‘మెగా ఫ్యామిలీతో ఆ అదృష్టం నాకే... పవన్ కళ్యాణ్‌ క్రేజ్ అప్పుడే చూశా’

యాంకర్ సుమ కనకాల.. పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. తెలుగునాట యాంకరింగ్‌కు స్టార్ స్టేటస్ తీసుకొచ్చారు సుమ. మలయాళ అమ్మాయి అయినా అద్భుతంగా తెలుగు మాట్లాడుతూ.. తన పంచ్‌లు, ప్రాసలతో ఎలాంటి వాతావరణంలోనైనా జోష్ తీసుకొస్తారు. సినిమాలు, సినిమా ఈవెంట్స్, ఇంటర్వ్యూలు, బుల్లితెరపై షోలతో దాదాపు 25 ఏళ్లుగా స్టార్ యాంకర్‌గా దూసుకెళ్తున్నారు సుమ. ఎంతో మంది యాంకర్లు వచ్చారు, వెళ్లారు కానీ సుమ మాత్రం ఇప్పటికీ కొనసాగుతూ.. ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇటీవల సుమ ఛాట్ షోలో భాగంగా యాంకర్లు వర్ష, గీతా భగత్, స్రవంతి చొక్కారపులతో ఆడిపాడిన సుమ.. తన కెరీర్, యాంకరింగ్‌కు సంబంధించి ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. ఈ వివరాల్లోకి వెళితే..

కేరళలోని పాలక్కాడ్‌లో జన్మించారు సుమ. అయితే తండ్రి రైల్వే శాఖలో ఉద్యోగం చేస్తుండటంతో 6 నెలల పసివయసులోనే సుమ కుటుంబం సికింద్రాబాద్ మెట్టుగూడకు వచ్చి స్థిరపడింది. 1995 నుంచి సీరియల్స్‌, సినిమాలలో నటిస్తూ నాటి నుంచి నేటి వరకు స్టార్ యాంకర్‌గా దూసుకెళ్తున్నారు సుమ. సినీ నటుడు రాజీవ్ కనకాలతో ప్రేమలో పడిన సుమ ఆయనను పెళ్లాడారు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు. కొడుకు రోషన్‌ని హీరోగా నిలబెట్టేందుకు రాజీవ్- సుమ ప్రణాళికలు రచిస్తున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలోని సీనియర్ హీరోల నుంచి కొత్త కుర్రాళ్ల వరకు అందరినీ ఎన్నోసార్లు ఇంటర్వ్యూలు చేశారు. అయితే కొన్ని ఇంటర్వ్యూలు మాత్రం ప్రత్యేకంగా నిలిచిపోతాయని సుమ పలుమార్లు తెలిపారు.

Suma Kanakala Reveals Her Dedication Ran Through Traffic for Live Show Shares Pawan Kalyan Interview Experience

తాజాగా సుమ ఛాట్ షోలో.. పవన్ కళ్యాణ్ గారు ఇంటర్వ్యూలు ఇవ్వడం చాలా తక్కువ.. ఎన్నిసార్లు ఆయనతో చేశారని గీతా భగత్ అడిగింది. తొలి రోజుల్లో రామ్ చరణ్ గారిని ఇంటర్వ్యూ చేసినప్పుడు చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు, రామ్ చరణ్ గారు ముగ్గురిని కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేశాను. పవన్ కళ్యాణ్ గారితో ఇంటర్వ్యూలు చేశాను. చాలా ఏళ్లుగా చేస్తున్నాను కానీ.. పంజా టైంలో పవన్ కళ్యాణ్ క్రేజ్ దగ్గరి నుంచి చూశా. మొత్తం స్టేడియం మొత్తం అరుపు అరిస్తే మైక్ పక్కన పడేసి విందామని అనుకున్నానని సుమ తెలిపింది.

హరిహర వీరమల్లు ఈవెంట్‌ని హోస్ట్ చేయాల్సి ఉంది. నాకు దోహాలో ఉన్నప్పుడు మిస్డ్ కాల్స్ చూసి రిటర్న్ కాల్ చేస్తే రేపు పవర్‌స్టార్ గారు కూడా వస్తున్నారు, రేపు ఖాళీగా ఉన్నారా? అని అడిగారు. ఎన్నాళ్లుగానో వెయిట్ చేస్తున్నా పవన్ ఈవెంట్ కోసం.. కానీ దోహాలో ఉండిపోవడంతో మిస్ అయిపోయానని గీతా భగత్ ఆవేదన వ్యక్తం చేశారు. అదే ఈవెంట్ కోసం నాకు కూడా ఫోన్ వచ్చింది. కానీ నాకు కాలులో ఇబ్బంది ఉంది.. అంతసేపు నిలబడలేను, దాంతో నోటిదాకా వచ్చి వెళ్లిపోతోందని ఫీలయ్యానని మరో యాంకర్ స్రవంతి కూడా బాధపడింది. అయితే మీ అందరికీ ప్రాబ్లమ్స్ వస్తే లాస్ట్‌లో నన్ను పిలిచారా అంటూ సుమ పంచ్‌లు విసిరింది.

మీ గురించి ఒకటి విన్నాను.. అది నాకు చాలా గర్వంగా అనిపిస్తుంది. ఇలాంటివి నేను నేర్చుకోవాలని అనిపిస్తుంది. ఒకరోజు షూటింగ్‌కి వెళ్తున్నప్పుడు మీరు ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయారు. దాంతో మీరు నడుచుకుంటూనే వెళ్లి స్టార్ మహిళ షూటింగ్ చేశారట నిజమేనా? అని యాంకర్ వర్ష అడిగింది. దానికి సుమ స్పందిస్తూ.. నేను ఒక లైవ్ షో చేస్తున్నాను. అప్పట్లో మాటీవీ పంజాగుట్ట దగ్గరుండేది, అప్పుడు ట్రాఫిక్ జామ్ అయ్యింది. లైవ్ స్టార్ట్ అవ్వాలి.. వెళ్లడానికి దారి లేదు, కార్లు మొత్తం ఆగిపోయాయి. వెళ్లే అవకాశం లేకపోవడంతో వెంటనే కారు దిగి పరిగెత్తా... తీరా ఆఫీస్‌కి వెళ్లేసరికి లిఫ్ట్ ఆగిపోయింది. దాంతో నాలుగో ఫ్లోర్‌కి పరిగెత్తుకుంటూ పైకి వెళ్లా. అప్పట్లో మేకప్‌మెన్‌లు లేరు.. నేనే ఫాస్ట్‌గా రెడీ అయిపోయి వెళ్లి నిల్చొన్నా అని సుమ నాటి సంగతిని గుర్తుచేసుకున్నారు. అందుకే డైరెక్టర్‌లలో రాజమౌళీగారు ఎలాగో.. ఫ్రూట్స్ అన్నింటిలో మ్యాంగో ఎలాగో... మా యాంకర్లు అందరికీ సుమక్క అలా అని స్రవంతి ప్రశంసలు కురిపించింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. సుమ డెడికేషన్, వృత్తిపట్ల అంకితభావంపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

Read more about: suma kanakala pawan kalyan
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X