For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  మినీ ష్కర్ట్‌తో అనసూయ రచ్చ: మరీ ఎక్కువగా వంగకంటూ పరువు తీసిన సుమ

  |

  తెలుగు బుల్లితెరపై చెరిగిపోని ఎన్నో ఘనతలను అందుకుంటూ తిరుగులేని యాంకర్‌గా వెలుగొందుతోంది సీనియర్ హోస్ట్ సుమ కనకాల. దాదాపు పదేళ్లుగా యాంకరింగ్ రంగంలో హవాను చూపిస్తూ దూసుకుపోతోన్న ఆమె.. అప్పటి నుంచి నెంబర్ వన్‌గానే వెలుగొందుతోంది. అదే సమయంలో వరుస ఆఫర్లను అందుకుంటూ సత్తా చాటుతోంది. ఇక, తన పంచులతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే సుమ.. తాజాగా మరో యాంకర్ అనసూయ భరద్వాజ్‌ డ్రెస్‌పై షాకింగ్ కామెంట్స్ చేస్తూ పరువు తీసేసింది. అసలేం జరిగింది? ఆ పూర్తి వివరాలు మీ అందరి కోసం!

  సుదీర్ఘ ప్రయాణం.. ఆమెకు ప్లస్ అదే

  సుదీర్ఘ ప్రయాణం.. ఆమెకు ప్లస్ అదే

  అందమైన ఎంతో మంది అమ్మాయిలు యాంకర్లుగా ఎంట్రీ ఇస్తున్నా.. సుమ మాత్రం ఎప్పటి నుంచో నెంబర్ వన్‌గానే ఉంటోంది. దీనికి ఆమెకున్న అద్భుతమైన టాలెంటే ప్రధాన కారణం అని చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా వాక్చాతుర్యంతో పాటు అదిరిపోయే టైమింగ్‌తో సుమ సందడి చేస్తోంది. అలాగే, పాటలు, డ్యాన్స్, డైలాగ్స్ ఇలా అన్నింట్లోనూ రాణిస్తూ సత్తాను చాటుకుంటోంది.

  ఎందులో చూసినా సుమే కనిపిస్తోంది

  ఎందులో చూసినా సుమే కనిపిస్తోంది

  యాంకర్‌గా వరుస షోలతో దూసుకుపోతోన్న సుమ కనకాల.. తెలుగులో ఎవరికీ సాధ్యం కాని రితిలో దూసుకెళ్తోంది. అదే సమయంలో సినిమా ఫంక్షన్లు, స్పెషల్ ఈవెంట్లను ఆమెనే హోస్ట్ చేస్తోంది. సుమకు తెలుగు ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్‌ వల్లే ఇది సాధ్యమవుతోంది. ఇవి మాత్రమే కాదు... వ్యాపార ప్రకటనలో పాటు యూట్యూబ్ వీడియోలతో సత్తా చాటుతూ హవాను చూపిస్తోందామె.

  సుమ షోలలో అది చాలా స్పెషల్‌గానే

  సుమ షోలలో అది చాలా స్పెషల్‌గానే

  సుమ ప్రస్తుతం హోస్ట్ చేస్తున్న షోలలో ‘క్యాష్' ఒకటి. ఇందులో సినీ, టెలివిజన్ ప్రముఖులు గెస్టులుగా వస్తారు. ఇందులో ఈ యాంకరమ్మ చేసే సందడి అంతా ఇంతా కాదనే చెప్పాలి. అందుకే ఈ షోకు సంబంధించిన ప్రోమోలు, ఎపిసోడ్ వీడియోలకు భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తుంటుంది. ఒక్కో వారంలో అయితే ఇవి యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతున్నాయి. రేటింగ్ కూడా అందుకుంటోంది.

  నలుగురు సెలెబ్రిటీలతో సుమ సందడి

  నలుగురు సెలెబ్రిటీలతో సుమ సందడి

  వచ్చే వారం ప్రసారం కానున్న ‘క్యాష్' ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది. ఇందులో ఇంద్రజ, ప్రియదర్శి, అనసూయ, అభినవ్‌లు గెస్టులుగా వచ్చారు. వీళ్లతో సుమ చేసిన సందడి అంతా ఇంతా కాదు. వాళ్లు కూడా ఆమెకు ధీటైన ఆన్సర్లు చెబుతూ పంచులు వేశారు. దీంతో ఈ ప్రోమో విపరీతంగా వైరల్ అవుతోంది. అదే సమయంలో యూట్యూబ్‌లో ట్రెండ్ అయింది.

  మినీ ష్కర్ట్‌ వేసుకుని అనసూయ రచ్చ

  మినీ ష్కర్ట్‌ వేసుకుని అనసూయ రచ్చ

  ఈ ఎపిసోడ్‌కు మొత్తం నలుగురు గెస్టులుగా విచ్చేయగా.. అందులో యాంకర్ అనసూయ భరద్వాజ్ మాత్రం ఎంతో హైలైట్ అయింది. దీనికి కారణం ఆమె తొడలు కనిపించేలా మినీ ష్కర్ట్ వేసుకుని రావడమే. ఫ్యాషన్ షోకు వచ్చినట్లు ఇందులో ఆమె కనిపించిన తీరుకు ప్రేక్షకులు షాక్ అవుతున్నారు. అదే సమయంలో ఈ వీడియో కింద ఆమెను విమర్శిస్తూ తెగ కామెంట్లు పెడుతున్నారు.

  అందరి ముందే అనసూయ అలా చేసి

  అందరి ముందే అనసూయ అలా చేసి

  ఈ ఎపిసోడ్‌లో భాగంగా యాంకర్ సుమ అందరిపై సెటైర్లు వేసి రచ్చ రచ్చ చేసింది. అయితే, ఇంద్రజ మాత్రం ఏకంగా ఆమెపైనే అదిరిపోయే పంచ్ వేసింది. ఇక, అనసూయ మాత్రం యాంకరింగ్‌లో క్లాసులు చెప్పమంటూ సుమను అడగగా.. ఇప్పుడదే చేస్తున్నా అంటూ షాకిచ్చింది. ఈ క్రమంలోనే ఓ సందర్భంలో అనసూయ.. అందరి ముందే సుమ కాళ్లపై పడే ప్రయత్నం కూడా చేసింది.

  ఎక్కువగా వంగకంటూ పరువు తీసింది

  ఎక్కువగా వంగకంటూ పరువు తీసింది

  ఓ సందర్భంలో ‘అయ్యే ఎంత మర్యాదండీ మీకు.. ఇక్కడ ఎవరికీ లేదు' అని అంటుంది. అప్పుడు అనసూయ వచ్చి ‘ఏంటక్కా నాకు రెస్పెక్ట్ లేదా? ఏం మాట్లాడుతున్నారు' అంటూ ఆమె కాళ్లకు దండం పెట్టబోయింది. అప్పుడు సుమ ‘ఎక్కువగా వంగకు' అంటూ నీ డ్రెస్ మొత్తం పైకి లేచిపోతుంది అన్నట్లుగా సైగలు చేస్తూ ఆమె పరువు తీసేసింది. దీంతో అనసూయ నోరెళ్లబెట్టింది.

  English summary
  Indraja, Priyadarshi, Anasuya Bharadwaj and Abhinav Gomatam participants in Anchor Suma Cash Show Upcoming Episode. In This Show Suma hocking Comments on Anasuya Bharadwaj Dress.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X