twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అతను బాయ్ ఫ్రెండేనా అంటూ ప్రశ్న.. సురేఖావాణి కూతురు ఘాటు రిప్లై!

    |

    సురేఖ వాణి తెలుగులో తల్లి, అక్క, వదిన పాత్రలు చేస్తూ మంచి పేరు తెచ్చుకుంది. ఆమె సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఆమె కుమార్తె సుప్రీత కూడా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. గతంలో టిక్ టాక్ వీడియోలు ఇప్పుడు ఇంస్టాగ్రామ్ రీల్స్ చేస్తూ తనదైన శైలిలో ఫాలోవర్స్ ను పెంచుకుంటూ వెళ్తోంది సుప్రీత. తాజాగా ఆమె తన ఇంస్టాగ్రామ్ వేదికగా చాట్ సెషన్ నిర్వహించింది. అందులో అనేక మంది అనేక ప్రశ్నలు అడగగా అందులో బాయ్ ఫ్రెండ్ గురించి అడిగిన ఒక ప్రశ్నకు మాత్రం దిమ్మతిరిగే ఆన్సర్ ఇచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే

    Recommended Video

    Actress Surekha Vani Panchekattu Video Goes Viral
    సోషల్ స్టార్

    సోషల్ స్టార్

    సురేఖ వాణి కుమార్తె సుప్రీతకు సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే.. సోషల్ మీడియాలో సుప్రీత చేసే హంగామా, ఆమె చేసే వీడియోలు చూసి నెటిజన్లు ఎప్పటికప్పుడు ఫిదా అవుతూ ఉంటారు. తల్లికి పోటీ ఇస్తూ హాట్ హాట్ డ్రెస్సులు వేస్తూ ఆమె తన తల్లితో కలిసి ఆమె చేసిన సందడి అంతా ఇంతా కాదు. టిక్ టాక్ బ్యాన్ చేసిన తర్వాత ఇంస్టాగ్రామ్ లో కూడా ఆమె రకరకాల వీడియోలు చేస్తూ హాట్ టాపిక్ గా మారుతూ ఉంటుంది.

    ప్రేమ వివాహమే

    ప్రేమ వివాహమే

    ఇక ఆ మధ్య తన అభిమానులతో ఒక చాట్ సెషన్ నిర్వహించిన సుప్రీత తనకు సంబంధించిన అనేక విషయాలు తన ఫాలోవర్స్ తో పంచుకుంది. ప్రేమ వివాహం చేసుకుంటారా ? లేకపోతే అరేంజ్డ్ వివాహం చేసుకుంటారా అంటే కచ్చితంగా ప్రేమ పెళ్లి చేసుకుంటానని ఆమె చెప్పుకొచ్చింది. అయితే నువ్వు వర్జినేనా ? అని ఒక నెటిజన్ ప్రశ్నించగా ఆమె ఊహించని సమాధానం ఇచ్చింది.

    సన్నిహితంగా వీడియోలలో

    సన్నిహితంగా వీడియోలలో

    ఇక మీకు నచ్చిన హీరో ఎవరు పవన్ కళ్యాణ్ లేదా ప్రభాస్ అని ప్రశ్నించగా ఎప్పటికీ పవన్ కళ్యాణ్ అని సమాధానమిచ్చింది. ఇక తాజాగా మరోసారి నెటిజన్ల మీద మండిపడింది సుప్రిత. రీసెంట్ గా సోషల్ మీడియా ద్వారా అభిమానులతో మాట్లాడిన సుప్రీత వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చింది. సుప్రీత ఫ్రెండ్స్ లో అమ్మాయిలు, అబ్బాయిలు ఇద్దరూ ఉన్నారు. అయితే ఓ అబ్బాయితో మాత్రం సుప్రీత చాలా సన్నిహితంగా వీడియోలలో కనిపిస్తూ ఉంటుంది.

    మేం బెస్ట్ ఫ్రెండ్స్

    మేం బెస్ట్ ఫ్రెండ్స్

    ఈ విషయంపై ఓ నెటిజన్ ప్రశ్నిస్తూ 'అతడు నీకేం అవుతాడు ? ఫ్రెండా ? బాయ్ ఫ్రెండా ?' అని ప్రశ్నించాడు. ఈ అంశం మీద ఘాటుగా రియాక్ట్ అయిన సుప్రీత ఘాటుగానే సమాధానం ఇచ్చింది. 'ప్రతి అమ్మాయికి అలాంటి ఒక స్నేహితుడు ఉండాలి. ఒక అబ్బాయి, అమ్మాయి స్నేహితులుగా ఉండలేరని అందరూ అనుకుంటారు. కానీ మేం స్నేహితులుగా ఉన్నాం. ఎవరేమి అనుకున్నా సరే.. ఎప్పటికీ మేం బెస్ట్ ఫ్రెండ్స్' అని ఆమె చెప్పుకొచ్చింది. ఇక గతంలో కూడా కొన్ని విషయాల్లో ఆమె ఇలా నెటిజన్స్ కు ఘాటు వార్నింగ్స్ ఇచ్చింది. మొత్తం మీద ఆమె సమాధానం ఆసక్తికరంగా మారింది.

    English summary
    Surekha Vani Daughter Supritha Strong Counter to Netizen asked for Boy friend.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X