Big boss telugu 7 finale: మహేశ్ బాబు అభిమానులకు షాక్... లాస్ట్ మినిట్‌లో హ్యాండ్ ఇచ్చాడుగా!

బిగ్‍ బాస్ తెలుగు సీజన్‍ 7 విజేత ఎవరో అఫిషియల్ గా తేలిది నేడే. సెప్టెంబర్ 3న ప్రారంభం అయిన ఈ షోకు.. ఆదివారం అనగా నేటితో శుభం కార్డు పడనుంది. ఇక ఇప్పటికే అన్నపూర్ణ స్టూడియోలో బిగ్ బాస్ తెలుగు 7 షోకి సంబంధించిన షూట్ జరుగుతుంది. ఇక ఈ ఫినాలేకి గెస్టుగా సూపర్ స్టార్ మహేశ్ బాబు రానున్నారని లీక్స్ వచ్చాయి. అయితే బుల్లితెర ఆడియెన్స్ కు మహేశ్ బాబు హ్యాండ్ ఇచ్చాడని తెలుస్తోంది. లాస్ట్ మినెట్లో మహేశ్ బాబు ఇలా చేయడంతో ఫ్యాన్స్ సైతం అంతా నిరాశలో ఉన్నారు. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

వంద రోజులకు పైగా నడిచిన బిగ్ బాస్ తెలుగు 7 రియాలిటీ షోకు ఈరోజుతో ఎండ్ కార్డ్ పడనుంది. ఇక ఈ షో సెప్టెంబర్ 3న ప్రారంభం అయింది. ఆ రోజున బిగ్ బాస్ ఇంట్లోకి 14మంది కంటెస్టెంట్స్ ఎంటర్ అయ్యారు. ఇక ఐదో వారంలో మరో ఐదుగురు వైల్డ్ కార్డు ఎంట్రీస్ ఇచ్చారు. మొత్తం మీద ఈ సీజన్ లో 19మంది కంటెస్టెంట్స్ హౌస్ లో అడుగుపెట్టి సందడి చేశారు. ప్రస్తుతం ఫినాలేకి ఆరుగురు చేరుకున్నారు.

Super Star Mahesh Babu is not coming as a guest on Bigg Boss Telugu 7 Show

హౌస్ నుంచి ఇప్పటి వరకు ఎలిమినేట్ అయిన వారిలో మొదటి వారం కిరణ్ రాథోడ్ (నటి), 2వ వారం షకీలా (నటి), 3వ వారం దామిని (సింగర్), 4వ వారం రతిక (నటి, ఇన్‌ఫ్లూయెన్సెర్) ఎలిమినేట్ అయ్యారు. ఇక రతికారోజ్ మళ్లీ 6వ వారంలో రీ ఎంట్రీ ఇచ్చి..11వ వారం ఎలిమినేట్ అయ్యింది. ఇక 5వ వారం శుభశ్రీ (లాయర్, నటి), 6వ వారం నయని పావని (నటి), 7వ వారం పూజ (సీరియల్ నటి), 8వ వారం ఆట సందీప్ (కొరియోగ్రాఫర్), 9వ వారం టేస్టీ తేజ (జబర్దస్త్ కమెడియన్) ఎలిమినేట్ అయ్యారు.

ఇక 10వ వారం భోలే షావలి (సింగర్, మ్యూజిక్ డైరెక్టర్), 11వ వారం అశ్వినీ శ్రీ (నటి), 12వ వారం డాక్టర్ గౌతం (నటుడు), 13వ వారం శోభా శెట్టి ('కార్తీక దీపం' నటి) ఎలిమినేట్ అయ్యారు. ఇక హౌస్ లో టాప్-6 ఫైనలిస్టులుగా పల్లవి ప్రశాంత్ (రైతు), అమర్ దీప్ ('జానకి కలగనలేదు' నటుడు), ప్రిన్స్ యవార్ ('నా పేరు మీనాక్షి' నటుడు), ప్రియాంక జైన్ ('జానకి కలగనలేదు' సీరియల్ నటి), శివాజీ (హీరో), అర్జున్ అంబాటీ (సీరియల్ నటుడు) మిగిలారు.

Super Star Mahesh Babu is not coming as a guest on Bigg Boss Telugu 7 Show

ఇక తాజా సమాచారం మేరకు ఇప్పటికే అర్జున్ అంబటి, ప్రియాంక ఎలిమినేట్ అయ్యారు. ఇక టాప్ 4లో ప్రిన్స్ యావర్ 15 లక్షల రూపాయలతో సూట్ కేస్ ఆఫర్ తో బయటకు వచ్చేశాడు. ఇక టాప్ 3 శివాజీ, ప్రశాంత్, అమర్ దీప్ మిగలగా.. వీరిలో శివాజీ ఎలిమినేట్ అయ్యాడు. ఇక టైటిల్ రేసులో ఇద్దరు మాత్రమే ఉన్నారు. వీరిలో ఎవరో ఒకరు కప్ కొట్టనున్నారు. ఇక ఈ విజేత అనౌన్స్ కార్యక్రమానికి సూపర్ స్టార్ మహేశ్ బాబు రానున్నారని వార్తలు వచ్చాయి.

తాజా సమాచారం మేరకు సూపర్ స్టార్ మహేశ్ బాబు బిగ్ బాస్ తెలుగు 7 ఫినాలేకి రావడం లేదని తెలుస్తోంది. ఆయన అన్నపూర్ణ స్టూడియోకి అయితే వచ్చారు కానీ... బిగ్ బాస్ తెలుగు 7 ఫినాలేకి గెస్టుగా రావడం లేదట. అన్నపూర్ణ స్టూడియోలో గుంటూరు కారం ఐటెం సాంగ్ బిజీలో ఉన్నట్లు తెలుస్తోంది. మరి విజేత అనౌన్స్ మెంట్ కు ఎవరు రానున్నారో వేచి చూడాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X