బిగ్‌బాస్ నుంచి సూర్య కిరణ్ అవుట్.. పాపం మోనాల్ అలా బుక్కై.. ఇంట్లోకి దొంగలా కొత్త సెలబ్రిటీ!

సండే ఎలిమినేషన్ ప్రక్రియ లాంటి సీరియస్ విషయం ఉండటంతో ఇంటి సభ్యులను పాటలతో హుషారెత్తించేందుకు బిగ్‌బాస్ ప్లాన్ చేశారు. ఆ తర్వాత ఒక్కొక్కరిని ఎలిమినేట్ చేస్తూ ఆటను కొనసాగించారు. ప్రతీ ఎలిమినేషన్ మధ్యలో గేమ్ ఆడిస్తూ సరదాగా సండే ఎపిసోడ్‌ను ముగించారు. ఒకరిని ఇంటి నుంచి ఎలిమినేట్ చేసి.. మరొకరని ఇంటిలోకి పంపించారు. ఇంటి నుంచి బయటకు.. బయట నుంచి ఇంట్లోకి వెళ్లిన ా ఇద్దరు ఎవరంటే..

Recommended Video

Bigg Boss Telugu 4 : Episode 8 Highlights,సూర్య కిరణ్ ఎలిమినేటెడ్!
మంచి జోష్‌ ఉన్న పాటలకు డ్యాన్స్

మంచి జోష్‌ ఉన్న పాటలకు డ్యాన్స్


జిగేల్ రాణి పాటకు మెహబూబ్, మోనాల్ డ్యాన్స్ చేయగా, పెద్దపులి పాటకు సోహైల్, కరాటే కల్యాణి, నీతోనే డ్యాన్స్ నైట్ దేత్తడి హారిక, నోయల్, సీటిమార్ సీటీ మార్ పాటకు దేవీ నాగవళ్లి, అభిజిత్, మైండ్ బ్లాంక్ పాటకు అఖిల్, దివి వద్యా, నాది నక్లీస్ పాటకు సూర్య కిరణ్, లాస్య చేశారు. నాగార్జున, అమ్మా రాజశేఖర్ జడ్జీలుగా వ్యవహరించారు. ఫ్రెండ్లీ పోటీగా గంగవ్వ, అమ్మా రాజశేఖర్ ఖైదీ నంబర్ 150 పాటకు డ్యాన్స్ చేయగా కంటెస్టెంట్లందరూ స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు. అమ్మాయిల టీమ్‌కు 91 మార్కులు, అబ్బాయిల టీమ్‌కు 88 మార్కులు వచ్చాయి. అమ్మాయిల టీమ్ గెలిచినందుకు కూల్ డ్రింక్స్ గిఫ్టుగా ఇచ్చారు.

అఖిల్ సార్థక్ అలా సేఫ్

అఖిల్ సార్థక్ అలా సేఫ్

ఎలిమినేషన్ ప్రక్రియలో పాటను ప్లే చేసి అందులో ఎవరి పేరు ఉంటే వారు సేఫ్ అంటూ నాగార్జున క్లారిటీ ఇచ్చారు. అఖిల్ చిత్రంలో పాటను మొదలు పెట్టగానే అఖిల్ సార్థక్ ఎగిరి గంతేశాడు. ఆ పాటలో అఖిల్ పేరు ఉండటంతో తొలి ఎలిమినేషన్ నుంచి సేఫ్ అయ్యారు. దాంతో ఆయన లేచి మంచి జోష్‌తో స్టెప్పలు వేసి డ్యాన్స్ చేశారు. ప్యాంట్ బిగుతుగా ఉన్నప్పటికీ బాగానే డ్యాన్స్ చేశాడంటూ నాగార్జున కామెంట్ చేశారు.

రైమ్స్.. డ్రాయింగ్‌తో ఫన్నీగా

రైమ్స్.. డ్రాయింగ్‌తో ఫన్నీగా

మరో ఎలిమినేషన్ ముందు ఇంటిలో ఇంటి సభ్యులతో గేమ్ ఆడించారు. కనెక్షన్ టీమ్ మధ్య అవగాహన ఎలా ఉందో టెస్ట్ చేయడానికి సామెతలు, రైమ్స్ బాక్సులో ఉన్న చిట్టీల తీసి.. ఆ చిట్టిలో ఉన్న రైమ్స్‌ను డ్రాయింగ్ వేస్తే దానిని గుర్తించి ఆ రైమ్ ఏంటో చెప్పాలి. అలా గేమ్‌ను ఇంటి సభ్యులతో సరదాగా ఆడించారు. గేమ్ ముగిసిన తర్వాత ఓ రైమ్ తీసుకొని కరాటే కల్యాణితో హరికథ చెప్పించారు.

ఎలిమినేషన్ వేటు తప్పించుకొన్న మెహబూబ్

ఎలిమినేషన్ వేటు తప్పించుకొన్న మెహబూబ్

ఇక ఎలిమినేషన్ రౌండ్‌లో భాగంగా ఓ పెయింటింగ్ బొమ్మను చూపిస్తాను. ఆ బొమ్మలో ఉన్న వ్యక్తి ఎలిమినేషన్ నుంచి తప్పించుకొంటారు అని నాగ్ చెప్పారు. ఆ తర్వాత ఓ పెయింటింగ్‌ను బయటకు తీయగా అందులో మెహబూబ్ బొమ్మ రావడంతో ఆయన ఆశ్చర్యంలో మునిగితేలారు. ఇంటి సభ్యులు మెహబూబ్‌కు కంగ్రాట్స్ చెప్పారు.

సూర్య కిరణ్ పేరు చెప్పిన మోనాల్..

సూర్య కిరణ్ పేరు చెప్పిన మోనాల్..

చివరి ఎలిమినేషన్ కోసం మోనాల్ గజ్జర్‌ను రంగంలోకి దించారు. మోనాల్ చేతితో గ్లాస్ ఇచ్చిన వారు ఎలిమినేట్ అవుతారు అంటూ నాగ్ చెప్పారు. దివి వద్య, సూర్య కిరణ్ నిలబడి ఉంటే.. ఎవరు ఎలిమినేట్ అవుతారనే అని నాగ్ అడిగితే.. మోనాల్.. సూర్య కిరణ్ అంటూ చెప్పారు. అయితే ఎందుకు ఇంకా ఆలోచిస్తున్నావ్.. గ్లాస్ వాటర్ ఇచ్చేయ్ అంటూ నాగ్ అన్నారు. ఆ తర్వాత సూర్య కిరణ్ ఎలిమినేటెడ్.. దివి సేఫ్ అంటూ చెప్పడంతో అందరూ షాక్ అయ్యారు. ఆ తర్వాత మొబైల్ ఫోన్‌తో ఇంటి సభ్యులతో గ్రూప్ ఫోటో దిగి సూర్య కిరణ్ వేదికపైకి వచ్చారు.

వేదికపై మనసు గెలచుకొన్న సూర్య కిరణ్

వేదికపై మనసు గెలచుకొన్న సూర్య కిరణ్

నాగార్జునతో వేదికపై తన వారం రోజుల జర్నీని చూసిన తర్వాత ఇంటి సభ్యుల గురించి, వారి ప్రవర్తన గురించి చెప్పాడు. గంగవ్వ గురించి చెప్పిన తీరు అద్భుతంగా ఉంది. అలాగే దేవీ, దివి, కరాటే కళ్యాణి గురించి మంచి మాటలు చెప్పారు. అలాగే మెహబూబ్‌కు స్ఫూర్తి దాయకమైన మాటలు చెప్పారు దేత్తడి హారికపై మండిపడ్డారు. అలా ప్రతీ ఒక్కరి గురించి తన అభిప్రాయాలను, వారికి సరిపడే జంతువుపై వారి పేరును పెట్టి వర్ణించాడు.

కమెడియన్ కుమార్ సాయి ఎంట్రీ

కమెడియన్ కుమార్ సాయి ఎంట్రీ

ఇంటి నుంచి ఎలిమినేట్ అయిన తొలి కంటెస్టెంట్ సూర్య కిరణ్ అయితే.. ఆయన స్థానంలోకి మరో కంటెస్టెంట్ వైల్డ్ కార్డు ఎంట్రీతో అడుగుపెట్టబోతున్నట్టు హోస్ట్ నాగార్జున చెప్పారు. ఇంట్లోకి వెళ్లే సెలబ్రిటీగా కుమార్ సాయిని పరిచయం చేశారు. వేదికపై నుంచి ఆయను ఇంటిలోకి పంపించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X