‘సిఐడి’సీరియల్ లో యాక్షన్ హీరో

By Srikanya

Sunny Deol to promote 'Singh Saab the Great' on CID
హైదరాబాద్ :సోనీ టీవీలో చాలాఏళ్లుగా దేశ వ్యాప్తంగా అలరిస్తున్న సీరియల్ ఏదీ అంటే కళ్ళు మూసుకుని'సిఐడి' అని చెప్పవచ్చు. ఈ సీరియల్‌లో తమ చిత్రాల ప్రమేషన్ కోసం బాలీవుడ్ హీరోలు కనపడటం చాలా కాలంగా జరుగుతున్నదే. గతంలో సల్మాన్ ఖాన్ వంటి స్టార్ హీరోలు సైతం ఈ సీరియల్ లో కనిపించి అలరించారు. ఇక ఇప్పుడు నటుడు సన్నీ డియోల్ వంతు వచ్చింది. ఆయన త్వరలో ఈ సీరియల్ లో దర్శనమివ్వబోతున్నాడు.

చాలాకాలం తర్వాత 'సింగ్ సాబ్ ది గ్రేట్'తో మళ్లీ ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ హీరో 'సిఐడి' సీరియల్ కోసం ఓ ఎపిసోడ్‌లో నటించాడు. సీనియర్ నటుడైన సన్నీ తమ సీరియల్‌లో నటించడం ఎంతో ఆనందాన్ని కలిగించిందని 'సిఐడి'లో ఎసిపి ప్రద్యుమ్నన్ పాత్రధారి శివాజీ సతామ్ అంటున్నారు. తాను చిరకాలంగా సన్నీ అభిమానినని, మంచి 'యాక్షన్ హీరో'గా జనం మెచ్చుకున్న సన్నీ డియోల్ నటన తమ సీరియల్‌కు హైలెట్‌గా నిలుస్తుందని ఆయన అంటున్నారు. సన్నీతో కలిసి పనిచేయడం తాము ఎన్నటికీ మరచిపోలేమని శివాజీ సంతోషం వ్యక్తం చేశారు. తన సినిమా ప్రచారం కోసం టీవీ నటులతో సన్నీ కలిసి పనిచేయడం మంచి సంప్రదాయమన్నారు.

సినీ నటులను తమ కుటుంబ సభ్యులుగా భావిస్తామని, 'సింగ్ సాబ్ ది గ్రేట్' సూపర్ హిట్ అవుతుందని ఆయన జోస్యం చెప్పారు. అనిల్ శర్మ దర్శకత్వంలో సన్నీ డియోల్, అమృతా రావ్ హీరో హీరోయిన్లుగా నటించిన 'సింగ్ సాబ్ ది గ్రేట్' ఈ నెల 22న దేశ వ్యాప్తంగా విడుదలకు సిద్ధమైంది. ఈ మధ్య కాలంలో బాలీవుడ్ హీరోలు టీవీ సీరియల్స్ ని తమ చిత్రాల ప్రమేషన్ కు చక్కగా ఉపయోగించుకుంటున్నారు. గతంలో రౌడీ రాథోడ్ చిత్రం ప్రమోషన్ కోసం అక్షయ్ కుమార్, సోనాక్షి సిన్హా ..సిఐడీ సీరియల్ లో కనిపించారు. తన సినిమాకు ప్రమోషన్ తో పాటు సీరియల్ కూ ప్రమేట్ చేయటం కలిసి వస్తుంది. అంతకుముందు దబాంగ్ సినిమా ప్రమేషన్ లో భాగంగా..సల్మాన్ ఖాన్...కలర్స్ ఛానెల్ లో ప్రసారమయ్యే లాగి తుజ్ సే లగాన్ అనే టీవీ సీరియల్ లో కనిపించారు.

ఇక సీఐడి సీరియల్ లో సైతం సల్మాన్ ఖాన్ గతంలో కనిపించారు. ఆ సీరియల్ లో వాంటెడ్, బాడీగార్డ్ చిత్రాలు పైరసీ కి అయ్యాయని,సీఐడీ టీమ్ ధర్యాప్తు చేస్తూంటే తాను వచ్చి సహకరిస్తాడు. అలా పైరసీ నిరధోంలో పబ్లిసిటీకి ఈ సీరియల్ ని వాడుకున్నారు. ఇలా టీవీ సీరియల్స్ ద్వారా బాలీవుడ్ హీరోలు కనిపించి తమ సినిమాలు ప్రమోట్ చేసుకుంటూ సీరియల్ చూసే ప్రేక్షకులని సైతం ఆనందపరుస్తున్నారు. టీవీల్లో మునిగిపోయే ప్రేక్షకులను ఆకర్షించటానికి కూడా ఇదో మార్గం అంటున్నారు.

సోనీ ఎంటర్‌టైన్‌మెంట్ వారు నడిపిస్తున్న సీరియల్ 'సీఐడీ'. మొదట్లో వారాంతాల్లో ప్రసారం అయ్యే ధారావాహికగా ప్రారంభమైన సీఐడీ క్రమంగా దినసరికి మారింది. ప్రస్తుతం తెలుగులోకి కూడా డబ్బింగ్ అయ్యి మా టీవీలో ప్రసారం అవుతోంది. అసలు ఈ కార్యక్రమ రూపకర్తలు మొదట దూరదర్శన్ నేషనల్‌లో 1986లోనే ఈ సీరియల్ ప్రారంభించారు. తర్వాత కొన్ని రోజులకు సీఐడీ సోనీ టీవీకి మారింది. 2000 సంవత్సరం నుంచి సోనీ టీవీలో అవిశ్రాంతంగా పరిశోధన కొనసాగిస్తోంది ఈ సీఐడీ టీమ్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X