హీరోయిన్ కళ్యాణితో విడాకులపై స్పందించిన సూర్య కిరణ్, కంటతడి పెడుతూ.. ఇంకా గుండెల్లోనే..

బిగ్ బాస్ సీజన్ 4తో చాలా రోజుల తరువాత ప్రేక్షకుల ముందుకు వచ్చాడు సూర్య కిరణ్. సత్యం, ధన 51వంటి సినిమాలను డైరెక్ట్ చేసి ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన అనంతరం ఈ దర్శకుడు వరుస ఇంటర్వ్యూలలో తన కెరీర్ గురించి అలాగే పర్సనల్ విషయాల గురించి కూడా ఓపెన్ గానే చెప్పేస్తున్నాడు. ఇక హీరోయిన్ కళ్యాణ్ తో విడాకులపై కూడా స్పందించాడు.

మొదటిసారి కలిసింది అక్కడే

మొదటిసారి కలిసింది అక్కడే

సూర్య కిరణ్, కళ్యాణి ఇద్దరు కూడా కలిసి పని చేయలేదు. కానీ ఒకరినొకరు ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. పెదబాబు షూటింగ్ జరుగుతున్నప్పుడు ఆ సినిమా నిర్మాతతో మాట్లాడడానికి వచ్చిన సూర్య కిరణ్ అప్పుడే మొదటిసారి కళ్యానిని కలిశారు. ఆ తరువాత ఇతర సినిమాల మీటింగ్ లలో కూడా వారి పరిచయం స్నేహంగా మారింది. ఇద్దరు మళయాలి కావడంతో కుటుంబ సభ్యులను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు.

విడిపోయి ఏళ్ళు గడుస్తున్నా

విడిపోయి ఏళ్ళు గడుస్తున్నా

కానీ వారి దాంపత్య జీవితం ఎక్కువ రోజులు కొనసాగలేదు. సూర్య కిరణ్ పెళ్లి ఎంత సైలెంట్ గా చేసుకున్నారో అలాగే విడాకులు కూడా అంతే సైలెంట్ గా తీసుకున్నారు. ఆ విషయం ఎక్కువగా బయటకు రానివ్వలేదు. విడిపోయి ఏళ్ళు గడుస్తున్నా ఇంకా నా గుండెల్లో ఆమెనే ఉందని సూర్య కిరణ్ ఇంటర్వ్యూలలో భావోద్వేగానికి గురవుతున్నారు.

కళ్యాణి తప్ప మరొకరిని ఇష్టపడలేదు

కళ్యాణి తప్ప మరొకరిని ఇష్టపడలేదు

కళ్యాణితో విడిపోవడానికి గల అసలు విషయాన్ని చెప్పడం లేదు గాని ఈ జన్మకు ఆమెనే తన భార్య అని చెబుతున్నాడు. సూర్య కిరణ్ మాట్లాడుతూ.. నా తల్లి తరువాత, నా చెల్లెళ్ళ తరువాత అంతగా నేను ఎక్కువగా గౌరవించేది ఇష్టపడేది కల్యాణిని మాత్రమే. ఆమె స్థానాన్ని మరొకరు భర్తీ చేయలేరు. అలాగే కళ్యాణి కంటే మరొకరు నా మనసుకు అందంగా కనిపించడం లేదు.

Recommended Video

Bigg Boss Telugu 4 : Episode 10 Highlights
తనకు నేను అవసరం లేదేమో అనిపించింది

తనకు నేను అవసరం లేదేమో అనిపించింది

కళ్యాణి అంటే నాకు ఎప్పటికైనా ఇష్టమే. ఆమెపై ఇష్టం పోదు. కానీ తనకు నేను అవసరం లేదేమో అనిపించింది. ఇక ఏ హీరోయిన్ ని చూసిన కళ్యాణి అంత బావుండాలని నా అసిస్టెంట్స్ తో చెబుతుంటాను. నా ఫోన్ లో అయినా ఐపాడ్ లో అయినా ఎక్కువగా కళ్యాణి ఫొటోలు ఉంటాయి. మా అమ్మ ఆ విషయంలో నన్ను తిడుతుంది. ఇంకా ఆ అమ్మాయి ఫొటోలు ఎందుకు పెట్టుకున్నావ్ రా సిగ్గు లేకుండా అని అంటారు. నిజంగా తనంటే చాలా ఇష్టం.. ఈ జన్మకు ఇది చాలు.. అంటూ సూర్య కిరణ కంటతడి పెడుతూ కళ్యాణిని మిస్ అవుతున్నట్లు చెప్పాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X