For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  మనసున్నోడు కాదు.. డబ్బున్నోడు కావాలి.. రెండో పెళ్లిపై సురేఖా వాణి ఓపెన్ స్టేట్మెంట్

  |

  స్మాల్ స్క్రీన్‌ మీద యాంకర్ గా ఎంట్రీ ఇచ్చి తరువాత నటిగా మారిన సురేఖావాణి ఆ తరువాత ఆమె బిగ్‌ స్క్రీన్ పై కూడా తళుక్కుమని మెరిసి వరుస అవకాశాలు దక్కించుకుంది. ఇక నాలుగు పదుల వయసు దాటినా చక్కటి అందంతో పాటు ఆకట్టుకునే నటన ఆమె సొంతం. సినిమాల్లో అడపదడపా కేరక్టర్ ఆర్టిస్టుగా రాణించే సురేఖా వాణి, అటు సోషల్ మీడియాలో సైతం నిత్యం యాక్టివ్ గా ఉంటూ కుర్రకారులో ఫాలోయింగ్ పెంచుకుంటోంది. అయితే ఆమె తాజాగా తన తోటి నటి, స్నేహితురాలు అయిన రజితతో కలిసి 'ఆలీతో సరదాగా' షోకి ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె తన రెండో పెళ్లి గురించి ఈ కామెంట్స్ చేశారు. ఆ వివరాల్లోకి వెళితే

  సాక్షి అగర్వాల్.. అమ్మాయి నడుమంటే ఇలా ఉండాలి

  కూతురితో పోటీగా

  కూతురితో పోటీగా

  సినిమాల్లో పెద్దగా కనిపించకున్నా నటి సురేఖా వాణి ఇటీవల సోషల్‌ మీడియాలో మాత్రం హాట్‌ హాట్ ఫోటోలు పెడుతూ ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటుంది. కావాలని చేస్తుందో ఏమో తెలియదు కానీ ఎక్కువగా ఆమె తన హాట్ హాట్ ఫోటోలను అప్లోడ్ చేస్తూ కుర్రాళ్లలో ఇంకా ఇంకా క్రేజ్ తెచ్చుకుంటోంది. పెళ్లీడుకు వచ్చిన తన కూతురుతో కలిసి ఆమెకు పోటీ ఇస్తూ పొట్టిడ్రెస్సుల్లో అందాలు ఆరబోస్తూ సోషల్ మీడియా సెలబ్రిటీగా క్రేజ్ ఎంజాయ్ చేస్తోంది.

  హాట్ ఆశిమా నర్వాల్.. ఈ రేంజ్ లో రెచ్చగొడితే కుర్రాళ్ళు తట్టుకోగలరా?

  కేబుల్ టీవీలో మొదలు పెట్టి

  కేబుల్ టీవీలో మొదలు పెట్టి

  అయితే తాజాగా సురేఖ అలీతో సరదాగా షోకి వచ్చారు. ఆలీ యాంకర్ గా వ్యవహరిస్తున్న ఈ కార్యక్రమంలో తన జీవితానికి సంబంధించిన ఎన్నో షాకింగ్‌ విషయాలను ఆమె ప్రేక్షకులతో పంచుకున్నారు. తన కెరీర్‌ ప్రారంభమై 22 ఏళ్లు పైగా అవుతుందని పేర్కొన్న ఆమె సీటీ కేబుల్‌లో కెరీర్‌ స్టార్ట్ అయ్యిందని అక్కడ తన బాబాయ్ పని చేస్తూ ఉండడంతో ఆయన ప్రోద్బలంతో ఎంట్రీ ఇచ్చి చిన్న చిన్న ప్రోగ్రామ్స్, ఇంటర్వ్యూలు చేస్తూ ఇక్కడి దాకా వచ్చానని ఆమె చెప్పుకొచ్చింది.

  అందానికి మరో అర్దాన్ని చెబుతున్న హీనా పంచల్

  వెబ్‌సైట్ల వాళ్లకి చాలా ఇష్టం

  వెబ్‌సైట్ల వాళ్లకి చాలా ఇష్టం

  ఇక సోషల్ మీడియాలో ఫోటోల గురించి అలీ ప్రశ్నించగా తన ఫోటోలంటే యూట్యూబ్, వెబ్‌సైట్ల వాళ్లకి చాలా ఇష్టమని ఆమె చెబుతోండగా డౌట్‌గా మాట్లాడుతున్నారేంటి? అని అలీప్రశ్నిస్తారు. దీంతో మళ్ళీ ఏమంటే ఏం కాంట్రావర్సీ అవుతుందో ? అని ఆమె క్లారిటీ ఇచ్చింది. ఇంతలో పక్కనే ఉన్న రజిత మాట్లాడుతూ సురేఖకి సోషల్‌ మీడియాలో మామూలు ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ కాదు. ఒక రేంజ్ అన్నట్టు చెప్పుకొచ్చింది.

  అమేయ (అనన్య) క్యూట్ అండ్ గ్లామరస్ ఫొటోస్

  మనసుతో పనులు జరగవు

  మనసుతో పనులు జరగవు

  ఇక రెండో పెళ్లి ఎప్పుడని అలీ అడగగా ఆమె దానికి క్లారిటీ ఇచ్చింది. ఎవరో వార్తలు రాస్తే తనకెలా తెలుస్తుందని ? ఆయనెవరో మీరే చెప్పండి, చూస్తే కొంచెం డబ్బున్న వాళ్ళని చూడమని చెప్పాను అని పేర్కొంది. అయితే మనసున్న వాళ్ళు కావాలా? డబ్బున్న వాళ్ళు కావాలా? అని అలీ అడిగితే మనసుతో పనులు జరగవని అర్థమైపోయిందని, డబ్బున్న వాళ్ళయితే బెటర్ అని ఆమె చెప్పుకొచ్చింది. అయితే ఏదో పెద్ద స్టోరీ ఉంఉన్నట్టుందని అలీ అడగడంతో కచ్చితంగా ఉందని చెప్పింది.

  Actress Surekha Vani Panchekattu Video Goes Viral
  ఇప్పటికయినా సిగ్గు తెచ్చుకోవాలి

  ఇప్పటికయినా సిగ్గు తెచ్చుకోవాలి

  ఇక అనంతరం ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త సురేశ్‌ మృతి గురించి ఆమె మాట్లాడుతూ సురేఖ కన్నీటి పర్యంతం అయ్యారు. అలానే తన భర్త కుటుంబం కూడా కొన్ని అపార్థాలు, మనస్పర్థల కారణంగా దూరంగా ఉంటోందని క్లిష్ట పరిస్థితుల్లో సైతం వాళ్లు ఒక్క రూపాయి కూడా సాయం చేయలేదని చెప్పుకొచ్చింది. అన్నీ నేను, నా కూతురే సమకూర్చుకున్నామని, అయినా నన్ను, నా కూతుర్ని వాళ్లు ఎన్నో మాటలు అన్నారని అన్నారు. ఈ ప్రోగ్రామ్‌ చూశాకైనా.. నన్ను, నా కూతుర్ని అన్నందుకు వాళ్లు సిగ్గు తెచ్చుకోవాలి '' అని సురేఖ కాస్త కటువుగానే మాట్లాడారు.

  English summary
  For the past few days, it is being reported in media that popular supporting actress Surekha Vani is getting ready for a second marriage. However, she denied them as baseless rumours and asked people not to believe in them. Surekha recently appeared in ali tho saradaga show. she made some sensational comments on her second marriage.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X