సర్‌ప్రైజ్: టీవీ షోలో సందడి చేయబోతున్న ఎన్టీఆర్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ గతేడాది బిగ్‌బాస్ మొదటి సీజన్ హోస్ట్ చేసి అందరినీ ఆశ్చర్య పరిచిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ స్టార్ ఇమేజ్ మూలంగా బిగ్ బాస్ షోకు తెలుగులో ఊహించని క్రేజ్ వచ్చింది. భారీ రేటింగ్స్ సొంతం చేసుకుంది. అయితే సినిమా షూటింగుల్లో బిజీగా ఉండటం వల్ల ఎన్టీఆర్ రెండో సీజన్‌కు దూరం అయ్యారు. ఇది అభిమానులను ఎంతగానో అప్‌సెట్ చేసింది. అయితే లాంగ్ గ్యాప్ తర్వాత ఎన్టీఆర్ మళ్లీ బుల్లితెర షోలో సందడి చేయబోతున్నారు. అయితే హోస్ట్‌గా మాత్రం ఊహించుకోవద్దు.
ఈటీవీలో ప్రసారం అవుతున్న సూపర్ హిట్ డాన్స్ షో 'ఢీ 10' ఫైనల్స్‌కు చీఫ్ గెస్టుగా ఎన్టీఆర్ వచ్చారు. ఇందుకు సంబంధించిన షూటింగ్ ఇటీవల హైదరాబాద్‌లో జరిగింది. ఈ వారాంతం ఈటీవీలో తారక్ పాల్గొన్న షో ప్రసారం కాబోతోంది.

టాలీవుడ్ బెస్ట్ డాన్సర్లలో ఎన్టీఆర్ ఒకరు. డాన్స్ ప్రధానంగా సాగే ఢీ 10కు అందుకే ఆయన్ను అతిథిగా ఆహ్వానించారు. ఢీ ఫైనల్స్‌లో పోటీ దారుల నృత్య విన్యాసాలు చూసి ఎన్టీఆర్ ఆశ్చర్యపోయారట. పెద్ద పెద్ద స్టార్లు ఏమాత్రం తీసిపోని విధంగా యంగ్ జనరేషన్ డాన్సర్లు అదరగొట్టారని ఆయన పలువురు పార్టిసిపెంట్స్‌ను మెచ్చుకున్నారు.
ఢీ 10 కార్యక్రమానికి ప్రియమణి, శేఖర్ మాస్టర్, అని మాస్టర్ జడ్జిలుగా వ్యవహరిస్తుండగా యాంకర్ ప్రదీప్ మాచిరాజు ఈ షోను హోస్ట్ చేస్తున్నారు. మల్లెమాల ఎంటర్టెన్మెంట్స్ వారు ఈ కార్యక్రమాన్ని నిర్మించారు.


Click it and Unblock the Notifications











