షోలో సుమకు చేదు అనుభవం.. బయటకు పంపమని దండం పెట్టి వేడుకున్న యాంకర్.!

By Manoj

చాలా కాలంగా తనదైన శైలితో తెలుగు బుల్లితెరపై టాప్ యాంకర్‌గా కొనసాగుతోంది సుమ కనకాల. అద్భుతమైన టాలెంట్‌తో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న ఆమె... తెలుగుదనం ఉట్టిపడేలా కట్టు బొట్టుతో ఆకట్టుకుంటోంది. ఈ క్రమంలోనే దాదాపు ఇరవై ఏళ్లుగా ఆమె ఎన్నో షోలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆమె చేసిన ప్రతీ షో ప్రేక్షకాదరణను పొందుతూనే ఉంది. అందుకే ఈ సీనియర్ యాంకర్‌కు వరుసగా ఆఫర్లు వస్తున్నాయి. ఇంతటి పేరు ప్రఖ్యాతలు ఉన్న సుమకు ఓ షోలో చేదు అనుభవం ఎదురైంది. ఆ సంగతులేంటో చూద్దాం పదండి.!

సుమ స్పెషాలిటీ అదే.. అందుకే టాప్ ప్లేస్

సుమ స్పెషాలిటీ అదే.. అందుకే టాప్ ప్లేస్

ప్రస్తుతం తెలుగులో ఎంతో మంది యాంకర్లు తమ తమ టాలెంట్‌తో నెట్టుకొస్తున్నారు. వీరిలో చాలా మంది గ్లామర్‌నే నమ్ముకుని ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. కానీ, సుమ మాత్రం వీళ్లకు భిన్నంగా ఎంట్రీ ఇచ్చింది. అద్భుతమైన టైమింగ్‌తో పంచులు వేస్తూ సత్తా చాటుతోంది. పక్కింటి అమ్మాయిలా కనిపిస్తూ ఆడవారి మనసు దోచుకుంది. అందుకే టాప్‌ ప్లేస్ దక్కించుకుంది.

ఎక్కడ చూసినా సుమే.. ఫుల్ డిమాండ్

ఎక్కడ చూసినా సుమే.. ఫుల్ డిమాండ్

చాలా ఏళ్లుగా సుమ కెరీర్ జోరుగా సాగుతోంది. ఒకపక్క టీవీ షోలు చేసుకుంటూనే మరోవైపు సినిమా ఫంక్షన్లు, ఇంటర్వ్యూలు వగైరా కానిచ్చేస్తుంది. దీంతో ఈ సీనియర్ యాంకర్‌ ఫుల్ బిజీగా సాగుతోంది. వీటితో పాటు వ్యాపార ప్రకటనల్లోనూ నటిస్తూ నాలుగు రాళ్లు వెనకేస్తుంది. ఇలా అన్ని రకాలుగా అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటోంది.

సుమ ప్రొగ్రాంలు ప్రత్యేకం.. భారీ స్పందన

సుమ ప్రొగ్రాంలు ప్రత్యేకం.. భారీ స్పందన


ప్రస్తుతం తెలుగులో సుమ చాలా రకాల కార్యక్రమాలతో బిజీ బిజీగా గడుపుతోంది. ఈ కార్యక్రమాలన్నింటికీ టీవీలోనే కాకుండా యూట్యూబ్‌లో సైతం భారీ స్థాయిలో స్పందన వస్తోంది. ఎంతటి పెద్ద కమెడియన్లనైనా తన పంచులతో ముప్పతిప్పలు పెట్టే సుమ... ఇదే టైమింగ్‌ను నమ్ముకుని ముందుకు సాగుతోంది. ఆమె చేస్తున్న అన్ని కార్యక్రమాల్లో ఇదే ఫాలో అవుతోంది.

సుమ చేసే ఆ ప్రోగ్రాంకు మంచి గుర్తింపు

సుమ చేసే ఆ ప్రోగ్రాంకు మంచి గుర్తింపు

ఇప్పటికే సుమ ఎన్నో చానెళ్లలో చాలా రకాల కార్యక్రమాలు చేసింది. వాటిలో ఫ్యామిలీకి సంబంధించినవి, మహిళలకు చెందినవి, పిల్లల కోసం ప్రత్యేకంగా రూపొందించినవి ఉన్నాయి. సెలెబ్రిటీల కోసమే చేసిన షో కూడా ఉంది. అదే ‘క్యాష్'. ప్రముఖ ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న ఈ ప్రోగ్రామ్‌కు భారీ రెస్పాన్స్ వస్తోంది. యూట్యూబ్‌లో సైతం దీనికి అధికంగా వ్యూస్ వస్తున్నాయి.

క్యాష్ షోలో సుమకు చేదు అనుభవం

స్పాంటీనియస్‌గా పంచులు వేస్తూ కమెడియన్లను సైతం ముప్పతిప్పలు పెట్టగల టాలెంట్ సుమ సొంతం. ఈ ప్రత్యేకతతోనే సుమ చాలా కాలంగా నెట్టుకొస్తూ.. ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. అందుకే ఆమె ప్రోగ్రాం అయినా.. ఇంటర్వ్యూ అయినా సెలెబ్రిటీలు జాగ్రత్త పడుతుంటారు. అలాంటి సుమకు ఓ కమెడియన్ వల్ల చేదు అనుభవం ఎదురైంది.

బయటకు పంపమని దండం పెట్టింది

బయటకు పంపమని దండం పెట్టింది

‘క్యాష్' షోలో భాగంగా జబర్ధస్త్ కమెడియన్లు రాకింగ్ రాకేష్, వెంకీ, సుధాకర్, నవీన్, రాము, బాబీ, వినోదినితో పాటు పంచ్ ప్రసాద్‌లు వచ్చారు. వీళ్లంతా పాల్గొన్న ఈ ఎపిసోడ్ ప్రోమో రెండు రోజుల క్రితం విడుదలైంది. ఇందులో పంచ్ ప్రసాద్.. సుమపై పంచులతో విరుచుకుపడిపోయాడు. దీంతో ‘దండం పెడతాను అతడిని బయటకు పంపించేయండ్రా' అంటూ ఆమె సరదాగా వేడుకుంది.

Recommended Video

Ramuloo Ramulaa Dance By Suma Kanakala, Video Viral
ఆ కమెడియన్ నవ్వు వెనుక కష్టాలు

ఆ కమెడియన్ నవ్వు వెనుక కష్టాలు

పంచ్ ప్రసాద్ జబర్ధస్త్‌లో చాలా కాలంగా పని చేస్తున్నాడు. గతంలో ఓ టీమ్‌లో సభ్యుడిగా ఉన్న అతడు.. ఆ తర్వాత టీమ్ లీడర్ అయ్యాడు. ఆ సమయంలోనే అతడికి కిడ్నీకి సంబంధించిన వ్యాధి వచ్చింది. అప్పటి నుంచి చాలా కాలం షోకు దూరమయ్యాడు. ఇక, ఈ మధ్యనే షోలోకి రీఎంట్రీ ఇచ్చాడు. డయాలిసిస్ చేయించుకుంటూను జబర్ధస్త్‌లో పాల్గొంటున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X