తొలిసారి అలా చేసి షాకిచ్చిన సుమ: షోలో అందరి ముందే కింద పడిపోయి.. దెబ్బకు దిమ్మ తిరిగిపోయింది
తెలుగు బుల్లితెర చరిత్రలోనే చాలా కాలంగా నెంబర్ వన్ యాంకర్‌గా వెలుగొందుతూ.. ప్రేక్షకులకు మజాను పంచుతోంది మన ఆడపడుచు సుమ కనకాల. అద్భుతమైన హోస్టింగ్‌తో సత్తా చాటుతోన్న ఆమె.. కనీసం ఎవరూ పోటీ ఇవ్వలేని స్థాయికి ఎదిగిపోయింది. గ్లామర్ అస్త్రంతో ఎంతో మంది అమ్మాయిలు యాంకర్లుగా ఎంట్రీ ఇస్తున్నా.. ఈమె క్రేజ్ మాత్రం అస్సలు తగ్గడం లేదు. అలా చాలా కాలంగా బుల్లితెరపై హవాను చూపిస్తోంది. ఈ నేపథ్యంలోనే సుమ తాజాగా జరిగిన ఓ షోలో ఊహించని పని చేసి షాకిచ్చింది. అసలేం జరిగింది? పూర్తి వివరాలు మీకోసం!

సుమ ప్రత్యేకతే అది.. అందుకే టాప్ ప్లేస్
పోటీ ఉన్నా తెలుగులో ప్రస్తుతం ఎంతో మంది యాంకర్లు తమ తమ టాలెంట్‌తో నెగ్గుకొస్తున్నారు. వీరిలో చాలా మంది గ్లామర్‌నే నమ్ముకుని ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. కానీ, సుమ మాత్రం వీళ్లకు భిన్నంగా ఎంట్రీ ఇచ్చింది. అద్భుతమైన టైమింగ్‌తో పంచులు వేస్తూ సత్తా చాటుతోంది. పక్కింటి అమ్మాయిలా కనిపిస్తూ ఆడవారి మనసు దోచుకుంది. అందుకే టాప్ ప్లేస్ దక్కించుకుంది.

అన్నింట్లోనూ సుమనే... వరుస ఆఫర్లతో
దాదాపు పదేళ్లకు పైగానే యాంకర్‌గా సుమ కెరీర్ జోరుగా సాగుతోంది. ఒకపక్క టీవీ షోలు చేసుకుంటూనే మరోవైపు సినిమా ఫంక్షన్లు, ఇంటర్వ్యూలు వగైరా కానిచ్చేస్తుంది. దీంతో ఈ సీనియర్ యాంకర్ ఫుల్ బిజీగా సాగుతోంది. వీటితో పాటు వ్యాపార ప్రకటనల్లోనూ నటిస్తూ నాలుగు రాళ్లు వెనకేస్తుంది. ఇలా అన్ని రకాలుగా అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటోంది.

సుమ టైమింగ్ హైలైట్.. భారీ స్పందనతో
టాప్ యాంకర్ సుమ కనకాల పలు ఛానెళ్లలో రకరకాల కార్యక్రమాలతో బిజీగా గడుపుతోంది. ఈ కార్యక్రమాలన్నింటికీ టీవీలోనే కాకుండా యూట్యూబ్‌లో సైతం భారీ స్థాయిలో స్పందన వస్తోంది. ఎంతటి పెద్ద కమెడియన్లనైనా తన పంచులతో ముప్పతిప్పలు పెట్టే సుమ... ఇదే టైమింగ్‌ను నమ్ముకుని ముందుకు సాగుతోంది. ఆమె చేస్తున్న అన్ని కార్యక్రమాల్లో ఇదే ఫాలో అవుతోంది.

అన్నింట్లో ఆ షోకే ఎక్కువ రేటింగ్ వస్తోంది
ఇప్పటికే సుమ ఎన్నో చానెళ్లలో చాలా రకాల కార్యక్రమాలు చేసింది. వాటిలో ఫ్యామిలీకి సంబంధించినవి, మహిళలకు చెందినవి, పిల్లల కోసం ప్రత్యేకంగా రూపొందించినవి ఉన్నాయి. సెలెబ్రిటీల కోసమే చేసిన షో కూడా ఉంది. అదే 'క్యాష్'. ప్రముఖ ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న ఈ ప్రోగ్రామ్‌కు భారీ రెస్పాన్స్ వస్తోంది. యూట్యూబ్‌లో సైతం దీనికి భారీ స్థాయిలో వ్యూస్ వస్తున్నాయి.

యాంకర్ రవితో కలిసి సెలెబ్రిటీ ఛాలెంజ్
ప్రస్తుతం సుమ కనకాల చేస్తున్న షోలలో 'బిగ్ సెలెబ్రిటీ ఛాలెంజ్' ఒకటి. జీ తెలుగులో ప్రసారం అవుతోన్న ఈ కార్యక్రమంలో సెలెబ్రిటీలు గెస్టులుగా వస్తుంటారు. వాళ్లంతో కొన్ని గేమ్స్ ఆడించడమే దీని కాన్సెప్ట్. ఈ ప్రోగ్రాంకు సుమతో పాటు రవి కూడా యాంకర్‌గా చేస్తున్నాడు. వీళ్లిద్దరూ రచ్చ రచ్చ చేస్తున్నారు. ఇక, వచ్చే వారానికి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది.
Recommended Video
తొలిసారి అలా చేసి షాకిచ్చిన యాంకర్
వచ్చే వారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌కు 'సరిగమప' షోలోని సింగర్లు వచ్చారు. వాళ్లతో కలిసి సుమ, రవి ఫుల్‌గా ఎంజాయ్ చేశారు. ఇక, చివర్లో వాళ్లంతా కలిసి గమకాలు గానం చేశారు. ఆ సమయంలో సుమ కూడా వాళ్లతో గొంతు కలిపింది. వాటిని పూర్తిగా పలికింది. దీంతో అక్కడున్న అందరూ షాకైపోయారు. యాంకర్ రవి అయితే.. ఆమె కాళ్లపై పడిపోయి నమస్కరించాడు.


Click it and Unblock the Notifications











