కంగారు పడకండి.. ఎంజాయ్ చేయండి: కమెడియన్ సునీల్ ఆసక్తికర స్పందన
కమెడియన్ సునీల్ తీవ్ర అస్వస్థకు గురయ్యాడని, ఆసుపత్రిలో కూడా జాయిన్ అయ్యాడని నిన్న (జనవరి 23) పెద్ద ఎత్తున వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ వార్తలు చూసిన సినీ వర్గాలు, ప్రేక్షకులు ఒక్కసారిగా షాకయ్యాయి. ఇంతకీ సునీల్‌కి ఏమైనట్టు అని ఆరా దీశారు. అయితే తనకు ఏమీ కాలేదని నిన్ననే కన్ఫర్మ్ చేసిన సునీల్. మరోసారి ఈ ఇష్యూపై స్పందించాడు. వివరాల్లోకి పోతే..

సునీల్ ఆరోగ్య పరిస్థితి
నిజానికి సునీల్ గత కొంత కాలంగా లివర్‌కు సంబంధించిన ఓ సమస్యతో బాధపడుతున్నారు. అయితే దీనికి తోడు నిన్న కొంచెం జ్వరం రావడంతో వైద్యుల సూచన మేరకు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు. కానీ ఈ ఇష్యూ చాలా పెద్దదిగా చేసి సునీల్ ఆరోగ్య పరిస్థితి విషమం అన్నట్లుగా సోషల్ మీడియాలో వార్తలు పుట్టించారు కొందరు.

లిఖితపూర్వకంగా క్లారిటీ.. సోషల్ మీడియా పోస్ట్
దీంతో ప్రేక్షకలోకం కంగారు పడింది. ఈ విషయం తెలుసుకున్న సునీల్.. వెంటనే స్పందించాడు. తనకు ఏం కాలేదని క్లారిటీ ఇచ్చేశాడు. దీంతో ప్రేక్షకులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. అంతేకాదు మరోసారి తాజాగా సోషల్ మీడియా వేదికగా తన ఆరోగ్యం గురించి వస్తున్న వార్తలపై స్పందిస్తూ లిఖితపూర్వకంగా క్లారిటీ ఇచ్చాడు.

కంగారు పడకండి.. ఎంజాయ్ చేయండి
నా గురించి ఇంతగా ఆలోచించిన అభిమానులు, శ్రేయోభిలాషులందరికీ కృతజ్ఞతలు చెబుతున్నా. ప్రస్తుతం నా ఆరోగ్యం బాగానే ఉంది. కంగారు పడాల్సిన అవసరం లేదు అంటూ ఫేస్‌బుక్ పోస్ట్ పెట్టాడు సునీల్. ఈ మేరకు డిస్కో రాజా సినిమా రిలీజై థియేటర్స్‌లోకి వచ్చింది. చూసి బాగా ఎంజాయ్ చేయండి అని చెప్పాడు.
Recommended Video

'డిస్కో రాజా' సినిమా.. సునీల్ రోల్
రవితేజ హీరోగా వీఐ ఆనంద్ దర్శకత్వంలో రూపొందిన 'డిస్కో రాజా' సినిమాలో సునీల్ కీలకపాత్ర పోషించాడు. ఇప్పటికే వచ్చిన ఫస్ట్‌టాక్ ప్రకారం సునీల్ కామెడీ ఈ సినిమాకు ప్రధాన బలం అని తెలుస్తోంది. ఈ రోజే (జనవరి 24) విడుదలైన ఈ చిత్రంలో రవితేజ సరసన నభా నటేష్, పాయల్ రాజ్‌పుత్, తాన్యా హాప్ హీరోయిన్లుగా నటించారు.


Click it and Unblock the Notifications











