మలయాళ ఇండస్ట్రీకి అందుకే వెళ్లలేదు.. సుమ కనకాల షాకింగ్ కామెంట్స్

సుమ కనకాల.. పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. తన పంచ్‌లు, ప్రాసలు, యాంకరింగ్ స్కిల్స్‌తో తెలుగు నాట స్టార్ యాంకర్‌గా దూసుకెళ్తున్నారు సుమ. దాదాపు 36 ఏళ్లుగా తెలుగువారి జీవితంలో భాగమైపోయారు. దూరదర్శన్‌తో కెరీర్ ప్రారంభించిన సుమ... తెలుగులో తొలితరం యాంకర్లలో ఒకరు. ఆవిడతో పాటు కెరీర్ ప్రారంభించిన వారు ఇప్పటికే ఫేడ్ అవుట్ అయిపోగా.. సుమ మాత్రం నేటికీ నెంబర్ వన్ యాంకర్‌గా వెలుగొందుతున్నారు. కాలానికి తగినట్లుగా మారడం, ఆకట్టుకునే విధంగా మాట్లాడటం, ఎలాంటి వాతావరణంలోనైనా ఇమిడిపోవడం సుమ బలాలు. అయితే ఇన్నేళ్లుగా తెలుగునాట టాప్ యాంకర్‌గా దూసుకెళ్తున్న సుమ.. తన మాతృభాషపై చూడలేదు అనే కామెంట్స్ వినిపిస్తుంటాయి. వీటికి ఓ ఓ షోలో సుమ ఆన్సర్ ఇచ్చారు.

టీవీ షోలు, సినిమా ఈవెంట్స్, ఇంటర్వ్యూలు, ప్రైవేట్ కార్యక్రమాలు ఇలా ఏదైనా సరే అలవోకగా చేసుకుంటూ వెళ్తారు. ఇండస్ట్రీకి ఎందరో యాంకర్లు వచ్చారు.. వెళ్లారు. కానీ సుమ మాత్రం స్పెషల్. తాను ఈ స్థాయికి రావడం వెనుక ఎంత కష్టపడింది పలు ఇంటర్వ్యూలలో చెబుతుంటారు సుమ. కెరీర్ తొలినాళ్లలో ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర కారు ఆగిపోతే.. సమయానికి లైవ్ షోని అందుకోవడానికి నడిరోడ్డు మీద పరుగులు తీసిన సందర్భాలను ఇటీవల పంచుకున్నారు ఈ స్టార్ యాంకర్.

Suma Kanakala Reveals Why She Choose Telugu Over Malayalam Hosting Career

నటుడు రాజీవ్ కనకాలను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు సుమ. ఈ దంపతులకు ఒక కుమారుడు, కుమార్తె సంతానం. కొడుకు రోషన్‌ను హీరోగా నిలబెట్టేందుకు సుమ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. బుల్లితెర, వెండితెరపై క్షణం తీరిక లేని బిజీగా ఉంటున్నప్పటికీ కుటుంబానికి, స్నేహితులకు సమయాన్ని కేటాయించడం.. తన ఆరోగ్యాన్ని, ఫిట్‌నెస్‌ను మెయింటైన్ చేయడం కోసం కష్టపడుతుంటారు. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే సుమ కనకాల తన షూటింగ్స్, షోలు, ఇతర వివరాలతో పాటు వ్యక్తిగత విషయాలను కూడా పంచుకుంటూ ఉంటారు. ఇక సామాజిక అంశాలపైనా సుమ స్పందిస్తూ తన అభిప్రాయాలను తెలియజేస్తూ ఉంటారు.

సుమలోని ప్రత్యేక లక్షణం తెలుగును అనర్గళంగా మాట్లాడటం. మలయాళ కుటంబంలో పుట్టినప్పటికీ తెలుగు వారి కంటే అందంగా, ఎలాంటి తప్పులు లేకుండా మాట్లాడటం సుమకే చెల్లింది. ఎన్నో వేదికల మీద సుమను తెలుగు భాషాభిమానులు మెచ్చుకున్నారు. మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు కూడా సుమ తెలుగు భాష మాట్లాడే విధానం, ఆమె కట్టుబొట్టును మెచ్చుకున్నారు. అయితే మలయాళీ అయినప్పటికీ తన మాతృభాషలో సినిమాలు, సీరియల్స్, యాంకరింగ్ వైపు ఎందుకు వెళ్లలేదని నెటిజన్లు ప్రశ్నిస్తుంటారు. తాజాగా తన ఛాట్ షోలోనూ ఆమెకు ఇదే ప్రశ్న ఎదురైంది.

నీ మాతృభాష మలయాళం.. నువ్వు మలయాళంలో ఫ్లూయెంట్. తెలుగులోకి వచ్చి తెలుగు నేర్చుకున్నావు, తెలుగులో చాలా గొప్పస్థాయికి వచ్చావు. కానీ మలయాళంలో హోస్టింగ్ చేయాలని ఎప్పుడు అనిపించలేదా? అని యాంకర్ ప్రశ్నించింది. దీనికి సుమ కనకాల స్పందిస్తూ.. మలయాళంలో చేయాలేదంటే చిన్నప్పటి నుంచి నేను తెలుగులోనే స్టార్ట్ చేయడం వల్ల తెలుగులో ఉండే సామెతలు, పద్యాలు, ఇక్కడి వాతావరణం, తినే ఫుడ్, ఇన్‌సైడ్ జోక్స్, మీమ్స్ ఇలా అన్నీ మాట్లాడతాను. అక్కడికి వెళితే నేను మలయాళం మాత్రమే మాట్లాడతాను. అదంతా రావాలంటే నేను అక్కడే ఆరు నెలలు ఉండి.. వాళ్లలో కలిసిపోయినప్పుడే సాధ్యమన్నారు.

హ్యూమర్ అలాగే ఉంటుంది.. కానీ ఇంకా డెప్త్‌గా యాంకరింగ్ చేయాలంటే హోమ్ వర్క్ చేయాలి. భయంతో పాటు తెలుగులో హాయిగా ఉంది కదా. మలయాళంలో యాక్టర్స్ అంతా నాకు తెలుసు అనుకుంటారు.. కానీ నాకు ఎవ్వరూ తెలియదు. నేను ఎలాంటి దానినంటే తామరాకు మీద నీటి బొట్టు లాంటి దానిని అంతే తెలుసు అంటూ ఫన్నీగా ఆన్సర్ ఇచ్చారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. తెలుగు భాషపై సుమ తన అభిమానాన్ని బయటపెట్టారంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.

Read more about: suma kanakala movie news
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X