న్యూడ్ ఫొటోపై సుమ సంచలన వ్యాఖ్యలు: ఆ స్థానంలో తను ఉంటే ఎలాగుండేదో అంటూ షాకింగ్‌గా!
తెలుగు బుల్లితెరపై దాదాపు రెండు దశాబ్దాలుగా తన హవాను చూపిస్తూ నెంబర్ వన్ యాంకర్‌గా వెలుగొందుతోంది యాంకర్ సుమ కనకాల. అద్భుతమైన టైమింగ్‌తో పాటు వాక్చతుర్యం ఉన్న ఈమె.. వరుస షోలతో దూసుకుపోతోంది. గ్లామర్ ప్రపంచంలో సంప్రదాయంగా కనిపిస్తున్న అందరికీ ఫస్ట్ ఛాయిస్ అవుతోంది. అందుకే చేతి నిండా ఆఫర్లతో ఫుల్ బిజీగా గడుపుతోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా క్యాష్ షోలో సుమ న్యూడ్ ఫొటోపై సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆ స్థానంలో తను ఉంటే బాగుండేది అంటూ షాకింగ్‌గా మాట్లాడింది. ఆ సంగతులేంటో చూద్దాం పదండి!

ఎన్నో విద్యలతో సత్తా.. టాప్ యాంకర్‌గా
కొంత కాలంగా బుల్లితెరపై గ్లామరస్ బ్యూటీలే యాంకర్లుగా ఎంట్రీ ఇస్తున్నారు. అయినప్పటికీ వాళ్లెవరూ సుమను టచ్ చేయలేకపోతున్నారు. దీనికి కారణం వాళ్లందరి కంటే సుమకు ఉన్న టైమింగే అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అద్భుతమైన హోస్టింగ్‌తో కట్టి పడేసే సుమ.. పాటలు, డ్యాన్స్, డైలాగ్స్ ఇలా అన్నింట్లోనూ రాణిస్తూ నెంబర్ వన్ యాంకర్‌గా హవాను చూపిస్తూ ఉంది.

ఎక్కడైనా.. ఎందులోనైనా యాంకర్ ఆమె
చాలా కాలంగా బుల్లితెరపై తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును దక్కించుకుని దూసుకుపోతోంది సుమ. టీవీ కార్యక్రమాలు మాత్రమే కాదు.. సినిమా ఫంక్షన్లు, స్పెషల్ ఈవెంట్లను ఆమెనే హోస్ట్ చేస్తోంది. సుమకు తెలుగు ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ వల్లే ఇది సాధ్యమవుతోంది. ఇవి మాత్రమే కాదు... వ్యాపార ప్రకటనలో పాటు యూట్యూబ్ వీడియోలతో సత్తా చాటుతూ రచ్చ చేస్తోందీ భామ.
Recommended Video

సుమ షోలలో దానికి ఏ రేంజ్‌లో రెస్పాన్స్
సుదీర్ఘమైన కెరీర్‌లో సుమ ఎన్నో షోలను హోస్ట్ చేసింది. అందులో ఎక్కువ రెస్పాన్స్‌ను అందుకున్న కార్యక్రమాల్లో 'క్యాష్' ఒకటి. ఇందులో సినీ, టెలివిజన్ ప్రముఖులు గెస్టులుగా వస్తారు. ఇందులో ఈ యాంకరమ్మ చేసే సందడి అంతా ఇంతా కాదనే చెప్పాలి. అందుకే ఈ షోకు సంబంధించిన ప్రోమోలు, ఎపిసోడ్ వీడియోలకు భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తుందన్న విషయం తెలిసిందే.

నాలుగు జంటలతో రచ్చ చేసిన యాంకర్
వచ్చే వారం ప్రసారం కానున్న 'క్యాష్' ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది. ఇందులో శిరీష - సన్నీ, వాసుదేవ్ - కరుణ, పవన్ - అంజలి, విశ్వ - ప్రశాంతి జంటలుగా వచ్చారు. వీళ్లతో సుమ చేసిన సందడి అంతా ఇంతా కాదు. వాళ్లంతా కూడా ఈ టాప్ యాంకరమ్మకు ధీటైన ఆన్సర్లు చెబుతూ పంచులు వేశారు. దీంతో ఈ ప్రోమో వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది.
సుమ షోలో ఆ న్యూడ్ ఫొటోపై కామెంట్లు
ఈ షోలో భాగంగా సన్నీ మాట్లాడుతూ.. 'స్వామిరారా సినిమా చూసిన తర్వాత వెస్మా తీసుకున్నాను' అన్నాడు. దీనికి సుమ 'మరి టైటానిక్ చూసిన తర్వాత ఏం తీసుకున్నావ్' అని అడిగింది. ఆ వెంటనే వాసుదేవ్ మాట్లాడుతూ.. 'టైటినిక్ తర్వాత ఆ ఫోజ్ ఉంటుంది కదా.. అది ట్యాంక్‌బండ్ మీద ట్రై చేశారు. పోలీసులు అరెస్ట్ చేశారు' అని చెప్పాడు. అప్పుడు న్యూస్ ఫొటో ప్రస్తావన వచ్చింది.

ఆ స్థానంలో తను ఉంటే ఎలాగుండేదోనని
వాసుదేవ్ అన్న మాటలకు సన్నీ మాట్లాడుతూ.. 'మీరు మాట్లాడేది ఏ ఫోజు? బొమ్మ గీశాడు అది కాదు కదా' అని అడుగుతాడు. దీంతో అందరూ విపరీతంగా నవ్వేస్తారు. అప్పుడు సుమ 'కాదు.. జాక్.. రోజ్ బొమ్మ గీశాడు కానీ, రోజ్.. జాక్ బొమ్మ గీస్తే ఏమయ్యేదో' అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. అంతేకాదు, ఆ తర్వాత కిందకు పడిపోయి మరీ నవ్వింది. దీంతో ఇది హైలైట్ అవుతోంది.


Click it and Unblock the Notifications











