Suma Kanakala: సుమకి 1000 ఎకరాల ఆస్తి... స్టార్ యాంకర్ రియాక్షన్ ఏమిటంటే?

సుమ కనకాల.. పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. దాదాపు మూడు దశాబ్ధాలుగా తెలుగువారిని తన ప్రాసలు, పంచ్‌లతో అలరిస్తూ స్టార్ యాంకర్‌గా దూసుకెళ్తున్నారు. టీవీ షోలు, సినిమా ఈవెంట్స్, ఇంటర్వ్యూలు, ప్రైవేట్ కార్యక్రమాలు ఇలా క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు సుమ. ఇండస్ట్రీలో అడుగుపెట్టి మూడు దశాబ్ధాలకు పైగా గడుస్తున్నా.. ఎంతోమంది యాంకర్లు వచ్చినా సుమ స్థానాన్ని అందుకునేవారు లేరంటే అతిశయోక్తి కాదు. అసలు సుమ లేని ఈవెంట్ అంటూ ఉండదు.. సీనియర్ హీరోల నుంచి జూనియర్ హీరోల వరకు హోస్ట్‌గా ఆమె కావాల్సిందే.

సుమ ఉంటే ఆ ఫంక్షన్‌కి ఓ స్టార్ డమ్, వైబ్ వస్తుందని అంతా అంటూ ఉంటారు. ఎలాంటి వాతావరణాన్ని అయినా ఆహ్లాదకరంగా మార్చేయడం ఆమె శైలి. సినిమా ఈవెంట్సే కాదు.. ప్రభుత్వ ఈవెంట్స్‌కి కూడా యాంకర్‌గా సుమ కనకాలే కావాలి అనే రేంజ్‌కు ఆమె చేరుకున్నారు. క్షణం తీరిక లేకుండా గడిపే సుమ కనకాల ఆదాయం, ఆస్తులపై గతంలో ఎన్నోసార్లు రూమర్స్ వచ్చాయి. తాజాగా ఓ స్టార్ డైరెక్టర్ కూడా సుమ ఆస్తులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ వివరాల్లోకి వెళితే..

Suma Kanakala s Funny Reply to Nandini Reddy s 1000 Acres Property Punch Goes Viral

చాలా కాలం తర్వాత సమంత మా ఇంటి బంగారం సినిమాతో టాలీవుడ్‌లో కమ్ బ్యాక్ ఇస్తున్నారు. వరల్డ్ వైడ్‌గా ఈ మూవీ జూన్ 19న విడుదల కానుంది. బీవీ నందినీ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాను ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై రాజ్ నిడిమోరు, సమంత, హిమాండ్ దువ్వూరులు కలిసి నిర్మించారు. శ్రీముఖి, గుల్షన్ దేవయ్య, దిగంత్ మంచాలే, గౌతమి తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. సంతోష్ నారాయణన్ సంగీత దర్శకత్వం వహించగా.. ధర్మేంద్ర కాకర్ల ఎడిటర్‌గా వ్యవహరించారు.

ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా స్టార్ యాంకర్ సుమ కనకాల నిర్వహించిన సుమ ఛాట్ షాలో మా ఇంటి బంగారం టీమ్ పాల్గొంది. సమంత, రాజ్ నిడిమోరులు సందడి చేశారు. ఈ సందర్భంగా సమంతతో రాజ్ కోసం పూరీ, కుర్మాను దగ్గరుండి చేయించింది సుమ. దానిని టేస్ట్ చేసిన రాజ్ బాగానే చేసుకుందని తన భార్యను మెచ్చుకున్నారు. అలాగే గెస్ట్‌ల కోసం అద్భుతమైన వంటకాలను చేయించారు సుమ. రాగి సంకటి, నాటుకోడి పులుసు, సాంబారు, దొండకాయ కూర వంటివి నోరూరించాయి. ఇక చాలా రోజుల తర్వాత కేరళ సాంబారు రుచి చూడటంతో సమంత మురిసిపోయారు. అమ్మ మలయాళీ, వాళ్లది అలెప్పీ అని సమంత చెప్పారు. అమ్మ చిన్నప్పుడే చెన్నైకి వలస వచ్చేశారని తెలిపారు.

కార్యక్రమం చివరిలో మా ఇంటికి వచ్చినందుకు మీ అందరికీ కొన్ని గిఫ్ట్‌లు ఇచ్చి పంపిస్తానని సుమ చెప్పింది. దానితో పాటు నాకు బెల్లం అవకాయ బాటిల్ మాత్రం ఇవ్వండి అని నందినీ రెడ్డి అడిగారు. ఇలా వచ్చిన వాళ్లందరికీ పంచేస్తున్నాను అని మా వంటావిడ దాచేసిందని సుమ ఆన్సర్ ఇచ్చింది. ఎందుకు మళ్లీ చేసుకోవచ్చు కదా అని నందినీ రెడ్డి పంచ్ విసిరింది. ముక్కలు దొరకవండి అంటూ సుమ సెటైర్లు వేసింది. ముక్కలు దొరుకుతాయి కానీ మనుషులు దొరుకుతారా మళ్లీ అని నందినీ రెడ్డి అనడంతో నీకు ఖచ్చితంగా గిఫ్ట్‌లు ఇస్తానని చెప్పింది సుమ. ఓ కప్పు సరిపోతుందా అని సుమ పంచ్ వేయగా.. 1000 ఎకరాల ఆస్తి పెట్టుకుని ఒక కప్పు ఆవకాయ ఇస్తారా అని నందినీ రెడ్డి కౌంటర్ వేసింది. నాకు 1000 ఎకరాల ఆస్తి ఉంది.. కాబట్టి నాకొక 5 కోట్ల లోన్ ఉంది మీరు తీర్చేస్తారా అని సుమ రివర్స్‌లో తగులుకోవడంతో అంతా నవ్వేశారు. అనంతరం అందరికీ గిఫ్ట్‌లు అందజేశారు సుమ. తొలిసారిగా భార్యాభర్తలు మా ఇంటికి వచ్చారని సమంత, రాజ్‌లకు బట్టలు పెట్టారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుండగా.. సుమ అస్సలు దొరకదంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X