రోడ్డుపై కారు వదిలేసి పరిగెత్తిన సుమ కనకాల.. స్టార్ యాంకర్‌కు చేదు అనుభవం..

తన యాక్టింగ్, యాంకరింగ్‌తో తెలుగు చిత్ర పరిశ్రమలో, బుల్లితెరపై క్వీన్‌గా వెలుగొందుతున్నారు సుమ కనకాల. భర్త, కుటుంబం, కెరీర్ ఇలా అన్నింటినీ బ్యాలెన్స్ చేస్తూ ముందుకెళ్తున్నారు ఈ స్టార్ యాంకర్. యాంకరింగ్ చేస్తూనే.. అడపా దడపా సినిమాల్లో నటిస్తున్నారు సుమ. కొద్ది నెలల క్రితం జయమ్మ పంచాయతీలో ఫుల్ లెంగ్త్ రోల్ చేసి మెప్పించారు. కష్టపడితే ఏదైనా సాధ్యమేనని నిరూపించిన సుమ కనకాల.. ఓ రోజున నడిరోడ్డుపై కారును ఉంచి పరుగులు తీశారట. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే..

మలయాళ కుటుంబంలో జన్మించిన సుమ కనకాల.. తెలుగును చెడుగుడు ఆడుకుంటారు. ఆమె కట్టుబొట్టు, ఆహార్యం, తెలుగును చక్కగా మాట్లాడటంపై మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు సహా పలువురు ప్రముఖులు మెచ్చుకున్నారు. స్టార్ హీరోల నుంచి జూనియర్ హీరోల వరకు సుమ యాంకరింగ్ కావాల్సిందే. అప్పుడే తమ ఈవెంట్స్‌కు ఓ హోదా వస్తుందని భావించేవారు ఎందరో. 50 ప్లస్‌లోనూ సినిమాలు, ఈవెంట్స్, ఇంటర్వ్యూ, బుల్లితెరతో పాటు బ్రాండ్ అండార్స్‌మెంట్లు, కుటుంబాన్ని ఒంటి చేత్తో నడిపిస్తున్నారు సుమ కనకాల. టీవీ, సినిమాతో పాటు మారుతున్న కాలానికి తగినట్లుగా తనను మార్చుకుంటూ ఉండటంతోనే సుమ యాంకరింగ్ ఇప్పటికీ ఫ్రెష్‌గా ఉంది. లేదంటే ఈ జెన్ జీ జనరేషన్‌ను ఆకట్టుకోవడం అంత ఈజీ కాదు.

Suma Kanakala Ran Through Traffic for Live Show Anchor s Dedication Wins Hearts

నటుడు రాజీవ్ కనకాలను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు సుమ కనకాల. ఈ జంటకు ఇద్దరు పిల్లలు. కుమారుడు రోషన్ కనకాల, మనస్విని కనకాల. కొడుకుని హీరోగా నిలబెట్టేందుకు ఈ ఇద్దరూ దంపతులు ఎంతో శ్రమిస్తున్నారు. అందరు సెలబ్రిటీల మీద వచ్చినట్లుగానే సుమ, రాజీవ్ కనకాల మీద కూడా ఎన్నో రూమర్స్ వచ్చాయి. సుమకు భారీ ఎత్తున ఆస్తులు ఉన్నాయని.. సుమ, రాజీవ్‌లు విడాకులు తీసుకోబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి. వీటిని సుమ చిరునవ్వుతో ఖండిస్తుంటారు. హెల్త్ కేర్ ఎక్కువగా తీసుకుంటూ తన ఆరోగ్యాన్ని, అందాన్ని కాపాడుకుంటున్నారు. ఇంతటి బిజీ షెడ్యూల్‌లోనూ యోగా, వర్కవుట్స్‌ని అస్సలు వదిలిపెట్టరు సుమ.

టీవీ షోలు, సినిమా ఈవెంట్స్‌తో బిజీగా ఉన్నప్పటికీ తన యూట్యూబ్ ఛానెల్, సోషల్ మీడియా ద్వారా అభిమానులతో టచ్‌లోనే ఉంటారు సుమ కనకాల. తన షోలకు సంబంధించిన వివరాలు, షూట్స్, కుటుంబ విషయాలను ఆమె పంచుకుంటూ ఉంటారు. తాజాగా తెలుగునాట పాపులర్ యాంకర్లు గీతా భగత్, స్రవంతి చొక్కారపు, జబర్దస్త్ వర్షలతో తన సుమ ఛాట్ షోలో సందడి చేశారు సుమ. ఈ సందర్భంగా ఈ స్టార్ యాంకర్ వృత్తిని ఎంత గౌరవిస్తారో? షూటింగ్‌లో ఎంత కష్టపడతారో తెలిపే సంఘటనను పంచుకున్నారు.

యాంకర్లతో సరదాగా గేమ్స్ ఆడించిన సుమ.. వారికి గిఫ్ట్‌లు అందజేసింది. ఇదే సమయంలో వర్ష మాట్లాడుతూ.. అక్కా ఒక్కటి జరిగిందట, నేను విన్నాను. అది నాకు చాలా ప్రౌడ్‌గా అసలు ఇలాంటివి నేర్చుకోవాలని అనిపిస్తూ ఉంటుంది. ఇది మీ కోసం వినింది. ఒకరోజు ఫుల్ ట్రాఫిక్‌‌ ఉంటే.. మీరు షూటింగ్ ఉంటే.. మీరు మధ్యలోనే సిగ్నల్ దగ్గరే కారు దిగిపోయి అలాగే వెళ్లి షూట్ చేశారట స్టార్ మహిళ అని అడిగింది వర్ష. దీనికి సుమ స్పందిస్తూ.. అది స్టార్ మహిళ కాదు. నేను లైవ్ షో చేస్తున్నాను మా టీవీలో. అప్పట్లో మాటీవీ పంజాగుట్ట దగ్గరుండేది. అక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోయింది.. లైవ్ స్టార్ట్ అవ్వాలి. వెళ్లడానికి కార్లు అన్నీ ఆగిపోయాయి.. దిగి పరిగెత్తా. తీరా అక్కడికి వెళ్లిన తర్వాత లిఫ్ట్ ఆగిపోయింది. దాంతో నాలుగో ఫ్లోర్ వరకు మళ్లీ పరిగెత్తా. పైకి వెళ్లి అప్పట్లో మేకప్ మేన్‌లు లేరు.. మనమే ఫాస్ట్ ఫాస్ట్‌గా రెడీ అయిపోయి నిల్చొన్నా అని సుమ చెప్పారు.

అందుకే డైరెక్టర్లలో రాజమౌళి గారు ఎలాగో.. ఫ్రూట్స్ అన్నింటిలో మ్యాంగో ఎలాగో.. యాంకర్స్ అందరికీ సుమక్క అలా అని స్రవంతి చొక్కారపు ప్రశంసించింది. ఈ ఒక్కదాని కోసమైనా ఈ షో చేసినందుకు నేను చాలా సంతోషిస్తున్నానంటూ పంచ్ విసిరారు సుమ. నేను దూరదర్శన్ నుంచి వచ్చాను.. అక్కడ చాలా రూల్స్ ఉంటాయి. కులం గురించి, మతం గురించి, వేరే వాళ్లని బాడీ షేమింగ్ చేయకూడదు. ఒకవేళ చెబితె అవన్నీ కట్ చేసేవాళ్లు. ఇక్కడైతే మన మీద పోలీసింగ్ చేసేవాళ్లు లేరు. కానీ ఆ తర్వాత ఇంపాక్ట్ పడే అవకాశం ఉంది. అందుకే ఆచితూచి మాట్లాడాల్సి వస్తూనే ఉంది. ఇప్పటికీ మాట్లాడేటప్పుడు నేను చాలా కేర్‌ఫుల్‌గా ఉంటానని సుమ కనకాల తెలిపారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా .... వృత్తిపట్ల సుమ అంకితభావంపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

Read more about: suma kanakala movie news
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X