సుమ, ఝాన్సీ‌పై కోలుకోలేని దెబ్బ.. ఆ రెండు షోల కథ ముగిసినట్టేనట!

కరోనావైరస్ కారణంగా లాక్‌డౌన్, ఆంక్షలు విధించడంతో వినోద రంగానికి సంబంధించి ప్లాన్స్ అన్నీ తలకిందులవుతున్నాయి. ప్రేక్షకుల ఆధారంగా నడిచే గేమ్ షోలు, రియాలిటీ షోల పరిస్థితి అయితే చెప్పనక్కర్లేదు. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా కంటెంట్, ప్రొగ్రాం డిజైన్ మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నది. కొన్ని షోల కొనసాగింపుపై ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. తాజాగా యాంకర్ సుమ, యాంకర్ ఝాన్సీ హోస్ట్‌లుగా వ్యవహరించే షోలను నిలిపివేసే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయట.. వివరాల్లోకి వెళితే..

బుల్లితెరపై మళ్లీ జోష్

బుల్లితెరపై మళ్లీ జోష్

తెలుగు టెలివిజన్ రంగం మళ్లీ షూటింగులతో కళకళలాడే పరిస్థితి కనిపిస్తున్నది. డైలీ సీరియల్స్‌తో బుల్లితెర మళ్లీ జోష్ పెంచేందుకు నిర్మాతలు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే తమ షూటింగుల షెడ్యూల్స్‌ను, ప్రసార సమయాలపై కసరత్తు చేస్తున్నారు. అయితే కొన్ని గేమ్ షోల పరిస్థితి సందేహాత్మకంగా మారాయి. అందులో ఒకటి వైఫ్ చేతిలో లైఫ్, పరివార్ లీగ్ సీజన్ 2 ఉన్నట్టు తెలుస్తున్నది.

యాంకర్ సుమ.. వైఫ్ చేతిలో లైఫ్

యాంకర్ సుమ.. వైఫ్ చేతిలో లైఫ్

యాంకర్ సుమ హోస్ట్‌గా నిర్వహించే వైఫ్ చేతిలో లైఫ్‌పై గట్టిగానే దెబ్బ పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు షూట్ చేసిన ఎపిసోడ్స్ ప్రసారం చేసిన తర్వాత షోను నిలిపివేయాలనే ఆలోచనతో ఉన్నట్టు తెలుస్తున్నది. ఈ షోలో ఆడియెన్స్ పాల్గొనాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఎక్కువ మందిని అనుమతించ కూడదనే లాక్‌డౌన్ నిబంధనలతో మిగితా ఎపిసోడ్ ఇప్పట్లో షూట్ చేయడం కష్టమే అనే నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం.

 ఝాన్సీ పరివార్ లీగ్‌కు కష్టాలు

ఝాన్సీ పరివార్ లీగ్‌కు కష్టాలు

ఇక పరివార్ లీగ్ విషయానికి వస్తే.. సెలబ్రిటీలతో షో నిర్వహించాల్సి ఉంటుంది. స్టూడియోలో ఇలాంటి ఎపిసోడ్స్ చిత్రీకరించాల్సినందున ఇప్పట్లో సాధ్యపడే విషయమేనా అనే ప్రశ్న వెంటాడుతున్నది. ప్రస్తుత పరిస్థితుల్లో మరిన్ని ఎపిసోడ్స్ షూట్ చేయడం కుదరకపోవడం వల్ల ఈ షోను తాత్కాలికంగా వాయిదా వేయాలని భావిస్తున్నట్టు తెలుస్తున్నది. లాక్ డౌన్ నిబంధనలు కారణంగా ఈ షోను కూడా సాధ్యమైనంత తొందరగా ముగించాలనే ఆలోచనలో నిర్వాహకులు ఉన్నట్టు తెలుస్తున్నది.

Recommended Video

Anchor Suma Kanakala In Allu Arjun's Movie, Pushpa Unit Reacts
సుమ, ఝాన్సీ దారిలోనే మరిన్ని షోలు

సుమ, ఝాన్సీ దారిలోనే మరిన్ని షోలు

తెలుగు టెలివిజన్ రంగంలో సుమ, ఝాన్సీ షోలే కాకుండా మరికొన్ని కార్యక్రమాలకు ఇలాంటి పరిస్థితులే ఎదురుకానున్నాయట. ప్రేక్షకులు, సెలబ్రిటీల ఆధారంగా నడిచే షోలకు కష్టం కాలం ఉందనే వాదన ఇండస్ట్రీ వర్గాల నుంచి వినిపిస్తున్నది. తెలుగు వినోద రంగానికి కరోనా చేసిన నష్టం అంతా ఇంతా కాదనే విషయాన్ని, ఆవేదనను పలువురు సెలబ్రిటీలు వ్యక్తం చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X