షోలో రవికృష్ణ ఏకంగా ముద్దు పెట్టేశాడు.. ఆ సీన్‌తొ దెబ్బకు సుమ చేతులు వణికాయ్!!
సుమ హోస్ట్ చేసే క్యాష్ అంటే ఫన్‌కు కొదవే ఉండదు. అయితే ఈ మధ్యన ఫన్‌తో పాటు రొమాన్స్ కూడా తోడవుతోంది. షోలో రొమాన్స్ పీక్స్‌కు చేరుతోంది. వచ్చే గెస్ట్‌లు కూడా దుమ్ములేపుతున్నారు. ప్రోమోను కూడా భలే తెలివిగా కట్ చేస్తున్నారు. ఎక్కడ ఎలా కట్ చేసి చూపిస్తే సోషల్ మీడియాలో వైరల్ అవుతుందో వారికి బాగానే తెలిసిపోయింది. అందుకే ఈ మధ్య ప్రోమోలో మాత్రం విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

వచ్చేవారం ఎపిసోడ్‌లో..
వచ్చే వారం ఎపిసోడ్‌లో క్యాష్‌లో ఆమె కథ హీరో రవికృష్ణ, హీరోయిన్ నవ్యస్వామి గెస్ట్‌లుగా వచ్చారు. ఇక రవికృష్ణ వచ్చిందంటే అతని వెనకాలే శివజ్యోతి కూడా రావాల్సిందే. అసలే వీరిద్దరిది బిగ్ బాస్ కలిపిపిన బంధం. ఈ షోలోనూ వీరిద్దరు రెచ్చిపోయి మరీ సెటైర్లు వేశారు. మరీ ముఖ్యంగా రవికృష్ణ ఓ రేంజ్‌లో ఆడుకున్నాడు.

రవికృష్ణ పంచ్‌లు..
మీరు ఎలాంటి జంతువును పెంచుకోవాలి అని అనుకుంటున్నారు అంటూ సుమ ప్రశ్నించింది. దీంతో వెంటనే రవికృష్ణ వెంటనే స్పందించి శివజ్యోతిని అని సమాధానం చెప్పాడు. అక్కను జంతువుని చేసేశావా? అని సుమ కౌంటర్ వేసింది. ఇక మరో గెస్ట్ ప్రణవిని కూడా అదే ప్రశ్నను సుమ అడిగింది. తనకు జంతువులంటే భయమని చెప్పగా.. కోతిని పెంచుకో అని సుమ సలహా ఇచ్చింది. వెంటనే రవి ఎంటరై.. సుమను తీసుకెళ్లు అంటూ పరోక్షంగా సెటైర్ వేశాడు. థ్యాంక్యూ రవి నన్ను గుర్తించినందుకు అంటూ సుమ నవ్వుతూ చెప్పింది.

శివజ్యోతిపై కౌంటర్లు..
మీ ఆయన ఏం అబద్దం చెబుతాడు అని శివజ్యోతిని సుమ అడిగింది. మధ్యలో రవికృష్ణ వచ్చి.. నువ్ అందంగా ఉంటావ్ అని ఒకటైతే చెబుతాడు అంటూ సెటైర్ వేశాడు. రవి ఎలాంటి అబద్దాలు చెబుతాడు అంటూ మళ్లీ శివజ్యోతిని ప్రశ్నించింది సుమ. వాడు చెప్పే అబద్దాలు బయటపెడితే.. అంటూ పూర్తి చేసేలోపు వద్దు అంటూ రవి గట్టిగా పట్టేసుకున్నాడు.

అలా స్కిట్..
రవికృష్ణ, నవ్యస్వామిలకు సుమ ఓ టాస్క్ ఇచ్చినట్టు కనిపిస్తోంది. వర్షంలో తడుస్తూ చెట్టుకింద ఉన్న ఓ ప్రేమజంటగా నటించారు. అంతలో మొక్కజొన్న పొత్తులు అమ్ముకునే క్యారెక్టర్‌లో సుమ వచ్చింది. గతేడాది ఎవరితోనో వచ్చావ్ కదా అంటూ ఫన్ క్రియేట్ చేసింది.

క్యాష్‌లో షూటింగ్..
మరో స్కిట్‌లో మళ్లీ నవ్యస్వామిని, రవికృష్ణను వాడేసింది. షూటింగ్ సెట్, సుమ డైరెక్టర్‌గా నటించారు. రవికృష్ణ, నవ్యస్వామిలను నటించమని చెప్పింది. మా నుంచి ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారని రవి అడగడంతో ఏం లేదని సుమ పంచ్ వేసింది.
Recommended Video

ముద్దు పెట్టడంతో షాక్..
ఆ తరువాత నవ్యస్వామి మోకాళ్లపై కూర్చుని రవికృష్ణకు ప్రపోజ్ చేసింది. వెంటనే రవి వచ్చి నవ్యస్వామిని ముద్దు పెట్టుకున్నాడు. దీంతో సుమ షాక్ అయింది. చేతుల్ని వణికిస్తూ.. ఈ సీన్ మనదాంట్లో లేదు అంటూ సెటైర్ వేసింది. సీన్‌ను మరో లెవెల్‌కు తీసుకెళ్దామని నేనే చేశాను అంటూ రవి మరో కౌంటర్ వేశాడు.


Click it and Unblock the Notifications











