Supritha Debut Movie: సురేఖ వాణి కూతురు సినిమాల్లోకి.. బిగ్‌బాస్ కంటెస్టెంటే హీరో.. ఎవరో తెలుసా?

టాలీవుడ్ నటి సురేఖ వాణి గురించి ఆమె కూతురు సుప్రిత గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమాల్లో ఎక్కువగా కనిపించే సురేఖ వాణి సోషల్ మీడియాలో మరింత రచ్చ చేస్తుంటుంది. ముఖ్యంగా తన కూతురుతో కలిసి ఫుల్ హుషారుగా ఉంటుంది. అయితే అందంలో తల్లిన మించిపోయిన సురేఖ వాణి కూతురు కూడా సినిమాల్లోకి రాబోతుంది. ఈరోజే ఆ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడింది. అయితే సుప్రిత తొలి తెలుగు సినిమాలో హీరోగా బిగ్ బాస్ తెలుగు 7 కంటెస్టెంట్ ను తీసుకున్నారు. అతనెవరో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

సురేఖ వాణి కూతురుగా అందరికీ తెలిసిన సుప్రిత చాలా రోజులుగా సినిమాల్లోకి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. సోషల్ మీడియా వేధికగా తన అందమైన హాట్ హాట్ ఫొటోలను వదులుతూ కుర్రకారుకు గ్లామర్ ట్రీట్ ఇస్తూ... తన ఉనికిని చాటుకుంది. నెట్టింట ఫుల్ వైరల్ అయి.. తన అందం, అభినయంతో సినిమాల్లోకి రావాలని గట్టిగా ట్రై చేసిన ఈమె కష్టానికి ఫలితం దక్కింది. త్వరలోనే ఈమెను మనం వెండితెరపై చూసేయచ్చు. ముఖ్యంగా ఇటీవలే ఇన్ స్టాగ్రామ్ వేధికగా ఈ ముద్దుగుమ్మ తాను సినిమాల్లోకి రాబోతున్నట్లు తెలిపింది.

Surekha Vani Daughter Supritha Debue Movie With Bigg Boss Telugu 7 Contestant Check Details

తన అభిమానులు, నెటిజెన్లు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ.. తనను త్వరలోనే వెండితెరపై చూడొచ్చని చెప్పింది. చెప్పిన వారం, పది రోజులు కూడా గవడక ముందే గుడ్ న్యూస్ చెప్పేసిందీ క్యూట్ బ్యూటీ. ఈరోజే తన తొలి తెలుగు సినిమాకు సంబంధించిన ఈ చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ముఖ్యంగా సుప్రిత హీరోయిన్ గా రాబోతున్న ఈ సినిమాలో హీరోగా బిగ్ బాస్ తెలుగు 7 కంటెస్టెంట్ ను తీసుకున్నారట. అతడు మరెవరో కాదు.. బిగ్ బాస్ తెలుగు 7 సీజన్ లో పాల్గొని సెన్సేషన్ క్రియేట్ చేసిన, సింపథీ గేమ్ ఆడిన అమర్ దీప్.

Surekha Vani Daughter Supritha Debue Movie With Bigg Boss Telugu 7 Contestant Check Details

బిగ్ బాస్ తెలుగు 7 రన్నరప్ గా నిలిచిన ఈయన.. గతంలో పలు సీరియల్స్ తో పాటు సినిమాలు కూడా చేశాడు. కానీ బిగ్ బాస్ కు వెళ్లి వచ్చిన తర్వాత నుంచి ఈయన సినిమాల్లో కనిపించట్లేదు. కానీ ఇప్పుడు వెండితెరపై కనిపించేందుకు సిద్ధఁ అవుతున్నాడు. సురేఖ వాణి కూతురు సుప్రిత హీరోయిన్ గా, అమర్ దీప్ హీరోగా ఓ సినిమా రాబోతుంది. ఫీచర్ ఫిల్మ్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారట. పూర్తి వివరాలు తెలియాలి అంటే మాత్రం ఇంకా కొంత కాలం ఆగాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X