగింది. కొవ్వూరుకు చెందిన ముగ్గురు యువకులు బైక్‌పై రాజమండ్రిలో సినిమా చూసేందుకు వెళ్తున్నారు. ఇదే సమయంలో రాజమండ్రి క్వారీ మార్కెట్‌కు చెందిన ఆనపు లక్ష్మీనారాయణ (బాబీ) తన బైక్‌పై వేగంగా వస్తుండగా.. రెండు బైక్‌లు బలంగా ఢీకొని అందరూ రోడ్డుపై పడిపోయారు. ఈ క్రమంలో బాబీ తలకు తీవ్రగాయాలు కావడంతో ప్రాణాలు కోల్పోయాడు.

మొత్తం ముగ్గురి మృతి
ప్రమాదం సమయంలో మొత్తం నలుగురు వ్యక్తులు బైక్‌లపై వెళ్తున్నారు. బాబీ, పోతుగంటి అక్షయ్ కుమార్, తగరపు సత్యకుమార్‌లు కూడా మరణించారు. కోమరి ఏడుకొండలు అనే వ్యక్తి సురక్షితంగా బయటపడినట్లుగా రాజమండ్రి నగర పోలీసులు తెలిపారు. అతివేగం, హెల్మెట్లు ధరించకపోవడమే ప్రమాదానికి కారణమని చెబుతున్నారు. మరోవైపు.. బాబీ మరణ వార్త గురించి తెలుసుకున్న జబర్దస్త్ నటులు సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని తెలియజేశారు. వృత్తిరీత్యా లాయర్ అయిన బాబీ.. న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తూనే నటనపై ఆసక్తితో జబర్దస్త్‌లో చిన్నాచితకా పాత్రలు వేస్తూ గుర్తింపు తెచ్చుకున్నారు. జబర్దస్త్‌తో పాటు స్టార్ యాంకర్ సుమ కనకాల హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న సుమ అడ్డా షోలో బాబీగా లక్ష్మీనారాయణ అందరికీ నోటెడ్ అయ్యారు.
బాబీకి నివాళులర్పించిన సుమ
అటు బాబీ మరణవార్త తెలుసుకున్న సుమ కనకాల.. హైదరాబాద్ నుంచి హుటాహుటిన రాజమండ్రి చేరుకుని లక్ష్మీనారాయణ భౌతికకాయానికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను ఓదార్చారు. నవ్వుతూ నవ్విస్తూ ఉండే బాబీని విగతజీవిగా చూసేసరికి సుమ కూడా తట్టుకోలేక కంటతడి పెట్టారు. సుమతో పాటు కొందరు జబర్దస్త్ నటులు, ఇతర సినీ ప్రముఖులు కూడా బాబీకి నివాళులర్పించారు. ఈ ప్రమాదం నేపథ్యంలో రెండ్రోజుల క్రితం బాబీ ఇచ్చిన ఇంటర్వ్యూ వైరల్ అవుతోంది.
సుమతోనే జర్నీ
చాలా మంది ఆర్టిస్టులు ఈరోజున ఇన్ని షోలు చేస్తున్నారంటే దానికి కారణం మల్లెమాల. అలాంటి కంపెనీలో నేను పనిచేయడం చాలా హ్యాపీగా ఉంది. సుమగారు మా కుటుంబంలో వ్యక్తి. ఆవిడ చాలా పెద్ద యాంకర్.. తెలుగు బుల్లితెరకు, సినీరంగానికి సుమగారంటే చాలా ఫేమస్. ఆవిడ ఆ స్థాయిలో ఉండి కూడా మా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్‌లా, ఒక మదర్‌లా, అక్కలా ఉంటారు. ఆవిడతో మాట్లాడుతుంటే ఒక పెద్ద యాంకర్‌తో మాట్లాడుతున్నామన్న ఫీలింగ్ ఉండదు చాలా మంచావిడ. మా అమ్మానాన్నలకు సుమగారంటే చాలా ఇష్టం. ఆవిడ మీద ఇష్టం ఉండే నేను ఆమె షోకి వెళ్లాను. డే 1 క్యాష్ షో నుంచి ఇప్పటి వరకు నేను సుమగారితోనే ట్రావెల్ చేస్తున్నాను... మేడం కూడా చాలా సపోర్ట్ ఇచ్చారు. ఆవిడ అంటే చాలా ఇష్టం. క్యాష్, సుమ అడ్డా వంటి ప్రోగ్రామ్స్‌ను సుమ గారు తప్పించి మరో యాంకర్ హ్యాండిల్ చేయలేరు అని యాంకర్ సుమపై తన అభిమానాన్ని చాటుకున్నారు బాబీ.


Click it and Unblock the Notifications











