Survey on Bigg Boss Telugu 7 ఈ వారం ఎలిమినేషన్ ఎవరు? బిగ్‌బాస్ షో తీరుపై నెటిజన్ల రియాక్షన్

బిగ్‌బాస్ తెలుగు 7 రియాలిటీ షో అట్టహాసంగా మొదలైంది. మరోసారి హోస్ట్‌గా నాగార్జున అక్కినేని తెరపైకి వచ్చి.. తనదైన శైలిలో షోను రన్ చేస్తున్నారు. తొలి విడుతగా ఇంటిలోకి 14 మంది కంటెస్టెంట్లను పంపారు. అయితే రెండోవారం మరో 7 గురు ఇంటిలోకి వస్తారనే ఊహాగానాలు మీడియాలో వస్తున్నాయి. అయితే తొలివారం కంటెస్టెంట్ల గురించి, ఆట తీరు గురించి ఫిల్మీబీట్‌ తెలుగు పోల్ నిర్వహించింది. ఈ పోల్ వివరాల్లోకి వెళితే..

బిగ్‌బాస్ తెలుగు 7 షోలో కంటెస్టెంట్ల ఎంపిక గురించి అడిగిన ప్రశ్నకు నెటిజన్లు భారీగానే సమాధానాలు వచ్చాయి. Bigg Boss Telugu 7 సీజన్‌లో కంటెస్టెంట్లు ఎలా ఉన్నారు? అనే ప్రశ్నకు.. బాగున్నారు అని 40 శాతం మంది, బాగా లేదని 20 శాతం, ఇప్పుడే చెప్పలేం అని 10 శాతం మంది చెప్పడం గమనార్హం.

Survey of Filmibeat Telugu on Bigg Boss 7 Telugu: Results are here

Bigg Boss Telugu 7 సీజన్‌ ఆసక్తికరంగా మొదలైందని మీరు భావిస్తున్నారా? అని అడిగిన ప్రశ్నకు నెటిజన్లు క్లారిటీతో సమాధానం చెప్పారు. ఇప్పుడే చెప్పలేం అని 40 శాతం మంది జవాబు చెప్పగా.. అవును అంటూ 25 శాతం, కాదు అంటూ 25 మంది ఓటు వేశారు. తొలివారమే కాబట్టి ఈ షో గురించి ఇప్పుడే నెటిజన్ల ఓ క్లారిటీ రాలేదని స్పష్టమైంది.

Bigg Boss Telugu 7 సీజన్‌‌లో ఉల్టాపుల్టా కాన్సెప్ట్ మీకు నచ్చిందా? అనే ప్రశ్నకు నెటిజన్లు సమాధానం ఇస్తూ.. ఉల్టాపుట్టా గత సీజన్ల కంటే బెటర్‌గా ఉంది అనే విధంగా జవాబిచ్చారు. నచ్చింది అనే ప్రశ్నకు 35 శాతం, నచ్చలేదు అని 15 శాతం, ఇప్పుడే ఏం చెప్పలేమని 20 శాతం మంది ఫిల్మీబీట్ ఇచ్చిన పోల్‌కు రెస్పాండ్ అయ్యారు.

బిగ్‌బాస్ తెలుగు 7 హౌస్‌కు తొలి కెప్టెన్ ఎవరు అవుతారని అడిగిన ప్రశ్నకు మంచి స్పందన లభించింది. ఎక్కువ శాతం మంది అంటే 18 శాతం నెటిజన్లు శివాజీకి కెప్టెన్ అయ్యే అవకాశం ఉందని చెప్పగా.. ఆ తర్వాత ఆట సందీప్, రతిక రోజ్, శోభా శెట్టికి ఆ అవకాశం ఉందని చెప్పారు. డాక్టర్ గౌతమ్‌కు కెప్టెన్ అయ్యే అర్హత లేదని చెప్పారు.

బిగ్‌బాస్ తెలుగు 7 షోలో తొలివారంలో ఎవరు ఎలిమినేట్ అవుతారు అని అడిగిన ప్రశ్నకు భారీ రెస్సాన్స్ లభించింది. అత్యధికంగా 31 శాతానికిపైగా కిరణ్ రాథోడ్ ఎలిమినేట్ కావడానికి అవకాశాలు ఉన్నాయి అని నెటిజన్లు అభిప్రాయపడ్డారు. పల్లవి ప్రశాంత్, డాక్టర్ గౌతమ్, సింగర్ దామిని ఎలిమినేట్ కావడానికి తక్కువ అవకాశం ఉంది అని పేర్కొన్నారు.

Survey of Filmibeat Telugu on Bigg Boss 7 Telugu: Results are here

అయితే బిగ్‌బాస్ తెలుగు 7 రియాలిటీ షోలో తొలివారం ఎలిమినేషన్ ఉండే అవకాశం లేదని తెలుస్తున్నది. ఇంకా ఇంట సభ్యులు హౌస్ మేట్స్ కాకుండా కంటెస్టెంట్లుగానే ఉన్నారు. శనివారం పవర్ అస్త్రను గెలుచుకొని తొలి ఇంటి సభ్యుడిగా ఆట సందీప్ అవకాశం పొందారు. వచ్చే వారం పవర్ అస్త్రతో కంటెస్టెంట్లను ఇంటి సభ్యులుగా మార్చే అవకాశం ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X