For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Suma kanakala: ఆ వ్యాధితో బాధపడుతున్నా..ఏళ్ల నుంచి దాచా కానీ ఇక దాచాలనుకోవడం లేదు.. అసలేమైందంటే?

  |

  తెలుగు టెలివిజన్ ఫీల్డ్ లో దాదాపు రెండు దశాబ్దాలుగా తన హవా చూపిస్తూ నెంబర్ వన్ యాంకర్‌గా వెలుగొందుతోంది యాంకర్ సుమ. అద్భుతమైన టైమింగ్‌తో మలయాళీ అయినా ఆమె తెలుగులో వరుస షోలతో దూసుకుపోతోంది. అయితే సుమ తన చర్మ సమస్యల గురించి కీలక విషయాలు వెల్లడించింది. ఆ వివరాల్లోకి వెల్తే

  టాప్ రేంజ్ లో

  టాప్ రేంజ్ లో


  మొదట్లో అంతా సంప్రదాయంగానే ఉండేది కానీ కొంత కాలంగా బుల్లితెరపై గ్లామరస్ బ్యూటీలు యాంకర్లుగా రాణిస్తున్నారు. అయినప్పటికీ వాళ్లెవరూ సుమ రేంజ్ ను టచ్ చేయలేకపోతున్నారు. దీనికి కారణం వాళ్లందరి కంటే సుమకు ఉన్న టైమింగ్ అలాగే క్రేజ్ అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అద్భుతమైన వాక్చాతుర్యంతో కట్టి పడేసే సుమ.. పాటలు, డ్యాన్స్, డైలాగ్స్ ఇలా అన్నింట్లోనూ రాణిస్తూ నెంబర్ వన్ యాంకర్‌గా హవాను చూపిస్తూ ఉంది.

  టీవీనే కాదు ఫంక్షన్స్ లో కూడా

  టీవీనే కాదు ఫంక్షన్స్ లో కూడా

  చాలా కాలంగా బుల్లితెరపై తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు దక్కించుకుని దూసుకుపోతోంది సుమ. టీవీ కార్యక్రమాలు మాత్రమే కాదు.. సినిమా ఫంక్షన్లు, ప్రీ రిలీజ్ లాంటి స్పెషల్ ఈవెంట్లను ఆమెనే హోస్ట్ చేస్తుంది. సుమకు తెలుగు ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్‌ వల్లే ఇది సాధ్యమవుతోంది. ఇవి మాత్రమే కాదు... వ్యాపార ప్రకటనలు చేస్తూ మరో పక్క యూట్యూబ్ వీడియోలతో సత్తా చాటుతోంది. ఇక తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ లో తన చర్మ సమస్యలు గురించి బయట పెట్టింది సుమ.

  దాచాలనుకోవడం లేదు

  దాచాలనుకోవడం లేదు

  ఓ యూట్యూబ్‌ ఛానెల్‌తో ముచ్చటించిన సుమ చాలా కాలంగా దాచిన విషయాన్ని ఇప్పుడు బయట పెట్టింది. చాలా ఏళ్ల నుంచి తాను స్కిన్‌కి సంబంధించిన సమస్యతో బాధపడుతున్నానని ఆమె చెప్పుకొచ్చారు. చాలా ఏళ్ల నుంచి ఒక విషయం దాచి పెట్టే ప్రయత్నం చేస్తూ వచ్చా, కానీ ఇక దాచాలని అనుకోవడం లేదని చెప్పింది.

  శరీరంలో భాగమైంది

  శరీరంలో భాగమైంది

  సుమ తాను కీలాయిడ్‌ టెండెన్సీ అనే స్కిన్ ప్రాబ్లమ్‌తో బాధపడుతున్నట్టు ఆమె తెలిపారు. ఆ సమస్య కారణంగా ఏదైనా గాయం అయితే అది మరింత పెద్దదిగా మారుతుందని, చిన్న గాయం కూడా పెద్దదవుతుందని, త్వరగా తగ్గిపోదని చెప్పుకొచ్చింది. ఈ సమస్యను నయం చేసుకునేందుకు చాలా రకాల ప్రయత్నాలు చేసినట్లు చెప్పిన సుమ అయినా తగ్గలేదని, అదే ఇప్పుడు తన శరీరంలో భాగమైందని చెప్పింది.

  కీలాయిడ్‌ టెండెన్సీ అంటే ఏంటి?

  కీలాయిడ్‌ టెండెన్సీ అంటే ఏంటి?


  కీలాయిడ్‌ టెండెన్సీ కొందరిలో వంశపారంపర్యంగా వస్తుంది. ఇలాంటివారికి తగిలిన దెబ్బ కంటే ఆ దెబ్బ ఉబ్బెత్తు పెరిగి, మచ్చ పడుతుంది. రంగు తక్కువ ఉన్నవారిలో ఇది మరింత ఎక్కువగా కనిపిస్తుంది. అయితే దీన్ని శస్త్రచికిత్స చేసి తొలగించాల్సి ఉంది. ఆ మచ్చ సమాంతరంగా పరచుకునేందుకు సిలికాన్‌ షీట్స్‌, ప్రెజర్‌ గార్మెంట్స్‌ వంటివి వాడతారు కూడా.

  దాచి పెడుతూ వస్తాము కానీ

  దాచి పెడుతూ వస్తాము కానీ

  కెరీర్‌ బిగినింగ్‌లో అసలు మేకప్‌ ఎలా వేసుకోవాలి, ఎలా తీసేయాలి వంటివి తెలియక ఈ డ్యామేజ్‌ జరిగిపోయిందన్న సుమ ఇప్పుడు ఉన్నదాన్ని కాపాడుకుంటూ వస్తున్నానని చెప్పుకొచ్చారు. ఇక సాధారణంగా మన బాడీలో ఏదైనా మనకు నచ్చకపోతే ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో అని దాచి పెడుతూ వస్తాము కానీ అది మన శరీరంలో ఉంటుందని తెలిసినప్పుడు దానిని అంగీకరించాలని వెల్లడించింది.

  English summary
  Suma kanakala reveals that she is suffering from a keloid tendency.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X