Bigg Boss Buzzz: ‘అధ్యక్షా.. చేయకూడని పెద్ద తప్పు చేశావ్' సుమన్ శెట్టిని ఆడుకున్న శివాజీ..
Suman Shetty Bigg Boss Buzzz: బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9 ప్రారంభమైనప్పటి నుంచే అత్యధికంగా విమర్శలు ఎదుర్కొన్న కంటెస్టెంట్ ఎవరు అంటే.. ముందుగా వినిపించిన పేరు సుమన్ శెట్టి. షో మొదలయ్యే ముందు నుంచే 'ఒక వారం కూడా నిలవలేడు', ఇతను ఎందుకు సెలెక్ట్ అయ్యాడు?, ఔట్‌డేటెడ్ కమెడియన్ అంటూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరిగింది. హౌస్‌లో అడుగుపెట్టిన తొలి వారం నుంచే సుమన్ శెట్టి ప్రయాణం ఎక్కువ రోజులు ఉండదన్న అంచనాలే వినిపించాయి. కానీ వారందరీ ఆ అంచనాలన్నింటినీ తలకిందులు చేస్తూ.. ఏకంగా 14 వారాలు బిగ్ బాస్ హౌస్‌లో కొనసాగాడు సుమన్ శెట్టి. ఫినాలేకు కేవలం ఒక్క వారం ముందు ఎలిమినేట్ కావడం ద్వారా గ్రేట్ అనే చెప్పాలి.
బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయిన తర్వాత బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూలో శివాజీ పాల్గొన్నారు. ఇప్పటివరకు శివాజీ ఎన్నో ఇంటర్వ్యూలు చేసినా... సుమన్ శెట్టితో చేసిన ఇంటర్వ్యూలో కనిపించిన ఫన్, కామెడీ టైమింగ్ వేరే లెవల్. 'సుమన్ అన్నా..' అంటూ ఫన్నీగా స్వాగతం పలకడం, వచ్చి రాగానే వంగి వంగి దండాలు పెట్టడం చాలా సరదాగా సాగింది. అదే జోష్ లో 'అధ్యక్షా.. బజ్‌లో ఏ ప్రశ్న అడిగినా.. భరణి గారి నుంచి లైఫ్ లైన్ తీసుకోననీ, అంతా నిజమే చెబుతాను. చెప్పమన్న అబద్దం చెప్పను' అంటూ సుమన్ శెట్టి స్టైల్‌లో ప్రమాణం చేయించడంతో ఇంటర్వ్యూలో హైలెట్ మారింది.

అనంతరం సుమన్ శెట్టిని ఇంటర్య్వూ సీట్ లో కూర్చోబెట్టి.. 'బిగ్ బాస్ హౌస్‌లో కళ్యాణ్, ఇమ్మూ లకు బ్యాంకాంక్ కు తీసుకెళ్లాననీ మాట ఇచ్చావంట.. ఏంటీ ఆ సంగతీ?' అన్ని ప్రశ్నించగా.. 'వద్దన్నా.. వదిలేవ్..' అంటూ సమాధానం చెప్పలేకపోయారు. ఆ తరువాత శివాజీ 'నువ్వు ఇన్ని రోజులు హౌస్‌లో ఉంటావని అనుకున్నావా?' అని అడిగితే... "లేదన్నా" అంటూ సుమన్ శెట్టి ఫన్నిగా ఇచ్చిన సమాధానం ఆడియన్స్‌ను నవ్వించింది. 'నువ్వే కాదు..మేం కూడా అనుకోలేదు' అంటూ శివాజీ వేసిన పంచ్ కూడా వైరల్ అయింది.
ఆ తరవాత శివాజీ కాస్త సీరియస్ గా 'మేము నీ నుంచి కామెడీ ఎక్సాపెక్ట్ చేశాం.. సంజనా పేరు చెబితే.. ముఖం మారిపోయేది తెలుసా?' అని ప్రశ్నించగా . సుమన్ కాస్త తికమకపడ్డారు. అంతటితో శివాజీ ఆగకుండా 'హౌస్ లో ఓ మాట అన్నావ్.. వస్తుందయ్యా.. రంగుల మార్చే ఊసరవెళ్లి అని ఇంతకీ ఆ మాట ఎవరిని అన్నావ్.. 'అని ప్రశ్నించగా సుమన్ మరింత అయోమయంలో పడ్డారు.
'ఎందుకు నీ పిలకని ఆయన (భరణి)చేతిలో పెట్టావ్? నీ ఐడియా నీకు లేదా?' అని కెలకడం స్టార్ట్ చేశారు శివాజీ. ఆ తరువాత 'చాలా పెద్ద తప్పు చేశావ్ సుమన్ నువ్వూ.. ఎవరూ చేయకూడని తప్పు చేశావ్.. ఎందుకు చేశావ్ అలా..? అని సీరియస్ గా ప్రశ్నించారు. దీంతో సుమన్ కంగారు పడుతూ' అన్నా ఆ తప్పేంటో చెబితే కాదా?' అని రిక్వెస్ట్ చేశారు. అయినా శివాజీ ఆ తప్పేంటో చెప్పకుండా 'ఆలోచించవా? ఏమీ? ఇంటి దగ్గర కూడా అలాగే చేస్తావా?' అంటూ వరుస ప్రశ్నలు వేశారు శివాజీ. ముందు తప్పేంటే చెప్తే.. చేశానో లేదో చెప్తాను అని పంచ్ వేశాడు సుమన్ శెట్టి.
ఇంటర్వ్యూలో శివాజీ పదే పదే "నువ్వు చేయకూడని తప్పు చేశావ్" అంటూ ప్రశ్నించడం చూస్తే.. అంతా ఫన్ కోసమే అన్న విషయం క్లియర్‌గా కనిపించింది. ఎందుకంటే బిగ్ బాస్ హౌస్‌లో సుమన్ శెట్టి పై అంతగా పెద్ద వివాదాలు, తప్పులు చేసిన సందర్భాలే లేవు. ఆయన చేసిందల్లా..
ఎక్కువగా నిద్రపోవడం, యాక్టివ్‌గా గేమ్ ఆడకపోవడం. ఆయనపై తీవ్రమైన ఆరోపణలేమీ లేవు. నిజంగా బిగ్ బాస్ రూల్స్‌కు విరుద్ధంగా ఏదైనా చేసి ఉంటే.. వీకెండ్ లో కింగ్ నాగార్జున వేసుకునే వాడు కాదా..
మొత్తానికి సుమన్ ప్రయాణం ఎవరూ ఊహించిన విధంగా 14 వారాల పాటు, గేమ్ పరంగా బలహీనుడైనా, స్ట్రాటజీలు లేకపోయినా, కన్నింగ్ ఆలోచనలు చేయకపోయినా... మంచి మనిషిగా, అమాయకుడిగా, పాజిటివ్ వైబ్‌తో సుమన్ శెట్టి బిగ్ బాస్ హౌస్‌లో తనదైన గుర్తింపు సంపాదించాడు. మొదట ట్రోల్ అయిన వ్యక్తి... చివరికి ప్రేక్షకుల గౌరవాన్ని పొందుతూ బయటకు రావడం సుమన్ శెట్టికి దక్కిన అరుదైన గౌరవం అనే చెప్పాలి.


Click it and Unblock the Notifications











