Survey on Bigg Boss Telugu 8 Elimination: మణికంఠ నిర్ణయం కరెక్టేనా? .. బిగ్‌బాస్ నుంచి ఈ వీక్ ఎవరు ఔట్?

ఎన్నో అంచనాల మధ్య బిగ్‌బాస్ తెలుగు 8 గ్రాండ్‌గా లాంచ్ అయ్యింది. ఏడుగురు అబ్బాయిలు, ఏడుగురు అమ్మాయిల చొప్పున మొత్తం 14 మంది కంటెస్టెంట్స్ హౌస్‌లో అడుగుపెట్టారు. ఆ తర్వాత ఐదో వారంలో 8 మందిని వైల్డ్ కార్డ్ ద్వారా హౌస్‌లోకి పంపారు. వారు గంగవ్వ, హరితేజ, ముక్కు అవినాష్, నయని పావని, టేస్టీ తేజా, మెహబూబ్, గౌతంకృష్ణ, రోహిణి. వీరి రాకతో ది షో ఆసక్తికరంగా మారుతోంది.

ఇప్పటి వరకు బెజవాడ బేబక్క, ఆర్జే శేఖర్ భాషా, అభయ్ నవీన్, సోనియా ఆకుల , ఆదిత్య ఓం, నైనిక, కిర్రాక్ సీత, నాగ మణికంఠ హౌస్‌ను వీడారు. మరి ఈ ఆదివారం ఎవరు ఎలిమినేట్ కానున్నారు.. ఈ వారం బిగ్‌బాస్ తెలుగు 8 ఎలా గడిచింది, ఎవరెవరు ఎలా చేశారు, వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన రాయల్ క్లాన్ మెంబర్స్‌తో యూజ్ ఉందా, అనే దానిపై ఫిల్మీబీట్ సర్వే నిర్వహించింది. దీనికి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ రాగా.. ఆ రిజల్ట్స్ మీకోసం.

Survey on Elimination and Nominations in Bigg Boss Telugu 8 Show By Filmibeat

పృథ్వీతో విష్ణుప్రియ లవ్ అండ్ రొమాన్స్ ట్రాక్ ఎలా అనిపిస్తున్నది?

బిగ్‌బాస్ తెలుగు 8లో ప్రేమ పక్షులుగా గుర్తింపు తెచ్చుకున్నారు పృథ్వీ - విష్ణుప్రియ. అయితే కంటెస్టెంట్స్ కారణంగా వీరిద్దరూ కాస్త దూరమైనట్లుగా కనిపిస్తున్నా.. తెర వెనుక ప్రేమాయణం నడుపుతున్నారనే టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో పృథ్వీతో విష్ణుప్రియ లవ్ అండ్ రొమాన్స్ ట్రాక్ ఎలా అనిపిస్తున్నదని ఫిల్మీబీట్ ప్రశ్నించగా.. బాలేదని 57.89 శాతం మంది అభిప్రాయపడ్డారు. చెప్పలేమని 26.32 శాతం మంది.. పృథ్వీతో విష్ణు రొమాన్స్ బాగుందని 15.79 శాతం మంది ఓటేశారు.

Survey on Elimination and Nominations in Bigg Boss Telugu 8 Show By Filmibeat

బిగ్‌బాస్ నుంచి ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారని మీరు భావిస్తున్నారు?

ఈ వారం ఆరుగురు కంటెస్టెంట్స్‌ హౌస్‌లో ఉండగా.. 8వ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారని ఫిల్మీబీట్ ప్రశ్నించింది. వీరిలో 33.33 శాతం మంది నయని పావని ఎలిమినేట్ అవుతారని అభిప్రాయపడ్డారు. తర్వాత పృథ్వీరాజ్ హౌస్‌ను వీడతాడని 25.93 శాతం మంది, మెహబూబ్ వెళ్లిపోతాడని 18.52 శాతం మంది పేర్కొన్నారు. ఇక విష్ణుప్రియ (11.11 శాతం), నిఖిల్ (7.41 శాతం), ప్రేరణ (3.7 శాతం)లకు ఓటింగ్ లభించింది.

Survey on Elimination and Nominations in Bigg Boss Telugu 8 Show By Filmibeat

బిగ్‌బాస్ షో నుంచి నాగ మణికంఠ సెల్ఫ్ ఎలిమినేషన్ కరెక్టేనా?

బిగ్‌బాస్ తెలుగు 8లో స్ట్రాంగ్ కంటెస్టెంట్స్‌లో ఒకరైన నాగ మణికంఠ ఎలిమినేట్ కావడాన్ని ప్రేక్షకులు జీర్ణించుకోలేకపోయారు. ఈ నేపథ్యంలోనే బిగ్‌బాస్ షో నుంచి నాగ మణికంఠ సెల్ఫ్ ఎలిమినేషన్ కరెక్టేనా? అని ఫిల్మీబీట్ ప్రశ్నించగా.. దాదాపు 50 శాతం మంది కరెక్టేనని అభిప్రాయపడ్డారు. 40 శాత మంది ఔను అని.. చెప్పలేమని 10 శాతం మంది పేర్కొన్నారు.

Survey on Elimination and Nominations in Bigg Boss Telugu 8 Show By Filmibeat

బిగ్‌బాస్ ఇంటిలో యష్మి కన్నింగ్ అని మీరు అనుకొంటున్నారా?

బిగ్‌బాస్ తెలుగు 8లో యష్మి తన గేమ్ ప్లాన్‌తో స్ట్రాంగ్ కౌంటర్‌గా నిలుస్తున్నారు. అయితే కన్నింగ్ ఆట ఆడుతుందని అదే స్థాయిలో కౌంటర్లు కూడా పడుతున్నాయి. ఈ నేపథ్యంలో బిగ్‌బాస్ ఇంటిలో యష్మి కన్నింగ్ అని మీరు అభిప్రాయపడుతున్నారా అని ఫిల్మీబీట్ ప్రశ్నించగా.. 66.67 శాతం మంది ఔను అని అభిప్రాయపడ్డారు. 16.67 శాతం మంది కాదు అని.. అంతే మంది చెప్పలేమని ఓటేశారు.

Survey on Elimination and Nominations in Bigg Boss Telugu 8 Show By Filmibeat

వైల్డ్ కార్డ్ ఎంట్రీల ద్వారా ఎంట్రీ ఇచ్చిన కంటెస్టెంట్లలో ఎవరు బాగా ఆడుతున్నారు?

సీజన్ 8లో వైల్డ్ కార్డ్ ద్వారా దాదాపు 8 మంది కంటెస్టెంట్స్ హౌస్‌లోకి అడుగుపెట్టారు. వీరు ఎలా ఆడతున్నారని ఫిల్మీబీట్ ప్రశ్నించగా.. అవినాష్‌కు అత్యధికంగా 36.67 శాతం మంది జై కొట్టారు. గంగవ్వ, గౌతమ్, రోహిణిలకు 13.33 శాతం మంది మద్ధతు పలికారు. టేస్టీ తేజ బాగా ఆడుతున్నారని 10 శాతం మంది అభిప్రాయపడ్డారు. 6.67 శాతం మంది హరితేజ బాగా ఆడుతుందని చెప్పారు. నయని పావని, మెహబూబ్‌లు బాగా ఆడుతున్నారని 3.33 శాతం మంది పేర్కొన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X