రాజీవ్ కనకాల, సుమ రొమాంటిక్ టచ్.. కౌగిలింతలు, కన్నీళ్లతో ఆ షోకి భారీ హైప్!
సినిమా ఇండస్ట్రీలో కొన్ని జంటలను చూస్తే చాలా ముచ్చెటేస్తుంది. ఇక సోషల్ మీడియా ప్రపంచంలో అలాంటి జోడీలకు నిరంతరం ఫ్రీ ప్రమోషన్స్ జరుగుతూనే ఉంటాయి. అలాంటి వారిలో రాజీవ్ కనకాల, సుమ నిత్యం హాట్ టాపిక్ గా నిలుస్తూనే ఉంటారు. ముఖ్యంగా సుమ చేసే హడావుడి ఏ రేంజ్ లో ఉంటుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇక రీసెంట్ గా బుల్లితెరపై ఈ జోడి రొమాంటిక్ ఫీల్ ని కలిగించింది.

సుమకు లాంగ్ గ్యాప్
లాక్ డౌన్ కారణంగా జీవితంలో చాలా రోజుల తరువాత సుమకు లాంగ్ గ్యాప్ దొరికిందనే చెప్పాలి. అందుకే దాదాపు రెండు నెలల వరకు ఆమె ఏ పని పెట్టుకోకుందా ఇంట్లోనే ఫ్యామిలీతో ఎక్కువ సమయాన్ని స్పెండ్ చేశారు. ఇక కొన్ని రోజుల తరువాత సుమక్క యూ ట్యూబ్ ఛానెల్ లో బిజీ అయ్యారు.

రాజీవ్ తో సుమ రొమాంటిక్ ఫీల్..
ఇక లాక్ డౌన్ ఎత్తేసిన తరువాత మొత్తానికి క్యాష్ షోతో ఆమె మళ్ళీ రెగ్యులర్ లైఫ్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇక 12వ తేదీన ప్రసారం కాబోయే క్యాష్ షోకి సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఆ ప్రోమో వైరల్ గా మారింది. ఎందుకంటే ఆ షోలో పాల్గొన్న రాజీవ్ కనకాలతో సుమ రొమాంటిక్ ఫీల్ ని కలిగించారు.

రాజీవ్ సుమను ఎత్తుకొని..
రాజీవ్ కి చాలా క్లోజ్ గా ఉండే స్నేహితులు బ్రహ్మాజీ, రాజా రవీంద్ర, సమీర్ కూడా షోలో పాల్గొని సుమను, రాజీవ్ ని బాగానే ఆపట్టించారు. ఇక షో ఎంట్రీతోనే రాజీవ్ సుమను ఎత్తుకొని ఒక లవ్లీ ఫీలింగ్ కలిగించాడు. ఇద్దరు కూడా ఎక్కడా తగ్గకుండా వారి హావభావాలతో ఎంతగానో ఆకట్టుకున్నారు. ఇక వారి ఎంట్రీపై సమీర్, రాజా రవీంద్ర సరదాగా సెటైర్స్ వేశారు.
Recommended Video

సుమ కన్నీళ్లు పెట్టుకోగా..
ప్రోమో చివరలో రాజీవ్, సుమ ఎమోషనల్ అయినట్లు చూపించారు. సుమ కన్నీళ్లు పెట్టుకోగా రాజీవ్ ఆప్యాయంగా కౌగిలించుకొని కన్నీళ్లు తుడిచాడు. దీంతో క్యాష్ షోకి ఈ సారి భారీ రేటింగ్ వస్తుందని చెప్పవచ్చు. గతంలోనే ఒక ఎపిసోడ్ లో రాజీవ్ పాల్గొన్నారు. ఇక ఇప్పుడు ఎవరు ఊహించని విధంగా ఎంట్రీ ఇచ్చాడు. మరి మొత్తం షోలో ఎంతవరకు ఆకట్టుకుంటారో చూడాలి.


Click it and Unblock the Notifications











