Suma Kanakala: సుమ చేతిపై అతని పేరు.. ఆ పచ్చబొట్టు గుట్టువిప్పిన స్టార్ యాంకర్

సుమ కనకాల.. పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. దాదాపు మూడు దశాబ్థాలుగా తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో తనకంటూ ప్రత్యేక స్థానం దక్కించుకున్నారు సుమ. తన వాగ్ధాటి, పంచ్‌లతో ఎలాంటి వాతావరణాన్ని అయినా ఆహ్లాదకరంగా మార్చేస్తారు సుమ. సినిమా ఈవెంట్స్, ప్రైవేట్ ఈవెంట్స్, ఇంటర్వ్యూలు, బుల్లితెరపై ప్రోగ్రామ్స్‌తో ఇలా ఎక్కడైనా సుమ కనిపించాల్సిందే. చిన్నా చితకా హీరోల నుంచి స్టార్ హీరోల వరకు తమ సినిమా ఈవెంట్స్‌‌కు సుమనే ఫేవరెట్ ఛాయిస్. సుమ యాంకరింగ్ చూస్తూ పెరిగినవారు.. ఇప్పుడు వాళ్ల పిల్లలతో కలిసి సుమ యాంకరింగ్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. క్షణం తీరిక లేకుండా గడుపుతున్నప్పటికీ.. కుటుంబాన్ని, కెరీర్‌ను బ్యాలెన్స్ చేస్తున్నారు. మూడు దశాబ్ధాలుగా అలుపెరగని ప్రయాణం సాగిస్తూ వినోదాన్ని పంచుతున్నారు.

సుమకు ముందు కూడా పలువురు యాంకరింగ్ చేశారు. కానీ యాంకరింగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా మారారు సుమ. మలయాళ అమ్మాయే అయినా తెలుగు భాషను చెడుగుడు ఆడుకుంటారు. తొలుత కళ్యాణ ప్రాప్తిరస్తు సినిమాతో వెండితెరపై అడుగుపెట్టిన సుమ.. ఆ తర్వాత కొన్ని సినిమాల్లోనూ నటించారు. కానీ ఎందువల్లనో ఆమెకు నటనా రంగం అంతగా కలిసిరాలేదు. బుల్లితెరపై కొన్ని సీరియల్స్‌లో నటించి మెప్పించారు. ఆ సమయంలోనే యాంకరింగ్‌లోకి అడుగుపెట్టి సక్సెస్ కొట్టారు.

Suma Kanakala Tattoo Secret Revealed During Jayamma Panchayati Promotions

సీనియర్ నటుడు, దర్శకుడు దేవదాస్ కనకాల కుమారుడు రాజీవ్ కనకాలను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు సుమ. ఈ దంపతులకు ఒక కుమారుడు, కుమార్తె సంతానం. కొడుకు రోషన్‌ను హీరోగా నిలబెట్టేందుకు సుమ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే సుమ కనకాల తన షూటింగ్స్, షోలు, ఇతర వివరాలతో పాటు వ్యక్తిగత విషయాలను కూడా పంచుకుంటూ ఉంటారు. ఇక సామాజిక అంశాలపైనా సుమ స్పందిస్తూ తన అభిప్రాయాలను తెలియజేస్తూ ఉంటారు.

అప్పుడప్పుడు కొన్ని సినిమాలలో గెస్ట్ రోల్స్‌లో నటిస్తూ వచ్చారు సుమ. వర్షం, ఢీ, బాద్ షా, ఓ బేబీ వంటి సినిమాలలో తళుక్కున మెరిశారు. అయితే ఎన్నో ఏళ్ల తర్వాత సుమ కనకాల లీడ్ రోల్‌లో జయమ్మ పంచాయతీ అనే సినిమా తెరకెక్కింది. విజయ్ కుమార్ కైలవరపు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో 2022 మే 6న విడుదలైంది. ఈ సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాలలో భాగంగా సుమ కనకాల పలు ఇంటర్వ్యూలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె చేతిపై ఉన్న టాటూ చర్చనీయాంశమైంది. దీనికి సుమ తనదైన శైలిలో ఆన్సర్ ఇచ్చారు.

ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సుమ మాట్లాడుతుండగా.. ఓ యాంకర్ చేతిపై పచ్చబొట్టు కనిపించింది. అదేంటీ అని సుమ అడగ్గా.. మీ పచ్చబొట్టు మేటర్ ఏంటీ అని యాంకర్ ప్రశ్నించింది. చేతిపై వెంకన్న అనే పేరు ఉండటంతో అంతా షాక్ అవుతారు. ఇది ఎందుకు అనేది జయమ్మ పంచాయతీ సినిమా చూస్తే తెలుస్తుంది. సెకండాఫ్‌లో ఈ విషయం రివీల్ అవుతుందని ఆన్సర్ ఇచ్చారు. రాజీవ్ కనకాల గారు, మీరు అప్పట్లో సీరియల్‌లో యాక్ట్ చేశారు.. మళ్లీ మీ ఇద్దరూ కలిసి నటించే ఛాన్స్ ఏమైనా ఉంటుందా అని యాంకర్ ప్రశ్నించింది. అది బాగుంటుంది.. ఒక ప్రొడ్యూసర్‌ని వెతకు, అందరూ అంటూనే ఉంటారు కానీ నిజంగా రావాలి కదా అని సుమ తెలిపారు. ప్రస్తుతం ఈ పాత వీడియో వైరల్ అవుతోంది.

Read more about: suma kanakala rajeev kanakala
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X