For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  సుధీర్, అభిజీత్‌తో యాంకర్ సుమ పోటీ: అరుదైన ఘనత సొంతం.. తెలుగులో ఏకైక మహిళగా రికార్డు

  |

  దాదాపు రెండు దశాబ్దాలుగా తెలుగు బుల్లితెరపై తనదైన ముద్రను వేస్తూ టాప్ యాంకర్‌గా వెలుగొందుతోంది సుమ కనకాల. గ్లామరస్ యాంకర్ల నుంచి ఎంతో పోటీ నెలకొని ఉన్నప్పటికీ.. అద్భుతమైన యాంకరింగ్‌తో పాటు ఎవరికీ సాధ్యం కాని రీతిలో పంచులు పేలుస్తూ తన హవాను చూపిస్తోంది. ఈ క్రమంలోనే వరుస ఆఫర్లు అందుకుంటూ దూసుకుపోతోందీ సీనియర్ యాంకర్. దీంతో ఎక్కడ చూసినా ఆమెనే కనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో యాంకర్ సుమ అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. ఈ జాబితాలో ఉన్న ఏకైక మహిళగా నిలిచింది. ఆ వివరాలు మీకోసం!

  సినిమా అవకాశాలను వదలుకుని మరీ

  సినిమా అవకాశాలను వదలుకుని మరీ


  ప్రస్తుతం తెలుగులో ఉన్న యాంకర్లలో టాప్ ప్లేస్‌లో కొనసాగుతోంది సుమ కనకాల. చాలా ఏళ్లుగా బుల్లితెరపై సత్తా చాటుతోన్న ఆమె.. సినిమా అవకాశాలను వదులుకుని మరీ షోలు చేస్తోంది. ఈ క్రమంలోనే వరుస షోలతో దూకుడు ప్రదర్శిస్తోంది. సుమ షో అంటే వందకు వంద శాతం ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటుంది అనేలా ఆమె పేరొందింది. అందుకే ప్రతి షోకూ మంచి రెస్పాన్స్ వస్తోంది.

  ప్రతి చోటా ఆమెనే.. వాళ్లకు మిగలకుండా

  ప్రతి చోటా ఆమెనే.. వాళ్లకు మిగలకుండా

  అప్పటి తరం యాంకర్లలో సుమ మాత్రమే ఇంకా హోస్టింగ్ చేస్తోంది. ఆ తర్వాత వచ్చిన రష్మీ గౌతమ్, అనసూయ, శ్యామల, లాస్య, శ్రీముఖి వంటి వాళ్లు తమ మార్క్ చూపించే ప్రయత్నం చేస్తున్నారు. అయినప్పటికీ సుమ ముందు రాణించలేకపోతున్నారు. అందుకే ప్రతి సినిమా ఫంక్షన్‌లోనూ ఆమె కనిపిస్తుంది. అలాగే, వాళ్ల కంటే ఎక్కువ షోలు హోస్ట్ చేస్తోంది.

  సుమ షోలలో ఇదే చాలా ప్రత్యేకం అనేలా

  సుమ షోలలో ఇదే చాలా ప్రత్యేకం అనేలా

  ఇప్పటి వరకు సుమ ఎన్నో షోలు హోస్ట్ చేసింది. అవన్నీ సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. ప్రస్తుతం ఆమె చేస్తున్న షోలలో ‘క్యాష్' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ప్రతి శనివారం రాత్రి ప్రసారం అయ్యే ఈ షోకు సినీ, టెలివిజన్ రంగాలకు చెందిన ప్రముఖులు వస్తుంటారు. వాళ్లతో సుమ చేసే కామెడీ అదిరిపోతోంది. అందుకే దీనికి రికార్డు స్థాయిలో వ్యూస్ వస్తుంటాయి.

  అరుదైన ఘనత సొంతం చేసుకున్న సుమ

  అరుదైన ఘనత సొంతం చేసుకున్న సుమ

  వరుసగా టీవీ షోలు.. సినిమా ఫంక్షన్లతో ఫుల్ జోష్‌లో ఉంది సుమ. ఇలాంటి సమయంలో దేశ వ్యాప్తంగా బుల్లితెరపై ఉత్తమ నటీనటులు, ఉత్తమ ఎంటర్‌టైనర్లను ఎంపిక చేసే ఆర్మాక్స్ మీడియా తాజాగా 2020 సంవత్సరానికి సంబంధించిన జాబితాను విడుదల చేసింది. ఇందులో ఉత్తమ ఎంటర్‌టైనర్‌ విభాగంలో తెలుగు నుంచి యాంకర్ సుమ (క్యాష్ షో) కూడా ఎంపికైంది.

  సుధీర్, అభిజీత్‌తో యాంకర్ సుమ పోటీ

  సుధీర్, అభిజీత్‌తో యాంకర్ సుమ పోటీ


  ఈ జాబితాలో సుదీర్ఘ కాలంగా తనదైన శైలి కామెడీతో మైమరిపిస్తోన్న సుడిగాలి సుధీర్ (ఢీ షో) తెలుగు నుంచి మొదటి స్థానాన్ని దక్కించుకున్నాడు. అతడి తర్వాత ఇటీవల ప్రసారం అయిన బిగ్ బాస్ నాలుగో సీజన్‌లో విజేతగా నిలిచిన అభిజీత్ ఉన్నాడు. మూడో స్థానంలో జబర్ధస్త్ కమెడియన్ హైపర్ ఆది.. నాలుగో స్థానంలో సుమ కనకాల, ఐదులో అఖిల్ సార్థక్ చోటు దక్కించుకున్నారు.

  Metro Kathalu Movie Actor Thiruveer Special Interview || అలా చేస్తే తప్పు కానీ నటించడం తప్పు కాదు!
  తెలుగులో ఏకైక మహిళగా రికార్డు క్రియేట్

  తెలుగులో ఏకైక మహిళగా రికార్డు క్రియేట్

  2020 సంవత్సరానికి సంబంధించిన ఉత్తమ కల్పిత పాత్రల విభాగంలో తెలుగు నుంచి ప్రేమీ విశ్వనాథ్ (కార్తీక దీపం వంటలక్క) ఎంపికైంది. అలాగే, ఎంటర్‌టైనర్ల విభాగంలో టాప్ -5లో నలుగురు అబ్బాయిలు ఉండగా.. సుమ ఒక్కరే ఈ జాబితాలో స్థానం దక్కించుకుంది. తద్వారా తెలుగు రాష్ట్రాల నుంచి బెస్ట్ ఎంటర్‌టైనర్ విభాగంలో స్థానం దక్కించుకున్న తొలి మహిళగా రికార్డులకెక్కింది.

  English summary
  Small screen Big anchor Suma kanakala rejects an Offer. Star Maa offered to Suma. But she is Not interested. This News goes viral in Social Media. Suma Fans Upset and Unhappy For Her decision. This is Hot Topic in Telugu TV.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X