రాజీవ్ ఏంటి ఇంత ఘోరంగా ఉన్నాడు!!.. అలా చేయడంతో భయపడిన సుమ
ఏదైనా షోకు సుమ యాంకరింగ్ చేసినా లేదా గెస్ట్‌గా వెళ్లినా సరే అక్క ఆమె ముద్ర కనిపించాల్సిందే. అదే సుమ ప్రత్యేకత. ఆమె వేసే సెటైర్లకు ఎవ్వరైనా సరే ఫిదా అవ్వాల్సిందే. ఆమె అంత సమయస్ఫూర్తిగా పంచ్‌లు వేస్తుంది కాబట్టే ఇంకా ఫాంలో ఉంది. అవతల ఎవరున్నా సరే సుమను ఢీ కొట్టడం మామూలు విషయం కాదు. తాజాగా సుమ బొమ్మ అదిరింది షోలో గెస్ట్ అప్పీయరెన్స్ ఇచ్చింది. ఇక సుమ ఎంటరైతే సందడి ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే.

అదిరింది.. మారింది..
జబర్దస్త్ షోకు పోటీగా అదిరిందిని ప్రారంభించారు. జబర్దస్త్ డైరెక్టర్లు నితిన్ భరత్, నాగబాబు, చమ్మక్ చంద్ర, వేణు, ధన్ రాజ్ ఇలా కొందరితో అదిరింది షో ప్రారంభమైంది. యాంకర్లుగా రవి, సమీరలను తీసుకొచ్చారు. మధ్యలో భాను శ్రీని పట్టుకొచ్చారు. ఇలా ఓ 25 ఎపిసోడ్లు బాగానే రన్ చేశారు. కానీ ప్రస్తుతం అదిరింది మారింది.

బొమ్మ అదిరిందిగా..
అదిరింది వర్షెన్ 2.ఓ గా బొమ్మ అదిరిందిని తీసుకొస్తున్నారు. ఇందులో భాగంగా భారీ మార్పులు చేర్పులు చేశారు. యాంకర్లుగా రవి, భాను శ్రీలను తీసేశారు. జడ్జ్‌గా నవదీప్‌ను పీకేశారు. శ్రీముఖి, జానీ మాస్టర్‌లను తీసుకొచ్చి షోను మళ్లీ గ్రాండ్‌గా ప్రారంభించనున్నారు.

నేటి నుంచే..
నేడు (అక్టోబర్ 4) బొమ్మ అదిరింది షోను ప్రారంభించబోతోన్నారు. నేటి రాత్రి తొమ్మిది గంటలకు ప్రసారం కాబోతోన్న ఈ షోను బాగానే ప్రమోట్ చేస్తున్నారు. మొదటి ఎపిసోడ్ కాబట్టి సుమ, అలీలను కూడా పట్టుకొచ్చారు. సుమపై వదిలిన ప్రోమో ఒకటి తెగ వైరల్ అవుతోంది.
Recommended Video
గల్లీ బాయ్స్ స్కిట్...
గల్లీ బాయ్స్ టీంలోని రియాజ్ సుమ గెటప్ వేసుకున్నాడు. స్కిట్‌లో అతను సుమ పాత్రను పోషించడం చూసి సుమ షాక్ అయింది. ఇక అదే ఓ రకంగా ఉందంటే.. రాజీవ్ కనకాల పాత్రను వేసిన వ్యక్తిని చూసి దెబ్బకు మూర్చబోయినంత పనిచేసింది. రాజీవ్ ఏంటి ఇలా ఉన్నాడు.. నేను వెళ్లిపోతా అంటూ సుమ కౌంటర్ వేయడంతో అందరూ నవ్వేశారు.


Click it and Unblock the Notifications











