పవన్ కళ్యాణ్ అంటే సుమకి భయమా? అసలు కారణమేంటీ?
యాంకరింగ్ ప్రపంచంలో తనదైన ముద్ర వేసుకున్న సుమ కనకాల (Suma Kanakala) గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. మాతృభాష మలయాళం అయినప్పటికీ, తెలుగును ఎంతో చక్కగా నేర్చుకున్నారు. తన మాటల గారడీతో, స్పాంటేనియస్ టాకింగ్ స్టైల్‌తో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు సుమ. గత మూడు దశాబ్దాలుగా బుల్లితెరపై యాంకర్ గా అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. ఎంతమంది కొత్త యాంకర్లు వచ్చినా, సుమకు ఉన్న క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. తాజాగా ఆమె ఒక పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొని పవన్ కళ్యాణ్ ఈవెంట్స్ గురించి చెప్పిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.
సుమ కనకాల .. వెండి తెర, బుల్లితెర అనే తేడా లేకుండా దూసుకుపోతున్నారు. సుమ మైక్ పట్టుకుంటే అస్సలు తగ్గేదేలే అన్నట్టుగా ఉంటుంది. ఆమె జోష్, స్టామినా, హ్యూమర్ వేరే లెవల్. గత కొన్ని నెలలుగా టెలివిజన్ ఈవెంట్లను తగ్గించిన సుమా.. ఇప్పుడు సినిమా ప్రమోషన్స్, ప్రీ రిలీజ్ ఈవెంట్స్ తో బిజీగా మారారు.అలాగే.. మరోసారి స్మాల్ స్క్రీన్ నుంచి బిగ్ స్క్రీన్ వైపుకు అడుగులేస్తుంది. ఆమె తాజాగా 'ప్రేమంటే' (Premante) అనే రొమాంటిక్ కామెడీ సినిమాలో కానిస్టేబుల్ పాత్రలో నటించారు. ప్రియదర్శి, ఆనంది జంటగా నటించిన ఈ సినిమాకు నవనీత్ శ్రీరామ్ దర్శకత్వం వహించారు. నవంబర్ 21న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్ర ప్రమోషన్లలో భాగంగా సుమా కూడా చురుగ్గా పాల్గొంటున్నారు.

ఇదెలాఉంటే.. యాంకర్ సుమ ఓ పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇందులో సుమా మాట్లాడుతూ.. "పవన్ కళ్యాణ్ ఈవెంట్ అంటే నాకు భయం వేసి తీరుతుంది. ఆయన అభిమానుల జోష్‌కి అడ్డులు ఉండవు. అందుకే ముందుగానే ఎలా బయటకు వెళ్లాలో ప్లాన్ చేసుకుంటాను" అని నవ్వుతూ చెప్పింది. పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన రెండు సినిమాల ప్రీ రిలీజ్ ఈవెంట్లకు తాను యాంకరింగ్ చేయడానికి వెళ్లిందట.
అయితే ఎప్పుడైతే పవన్ స్టేజ్ పైకి వచ్చి మాట్లాడడం మొదలుపెడతారో, అప్పుడు అభిమానుల్లో ఉత్సాహం అల్లకల్లోలంగా మారిపోతుందని, వేదికవైపు ఫ్యాన్స్ దూసుకువచ్చే పరిస్థితి ఏర్పడుతుందని చెప్పింది. "అలాంటి సమయంలో అక్కడ ఉండటం అంటే సాహసమే. ఒక్కసారి ఆ జనం రష్ మొదలైతే, నన్ను కూడా పచ్చడి చేసేస్తారు. అందుకే హీరో స్పీచ్ స్టార్ట్ అయిన వెంటనే నేను స్టేజ్ నుండి సైలెంట్‌గా బయటకు జారుకుంటా!" అని నవ్వుతూ తెలిపింది.
అంతేకాకుండా.. "నేను ఏ సినిమా ఈవెంట్‌కైనా వెళ్ళినా ముందు గమనించే పని ఒక్కటే.. బయటకు వెళ్లే దారి ఎక్కడుంది? కిటికీలు ఎక్కడ ఉన్నాయి? అవసరమైతే ఎక్కడి నుంచి ఎగ్జిట్ అవ్వొచ్చు?" అంటూ సుమ తన ఫన్నీ హ్యాబిట్ గురించి కూడా చెప్పింది. సుమా చెప్పిన ఈ వ్యాఖ్యలు ఆమె సెన్స్ ఆఫ్ హ్యూమర్‌ని మరోసారి బయటపెట్టాయి. "పవన్ కళ్యాణ్ ఈవెంట్ అంటే అభిమానుల హంగామా అంచనాలకు అందదు. ఆ ఎనర్జీ చూసి నేనూ థ్రిల్లవుతా కానీ, అదే భయం కూడా పెడుతుంది" అంటూ సరదాగా చెప్పింది. మొత్తం మీద, సుమ కనకాల చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.


Click it and Unblock the Notifications











