పర్సనల్ సీక్రెట్ చెప్పేసిన భర్త.. అది ఎందుకు చెప్పాడు.. డర్టీ ఫెల్లో అంటూ కస్సుమన్న అనసూయ!!

ఎంత సెలెబ్రిటీ అయినా పిల్లలకు తల్లే.. భర్తకు భార్యే. భార్యాభర్తలన్నాక సీక్రెట్స్ ఎన్నో ఉంటాయి. ఇంట్లో ఓ రకంగా ఉంటారు.. బయట ఇంకో రకంగా ఉంటారు. అయితే తాజాగా అనసూయ ఇంట్లో ఎలా ఉంటుంది?, ఆమె మనస్తత్వం ఏంటన్నది అనసూయ భర్త సుశాంక్ లీక్ చేశాడు. అనసూయ తాజాగా అలీతో సరదాగా అనే ప్రోగ్రాంలో గెస్ట్‌గా విచ్చేసింది. ఆ షోలో అనసూయ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలెన్నింటినో షేర్ చేసుకుంది.

తొమ్మిదేళ్ల ప్రేమ..

తొమ్మిదేళ్ల ప్రేమ..

అనసూయ తన ప్రేమ కథ గురించి వివరించింది. ఎన్‌సీసీలో శిక్షణ తీసుకుంటుండగా.. సుశాంక్ పరిచయం అయ్యాడని, ఐ లవ్యూ అని కాకుండా పెళ్లి చేసుకుందామా? అని అడిగినట్టు తెలిపింది. ఇదే విషయాన్ని అమ్మకే మొదట చెప్పానని, నాన్న ఒప్పుకోకపోయినా.. తొమ్మిదేళ్లు ఎదురుచూసి అందరి అంగీకారంతో పెళ్లి చేసుకున్నామని తన ప్రేమ పురాణాన్ని వివరించింది.

మొదటి ట్రోలింగ్ అలా..

మొదటి ట్రోలింగ్ అలా..

ట్రోలింగ్‌కు, వివాదాలకు అనసూయ కేరాఫ్ అడ్రస్‌గా ఉంటుందన్న సంగతి తెలిసిందే. అత్తారింటికి దారేది సినిమాలోని ఇట్స్ టైమ్ టు పార్టీ సాంగ్ మీద చేసిన కామెంట్‌తో తనపై ట్రోలింగ్ మొదలైందని చెప్పుకొచ్చింది. అయితే ఆ సమయంలో బాగా సెన్సిటివ్‌గా ఉండేదాన్ని అని అనసూయ పేర్కొంది.

ఇప్పుడు రాటుదేలాను..

ఇప్పుడు రాటుదేలాను..

అయితే మొదట్లో తాను ఈ ట్రోలింగ్ వల్ల డిప్రెషన్‌లోకి వెళ్లానని, ఎన్నో రాత్రులు ఏడ్చుకుంటూ ఉండేదాన్ని అని అనసూయ తెలిపింది. కానీ రానూ రానూ బాగా రాటు దేలిపోయానని పేర్కొంది. ఇప్పుడు ఎవరూ ఏమన్నా పట్టించుకోనని, ఏడ్వడం లేదని, ధీటుగా సమాధానాలిస్తున్నానని చెప్పుకొచ్చింది.

ఇంట్లో మాత్రం అలా..

ఇంట్లో మాత్రం అలా..

ఇంట్లో మాత్రం హెయిర్ పిన్ కనిపించకపోయినా భోరు మని ఏడుస్తావట కదా? అని అలీ ప్రశ్నించాడు. ఇది మీకెలా తెలిసింది.. అది మా పర్సనల్ సీక్రెట్ కదా ఎవరు చెప్పారు అని అనసూయ ఆశ్చర్యం వ్యక్తం చేసింది. సుశాంక్ ఫోన్ చేసి చెప్పాడని అలీ అనగానే..డర్టీ ఫెల్లో అలా ఎలా చెప్పాడంటూ భర్తపై ముద్దుగా అలిగింది.

Recommended Video

Anasuya Bharadwaj Likely To Out From Jabardasth Show
డర్టీ ఫెల్లోస్..

డర్టీ ఫెల్లోస్..

ఇక అనసూయ తన పిల్లలు మాట్లాడిన ముద్దు ముద్దు మాటలకు ఫిదా అయిపోయింది. అయితే ఇళ్లంతా చిందరవందర చేయడం, ప్యాంట్ వేసుకోకపోవడంతో డర్టీ ఫెలోస్ అంటూ పిల్లలపై తియ్యగా కస్సుమంది. దీన్ని బట్టిచూస్తే డర్టీ ఫెల్లోస్ అనేది అనసూయ ఊత పదంలా కనిపిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X