twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    డబుల్ ధమాకా: బిగ్ బాస్ బ్యూటీస్ అందాల రచ్చచేయబోతున్నారు!

    |

    ఇండియాలో ప్రసారం అవుతున్న పాపులర్ రియాల్టీ షోలో బిగ్ బాస్ ప్రత్యేకమైనది. పాపులారిటీతో పాటు వివాదాలు ఈ షో సొంతం. అంతే కాదు ఈ షో ద్వారా మంచి గుర్తింపు సంపాదించి స్టార్లుగా ఎదిగిన వారు సైతం ఉన్నారు. అలాంటి వారిలో సన్నీ లియోన్ పేరు ప్రముఖంగా చెప్పుకోవచ్చు.

    సన్నీ లియోన్ స్థాయికి కాక పోయినా బిగ్ బాస్ షో ద్వారా బాలీవుడ్ సర్కిల్‌లో మంచి పరిచయాలు పెంచుకున్న భామల్లో మందన కరిమి ఒకరు. త్వరలో సన్నీ లియోన్, మందన కరిమి హారర్ కామెడీ మూవీ ద్వారా ప్రేక్షకులను అలరించబోతున్నారు.

    సన్నీ లియోన్, మందన కరిమి

    సన్నీ లియోన్, మందన కరిమి

    ‘కోకా కోలా' పేరుతో రూపొందబయే చిత్రంలో సన్నీ లియోన్ లీడ్ రోల్ చేస్తోందని, మందన కరిమి పాత్ర ఇందులో విభిన్నంగా ఉండబోతోందని తెలుస్తోంది. ఈ మూవీ కథ బాగా నచ్చింది, గతంలో ఇలాంటి పాత్ర ఎప్పుడూ చేయలేదని, షూటింగ్ కోసం ఎదురు చూస్తున్నట్లు మందన కరిమి ఓ బాలీవుడ్ వెబ్‌సైటుకు వెల్లడించారు.

    అందాల విందుకు సిద్ధంగా ఉండండి

    అందాల విందుకు సిద్ధంగా ఉండండి

    అందాల ఆరబోత విషయంలో ఏ మాత్రం మొహమాటం లేని సన్నీ లియోన్ ‘కోకా కోలా' గ్లామర్ డోసు మరింత పెంచబోతోందట. మందన కరిమి కూడా తక్కువేమీ కాదు. ఇప్పటికే పలు చిత్రాల్లో తన గ్లామర్‌తో కుర్రకారుకు వెర్రెక్కించింది. ఈ సినిమాలో వీరి అందాలు సినీ అభిమానులకు కనువిందు చేయడం ఖాయం అంటున్నారు.

    ప్రేక్షకులను సర్ ప్రైజ్ చేయబోతున్నాం

    ప్రేక్షకులను సర్ ప్రైజ్ చేయబోతున్నాం

    సన్నీ లియోన్‌తో కలిసి పని చేయడంపై మందన కరిమి స్పందిస్తూ... ‘గతంలో పలు ఈవెంట్లలో సన్నీ లియోన్‌ను కలిశాను. ఆమె చాలా లవ్లీ పర్సన్. ఈ సినిమా ద్వారా మేము ఆడియన్స్‌కు చాలా పెద్ద సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్నామని తెలిపారు.

    కోకా కోలా

    కోకా కోలా

    ‘కోకా కోలా' చిత్రానికి ప్రసాద్ తాతికేని దర్శకత్వం వహించబోతున్నారు. మహేంద్ర దరివాల్, పరమదీప్ సింగ్ సంధు, చిరాగ్ దరివాల్ నిర్మించబోతున్నారు. ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ నోయిడాలో ప్లాన్ చేస్తున్నారు. జూన్లో ఈ మూవీ సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉంది.

    English summary
    Sunny Leone and Mandana Karimi in 'Coca Cola' movie. The horror comedy will feature Sunny Leone in the lead role while Mandana Karimi's character will be seen having shades of grey. The report also added that Coca Cola will be directed by Prasad Tatikeni.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X