Survey on Bigg Boss Telugu 8 Elimination: బిగ్‌బాస్ ఇంటి నుంచి ఎవరు అవుట్.. హోస్ట్ నాగార్జున షో ఎలా ఉందంటే?
ఎన్నో అంచనాల మధ్య బిగ్‌బాస్ తెలుగు 8 గ్రాండ్‌గా లాంచ్ అయ్యింది. ఏడుగురు అబ్బాయిలు, ఏడుగురు అమ్మాయిల చొప్పున మొత్తం 14 మంది కంటెస్టెంట్స్ హౌస్‌లో అడుగుపెట్టారు. రోజులు గడిచేకొద్ది షో ఆసక్తికరంగా మారుతోంది. అప్పుడే ఫస్ట్ వీకెండ్‌కు షో చేరుకోగా.. వీరిలో ఒకరు ఎలిమినేట్ కానున్నారు. మరి ఈ వారం బిగ్‌బాస్ తెలుగు 8 ఎలా గడిచింది, ఎవరెవరు ఎలా చేశారు, ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారనే దానిపై ఫిల్మీబీట్ సర్వే నిర్వహించింది. దీనికి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ రాగా.. ఆ రిజల్ట్స్ మీకోసం.
బిగ్‌బాస్ తెలుగు 8 గ్రాండ్ ఓపెనింగ్ షో ఎలా ఉంది?
సెప్టెంబర్ 1న బిగ్‌బాస్ తెలుగు 8వ సీజన్ గ్రాండ్‌గా ప్రారంభమైంది. ప్రతి సీజన్ మాదిరిగానే ఈసారి కూడా లాంచింగ్ ఎపిసోడ్‌ను అదరగొట్టేశారు నాగార్జున. హోస్ట్‌గా ఆయనకున్న ఎక్స్‌పీరియన్స్‌లో అలవోకగా చేసుకుంటూ వెళ్లిపోయారు. కంటెస్టెంట్స్ ఒక్కొక్కరిని పరిచయం చేస్తూ వారికి ఆల్ ది బెస్ట్ చెప్పారు. లాంచింగ్ డే నాడు పలువురు సెలబ్రెటీలు హౌస్‌లో సందడి చేశారు. మరి బిగ్‌బాస్ తెలుగు 8 గ్రాండ్ ఓపెనింగ్ షో ఎలా ఉంది అని ఫిల్మీబీట్ ప్రశ్నించగా.. ఆడియన్స్ ఇలా స్పందించారు. లాంచింగ్ ఎపిసోడ్ బాగోలేదని దాదాపు 40.91 శాతం మంది అభిప్రాయపడ్డారు. ఏం చెప్పలేమని 31.82 శాతం మంది, బాగుందని 27.27 శాతం మంది అభిప్రాయపడ్డారు.

నాగార్జున అక్కినేని హోస్టింగ్ ఎలా అనిపించింది?
బిగ్‌బాస్ తెలుగు ప్రారంభమైన నాటి నుంచి 8 సీజన్లు జరగ్గా.. కేవలం రెండు సార్లు మాత్రమే నాగార్జున హోస్టింగ్ చేయలేకపోయారు. మిగిలిన అన్ని సార్లు ఆయనే వ్యాఖ్యాతగా వ్యవహరించారు. బిగ్‌బాస్ షోకు నాగార్జున పెద్దె ఎస్సెట్ అంటుంటారు బుల్లితెర ప్రేక్షకులు. స్పాంటెనిటి, హుందాతనం మిక్స్ చేసి డిగ్నిఫైడ్‌గా బిగ్‌బాస్‌ను తన భుజస్కందాలపై నడిపిస్తున్నారు నాగ్. ఈ నేపథ్యంలో బిగ్‌బాస్ తెలుగు 8 లాంచింగ్ డే నాడు నాగార్జున హోస్టింగ్ ఎలా అనిపించిందని ఫిల్మీబీట్ ప్రశ్నించగా.. ఆడియన్స్ ఇలా స్పందించారు. నాగ్ హోస్టింగ్ బాగుందని 50 శాతం మంది ఓటేశారు. బాగోలేదని 30.77 శాతం మంది, ఏం చెప్పలేమని 19.23 శాతం మంది ప్రేక్షకులు అభిప్రాయపడ్డారు.
బిగ్‌బాస్ తెలుగు 8 కంటెస్టెంట్ల ఎంపిక ఎలా ఉంది?
బిగ్‌బాస్ తెలుగు గత సీజన్‌లలో ముక్కూ మొహం తెలియని చాలా మందిని కంటెస్టెంట్స్‌గా తీసుకొచ్చారు. దీంతో 8వ సీజన్‌లో ఎలాంటి వారు ఎంట్రీ ఇస్తారోనని ప్రేక్షకులు ఉత్కంఠగా ఎదురుచూశారు. ఈ నేపథ్యంలో బిగ్‌బాస్ తెలుగు 8లో కంటెస్టెంట్స్‌గా వచ్చిన వారి ఎంపికపై ఫిల్మీబీట్ ప్రశ్నించగా.. ఆడియన్స్ ఇలా స్పందించారు. కంటెస్టెంట్స్ ఎంపిక బాలేదని 57.69 శాతం మంది అభిప్రాయపడ్డారు. ఏం చెప్పలేమని 26.92 శాతం, బాగుందని 15.38 శాతం మంది పేర్కొన్నారు.

బిగ్‌బాస్ తెలుగు 8 షోలో మొదటివారం ఎవరు ఎలిమినేట్ అవుతారు?
బిగ్‌బాస్ తెలుగు 8 అప్పుడే వీకెండ్‌కు చేరుకోగా.. ఎవరు ఎలిమినేట్ అవుతారోనన్న ఉత్కంఠ నెలకొంది. దీంతో ఈవారం నామినేషన్స్‌లో ఉన్న ఆరుగురు కంటెస్టెంట్స్ పేర్లను ఫిల్మీబీట్ ప్రస్తావించి, వీరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారో చెప్పమని అడిగింది. దీనికి ఆడియన్స్ ఇలా స్పందించారు. ఇందులో మణికంఠకు 29.41 శాతం మంది ఓట్లేసి ఆయనే ఎలిమినేట్ అవుతారని చెప్పారు. ఈ లిస్ట్‌లో బేబక్క , శేఖర్ భాషాలకు చెరో 23.53 శాతం ఓట్లు దక్కగా.. విష్ణుప్రియకు 11.76 శాతం, పృథ్వీరాజ్‌కు 5.88 శాతం, సోనియా ఆకులకు 5.88 శాతం ఓట్లు పోలయ్యాయి.


Click it and Unblock the Notifications











