Survey on Bigg Boss Telugu 8 Elimination: బిగ్‌బాస్ ఇంటి నుంచి ఎవరు అవుట్.. ఏ కంటెస్టెంట్ బాగా ఆడుతున్నాడంటే ?
ఎన్నో అంచనాల మధ్య బిగ్‌బాస్ తెలుగు 8 గ్రాండ్‌గా లాంచ్ అయ్యింది. ఏడుగురు అబ్బాయిలు, ఏడుగురు అమ్మాయిల చొప్పున మొత్తం 14 మంది కంటెస్టెంట్స్ హౌస్‌లో అడుగుపెట్టారు. రోజులు గడిచేకొద్ది షో ఆసక్తికరంగా మారుతోంది. వీరిలో తొలి వారం బెజవాడ బేబక్క ఎలిమినేట్ అయ్యారు. మరి సెకండ్ వీక్ ఎవరు ఎలిమినేట్ కానున్నారు.. ఈ వారం బిగ్‌బాస్ తెలుగు 8 ఎలా గడిచింది, ఎవరెవరు ఎలా చేశారు, అనే దానిపై ఫిల్మీబీట్ సర్వే నిర్వహించింది. దీనికి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ రాగా.. ఆ రిజల్ట్స్ మీకోసం.
బిగ్‌బాస్ తెలుగు 8 షో ఎలా ఉంది?
రెండు వారాలు గడుస్తున్న నేపథ్యంలో బిగ్‌బాస్ తెలుగు 8 ఇప్పుడిప్పుడే ఉత్కంఠగా సాగుతోంది. ఈ నేపథ్యంలో బిగ్‌బాస్ షో ఎలా ఉందని ఫిల్మీబీట్ ప్రశ్నించింది. దీనికి ఆడియన్స్ ఇలా స్పందించారు. బిగ్‌బాస్ తెలుగు 8 సీజన్ ఏమాత్రం బాగోలేదని 53.33 శాతం మంది అభిప్రాయపడ్డారు. ఫర్ఫాలేదని 40 శాతం మంది ఓటేశారు, ఇక ఏం చెప్పలేమని 6.67 శాతం మంది తెలిపారు.

యష్మీ గౌడ స్పెషల్ పవర్ ఉపయోగించి ప్రేరణను సేవ్ చేస్తూ విష్ణుప్రియను నామినేట్ చేయడం కరెక్టేనా?
బిగ్‌బాస్ తెలుగు 8లో కన్నడ నటీనటులు కంటెస్టెంట్స్‌గా రావడంతో వారంతా ఓకే టీమ్‌గా ఆడుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో యష్మీ గౌడ స్పెషల్ పవర్ ఉపయోగించి ప్రేరణను సేవ్ చేస్తూ విష్ణుప్రియను నామినేట్ చేయడం కరెక్టేనా అని ఫిల్మీబీట్ ప్రశ్నించింది. దీనికి ఆడియన్స్ ఇలా స్పందించారు. కాదు అని 50 శాతం మంది అభిప్రాయపడగా.. అవును అని 28.57 శాతం మంది చెప్పారు. 21.43 శాతం మంది చెప్పలేమన్నారు.
బిగ్‌బాస్ తెలుగు 8 షోలో కంటెస్టెంట్ల ప్రవర్తన ఎలా ఉంది?
రెండు వారాలు గడిచిన బిగ్‌బాస్ తెలుగు 8లో కంటెస్టెంట్స్ మధ్య ఇప్పుడిప్పుడే బాండింగ్ పెరుగుతోంది. ఆటపైనా ఓ క్లారిటీ రావడంతో షో రసవత్తరంగా సాగుతోంది. ఈ నేపథ్యంలో హౌస్‌లో కంటెస్టెంట్ల ప్రవర్తన ఎలా ఉందని ఫిల్మీబీట్ ప్రశ్నించగా.. బాగాలేదని 53.85 శాతం మంది తేల్చిచెప్పారు. బాగుందని 23.03 శాతం, చెప్పలేమని 23.08 శాతం మంది అభిప్రాయపడ్డారు.

బిగ్‌బాస్ తెలుగు 8 షోలో 2వ వారంలో ఎవరు ఎలిమినేట్ అవుతారని భావిస్తున్నారు?
బిగ్‌బాస్ తెలుగు 8 అప్పుడే సెకండ్ వీకెండ్‌కు చేరుకోగా.. ఎవరు ఎలిమినేట్ అవుతారోనన్న ఉత్కంఠ నెలకొంది. దీంతో ఈవారం నామినేషన్స్‌లో ఉన్న ఎనిమిది మంది కంటెస్టెంట్స్ పేర్లను ఫిల్మీబీట్ ప్రస్తావించి, వీరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారో చెప్పమని అడిగింది. దీనికి ఆడియన్స్ ఇలా స్పందించారు. ఇందులో మణికంఠకు 5.88 శాతం , శేఖర్ భాషాకు 23.53 శాతం , విష్ణుప్రియకు 0 శాతం, పృథ్వీరాజ్‌కు 11.76 శాతం, ఆదిత్య ఓంకు 35.29 శాతం, నిఖిల్ 17.65 శాతం, సీతకు 0 శాతం, నైనికకు 5.88 శాతం ఓట్లు పోలయ్యాయి. మొత్తంగా బిగ్‌బాస్ తెలుగు 8లో సెకండ్ వీక్‌లో ఆదిత్య ఓం ఎలిమినేట్ అవుతారని ఆడియన్స్ అభిప్రాయపడ్డారు. చూద్దాం మరి ఏం జరుగుతుందో..


Click it and Unblock the Notifications











